iDreamPost
android-app
ios-app

Mohammed Shami: పట్టరాని సంతోషంలో మహ్మద్ షమి.. తన కల నెరవేరిందంటూ..!

  • Published Jan 09, 2024 | 9:25 AM Updated Updated Jan 09, 2024 | 9:25 AM

టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమి ఇప్పుడు పట్టరాని సంతోషంలో ఉన్నాడు. మొత్తానికి తన కల నెరవేరిందని అన్నాడు షమి.

టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమి ఇప్పుడు పట్టరాని సంతోషంలో ఉన్నాడు. మొత్తానికి తన కల నెరవేరిందని అన్నాడు షమి.

  • Published Jan 09, 2024 | 9:25 AMUpdated Jan 09, 2024 | 9:25 AM
Mohammed Shami: పట్టరాని సంతోషంలో మహ్మద్ షమి.. తన కల నెరవేరిందంటూ..!

మనం ఏ రంగంలో పని చేస్తున్నా అందులో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్నామా లేదా అనేదే ముఖ్యం. అప్పుడే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే ఏదో ఒకరోజు తగిన గుర్తింపు కూడా వస్తుంది. తాము ఎంచుకున్న రంగాల్లో కఠోరంగా శ్రమిస్తూ అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వారిని చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో అవార్డులు, రివార్డులు కూడా వారి ముందట సాగిలపడటం సాధారణమే. క్రీడల్లోనూ ప్రతి ఆటగాడు తనకు గుర్తింపు, అవార్డులు దక్కాలని కోరుకుంటారు. అయితే కొందరికి ఇది వెంటనే దక్కితే.. మరికొందరికి మాత్రం కాస్త సమయం పడుతుంది. తమ అద్వితీయ ప్రతిభకు తగ్గట్లు అత్యున్నత పురస్కారం దక్కితే మాత్రం ప్లేయర్ల ఆనందానికి హద్దులు ఉండవు. భారత స్టార్ పేసర్ మహ్మద్ షమి ఇప్పుడీ స్థితిలోనే ఉన్నాడు. అర్జున అవార్డు దక్కడంతో పట్టరాని సంతోషంగా ఉన్నాడు షమి.

దేశంతో రెండో అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున అవార్డు దక్కడంపై షమి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ పురస్కారం దక్కడం తన కల అని తెలిపాడు. మొత్తానికి దీన్ని సాధించానని తెలిపాడు. ‘ఈ అవార్డు సాధించడం నా కల. లైఫ్ మొత్తం గడిచిపోయినా చాలా మందికి ఈ పురస్కారం దక్కదు. నాకు సొంతమవడం మీద చాలా సంతోషంగా ఉన్నా. చాలా గర్వంగా ఉంది. ఎంతో మంది ఆటగాళ్లు ఈ అవార్డు అందుకోవాలని ఎదురు చూస్తారు. కానీ ఆడియెన్స్​గానే మిగిలిపోతారు. చాలా మందికి నెరవేరని డ్రీమ్ ఇది’ అని షమి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న ఈ స్పీడ్​స్టర్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. దీని మీదా అతడు అప్​డేట్ ఇచ్చాడు. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నానని చెప్పాడు. ట్రైనింగ్ సెషన్స్ కూడా స్టార్ట్ చేశానని షమి తెలిపాడు. ఇంగ్లండ్​తో 5 టెస్టుల సిరీస్​ సమయానికి అందుబాటులో ఉంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

shami dream

అర్జున అవార్డుకు ఎంపికైన 25 క్రీడాకారుల్లో ఏకైక క్రికెటర్ షమి కావడం గమనార్హం. మంగళవారం అతడు ఈ పురస్కారాన్ని స్వీకరించనున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక అభ్యర్థన మేరకు షమి పేరు పురస్కారానికి నామినేట్ అయింది. కాగా, వన్డే వరల్డ్ కప్ టైమ్​లో గాయపడిన షమి.. రీసెంట్​గా జరిగిన సౌతాఫ్రికా టూర్​లో ఆడలేదు. ప్రొటీస్​తో టెస్ట్ సిరీస్ టైమ్​కు అతడు కోలుకుంటాడని అంతా అనుకున్నారు. ముంబైలో ట్రీట్​మెంట్​ చేయించుకున్న షమి.. త్వరగా రికవర్ అయితే సౌతాఫ్రికా పయనమవుదామని డిసైడ్ అయ్యాడు. కానీ కోలుకునేందుకు ఇంకా సమయం పట్టేలా ఉండటంతో అతడ్ని ఎన్​సీఏలోనే ఉంచి ట్రీట్​మెంట్ అందిస్తున్నారు. వేగంగా రికవర్ అవుతున్నానని.. ట్రైనింగ్ సెషన్స్​లో పాల్గొంటున్నానని షమి చెప్పాడు. కాబట్టి ఇంగ్లండ్​ సిరీస్​లో అతడు ఆడటం ఖాయంలా కనిపిస్తోంది. మరి.. అర్జున అవార్డు దక్కడంతో తన కల నెరవేరిందంటూ షమి చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: ఆ కామెంట్స్‌తో చిక్కుల్లో పడ్డ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ?