iDreamPost

మాహీ మంచి మనసు.. ఫ్యాన్ కోసం ధోని చేసిన పని తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

  • Published May 29, 2024 | 5:28 PMUpdated May 29, 2024 | 5:28 PM

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని తన మంచి మనసును చాటుకున్నాడు. అభిమాని కోసం మాహీ చేసిన పని గురించి తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు.

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని తన మంచి మనసును చాటుకున్నాడు. అభిమాని కోసం మాహీ చేసిన పని గురించి తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు.

  • Published May 29, 2024 | 5:28 PMUpdated May 29, 2024 | 5:28 PM
మాహీ మంచి మనసు.. ఫ్యాన్ కోసం ధోని చేసిన పని తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

ఐపీఎల్-2024లో చెన్నై సూపర్​కింగ్స్ ఒట్టి చేతులతో ఇంటిదారి పట్టింది. గతేడాది ఛాంపియన్స్​గా నిలిచిన సీఎస్​కే.. ఈసారి మాత్రం గ్రూప్ స్టేజ్​ కూడా దాటలేకపోయింది. నాకౌట్ మ్యాచ్​లో ఆర్సీబీ చేతుల్లో ఓడటంతో చెన్నై కథ ముగిసింది. దీంతో కోట్లాది మంది ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయింది. ఆ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి సీజన్ అనే వార్తల నేపథ్యంలో సీఎస్​కే కప్పును సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఆశించారు. కానీ ఆర్సీబీ చేతుల్లో ఓడటంతో ఆ కోరిక నెరవేరలేదు. టీమ్ గెలుపు కోసం ధోని చివరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అతడు వచ్చే సీజన్​లో ఆడతాడో లేదో ఇంకా తెలియదు. ఈ తరుణంలో మాహీ చేసిన ఓ మంచి పని గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు.

అభిమాన ఆటగాళ్లను దగ్గర నుంచి చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. వాళ్ల ఆటోగ్రాఫ్స్, సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. కొందరు అభిమానులైతే ఏకంగా మ్యాచ్ జరిగే చోటకు సెక్యూరిటీని దాటి వెళ్లిపోతుంటారు. ఇలా వెళ్లిన వారిని అధికారులు అదుపులోకి తీసుకొని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తన ఫ్యాన్ విషయంలో మాత్రం ధోని మంచి మనసుతో వ్యవహరించాడు. ఈ ఐపీఎల్ సీజన్​లో ఓ అభిమాని మాహీని కలిసేందుకు భద్రతా వలయాన్ని దాటుకొని మరీ పిచ్ దగ్గరకు దూసుకొచ్చాడు. అతడ్ని ఏమీ అనకుండా హగ్ చేసుకున్నాడు సీఎస్​కే మాజీ కెప్టెన్. ఆ ఫ్యాన్​తో కొద్దిసేపు ముచ్చటించాడు మాహీ. అయితే మాటల సమయంలోనే అతడికి శ్వాస సంబంధిత సమస్య ఉందని గుర్తించాడు.

ఆ యువకుడి సర్జరీకి అయ్యే డబ్బుల్ని భరిస్తానని మాటిచ్చాడు ధోని. అతడి మీద చేయి వేస్తే బాగోదంటూ సెక్యూరిటీ సిబ్బందికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆ ఫ్యాన్ రివీల్ చేశాడు. మాహీ తన ఆరోగ్య సమస్యను వెంటనే గుర్తించి.. సర్జరీకి అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చాడన్నాడు. నీకేం కాదని.. నేనున్నానంటూ భరోసా ఇచ్చాడని ఆ అభిమాని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. మాహీ గొప్ప మనసుకు ఇది నిదర్శనమని చెబుతున్నారు. ఇందుకే ఈ స్థాయికి చేరుకున్నాడని, అభిమానులకు అండగా నిలిచిన ధోనీకి సెల్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. అభిమాని సర్జరీకి మాహీ సాయం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి