iDreamPost

Rohit Sharma: ఆ కామెంట్స్‌తో చిక్కుల్లో పడ్డ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ?

  • Published Jan 08, 2024 | 8:51 PMUpdated Jan 09, 2024 | 5:33 PM

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కొత్త వివాదంలో చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌ తర్వాత రోహిత్‌ చేసిన కామెంట్స్‌ అతన్ని చిక్కుల్లోకి నెట్టేలా ఉన్నాయి. ఇంతకీ రోహిత్‌ ఏం చెప్పాడు.. ఎందుకు చిక్కుల్లో పడతాడో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కొత్త వివాదంలో చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌ తర్వాత రోహిత్‌ చేసిన కామెంట్స్‌ అతన్ని చిక్కుల్లోకి నెట్టేలా ఉన్నాయి. ఇంతకీ రోహిత్‌ ఏం చెప్పాడు.. ఎందుకు చిక్కుల్లో పడతాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 08, 2024 | 8:51 PMUpdated Jan 09, 2024 | 5:33 PM
Rohit Sharma: ఆ కామెంట్స్‌తో చిక్కుల్లో పడ్డ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ?

ప్రస్తుతం రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ అంతా ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రోహిత్‌ను కెప్టెన్‌గా ప్రకటించడంపై కేవలం రోహిత్‌ ఫ్యాన్సే కాదు.. మొత్తం భారత క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో రోహిత్‌ ఆడతాడా? లేదా? కెప్టెన్‌గా ఎవరుంటారు అనే ఆయోమయంలో రోహిత్‌ తిరిగి టీ20 క్రికెట్‌ ఆడుతుంటడంతో టీ20 వరల్డ్‌ కప్‌లో రోహిత్‌ శర్మనే టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడనే విషయం స్పష్టమైంది. ఇంత సంతోషంలో ఉన్న రోహిత్‌ శర్మ, భారత క్రికెట్‌ అభిమానులకు ఒక విషయం ఆందోళనకు గురిచేస్తోంది.

రోహిత్‌ శర్మపై ఐసీసీ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదేంటి? అసలు రోహిత్‌ శర్మ ఏం చేశాడని ఐసీసీ చర్యలు తీసుకుంటుందని ఆందోళన పడకండి. రోహిత్‌ కోపంలో మాట్లాడిన కొన్ని మాటలే అతన్ని చిక్కుల్లో పడేసేలా ఉన్నాయి. అవేంటంటే.. ఇటీవల టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటించిన విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌ను సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలో 1-1తో సమం చేసిన భారత్‌.. కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక ఎంతో ప్రతిష్టాత్మకమైన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో 1-1తో సమం చేసిన విషయం తెలిసిందే. సెంచూరియన్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. కేవలం మూడు రోజుల్లోనే ఆ మ్యాచ్‌ ముగిసింది. దీంతో రోహిత్‌ సేనపై విమర్శల వర్షం కురిసింది.

కానీ, కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా సిరాజ్‌ దెబ్బకు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో పేకమేడలా కుప్పకూలింది. దీంతో రెండో టెస్ట్‌ను టీమిండియా ఒకటిన్నర రోజుల్లోనే ముగించి.. ఘన విజయం సాధించి.. టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసి పరువు నిలబెట్టుకుంది. అయితే.. ఈ మ్యాచ్‌ తర్వాత రోహిత్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు మ్యాచ్‌ జరిగిన పిచ్‌ను అంతా చూసి ఉంటారు. ఇలాంటి పిచ్‌పై ఆడేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, ఇండియాలో పిచ్‌లపై తొలి రోజు నుంచే బాల్‌ స్పిన్‌ అవ్వడం మొదలైతే.. మాత్రం చాలా మంది చెత్త పిచ్‌లంటూ గగ్గోలు పెడతారు. వారందరు ఇకపై నోళ్లు మూసుకోవాలి అంటూ ఘాటుగానే స్పందించాడు. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు రోహిత్‌కు కష్టాలు తెచ్చేలా ఉన్నాయి. రోహిత్‌ వ్యాఖ్యలను ఐసీసీ సీరియస్‌గా తీసుకున్నట్లు సమచారం. రోహిత్‌ మాట్టాడింది తప్పనిపిస్తే.. రోహిత్‌కు జరిమానా, కొన్ని మ్యాచ్‌ల నిషేధం విధించే ప్రమాదం ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి