iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్‌: రాజకీయాల్లోకి క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌! ఆ పార్టీ నుంచి MPగా పోటీ..

  • Published Mar 10, 2024 | 2:52 PM Updated Updated Mar 10, 2024 | 3:13 PM

టీమిండియా మాజీ ఆల్​రౌండర్ యూసుఫ్ పఠాన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ పార్టీ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేయనున్నాడు.

టీమిండియా మాజీ ఆల్​రౌండర్ యూసుఫ్ పఠాన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ పార్టీ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేయనున్నాడు.

  • Published Mar 10, 2024 | 2:52 PMUpdated Mar 10, 2024 | 3:13 PM
బ్రేకింగ్‌: రాజకీయాల్లోకి క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌! ఆ పార్టీ నుంచి MPగా పోటీ..

టీమిండియా మాజీ ఆల్​రౌండర్ యూసుఫ్​ పఠాన్ పేరు చెబితేనే అందరికీ ధనాధన్ బ్యాటింగే గుర్తుకొస్తుంది. విధ్వంసక బ్యాటింగ్​తో ప్రత్యర్థి బౌలింగ్​ను చిత్తు చేయడం, అవతలి జట్టు చేతుల్లో నుంచి మ్యాచ్​ను లాగేసుకోవడం పఠాన్​కు వెన్నతో పెట్టిన విద్య. బ్యాటింగే కాదు.. క్వాలిటీ స్పిన్ బౌలింగ్​తోనూ ఆయన వికెట్లు తీసేవాడు. ఇలా అన్ని విధాలుగా టీమ్​లో కీలకపాత్ర పోషిస్తూ స్టార్ ప్లేయర్​గా ఎదిగాడు యూసుఫ్​. అయితే చాన్నాళ్ల కిందే ఇంటర్నేషనల్ క్రికెట్​కు గుడ్​బై చెప్పేశాడాయన. ఇండియన్ ప్రీమియర్ లీగ్​కూ దూరంగా ఉంటున్నాడు. కానీ రిటైర్డ్ క్రికెటర్లు ఆడే లెజెండ్స్​ లీగ్​తో పాటు పలు ఇతర పొట్టి లీగ్స్​లోనూ ఆడుతూ ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేస్తున్నాడు. అలాంటి యూసుఫ్ తన పొలిటికల్ ఎంట్రీ గురించి తాజాగా క్లారిటీ ఇచ్చాడు.

యూసుఫ్ పఠాన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని భరమ్‌పూర్‌ లోక్​సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నాడు. ఈ మేరకు తృణముల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమతా బెనర్జీ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల కోసం ప్రకటించిన 42 మంది అభ్యర్థుల జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్‌, 2011 వన్డే వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ టీమ్‌ మెంబర్‌ యూసుఫ్‌ పఠాన్‌ పేరు ఉండటం అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఎలాంటి ప్రకటన చేయకుండానే.. డైరెక్ట్‌గా ఎంపీ టిక్కెట్టు పొందారు. యూసుఫ్‌ సోదరుడు ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా టీమిండియాకు ఆడిన విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి చాలా కాలం పాటు భారత జట్టుకు ఆడారు. అలాగే కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ టీమ్‌కు ఆడిన యూసుఫ్‌ పఠాన్‌ కోల్‌కత్తా ప్రజలకు దగ్గరయ్యాడు.

యూసుఫ్​ పఠాన్ పొలిటికల్ ఎంట్రీ న్యూస్ అటు క్రికెట్ వర్గాలతో పాటు ఇటు రాజకీయ వర్గాల్లోనూ షాకింగ్​గా మారింది. ఎలాంటి అనౌన్స్​మెంట్ లేకుండా రాజకీయాల్లోకి రావడం, నేరుగా టిక్కెట్ కూడా దక్కించుకోవడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్రికెటర్​గా యూసుఫ్​కు ఉన్న పాపులారిటీ, మంచి ఇమేజ్ తమకు ప్లస్​గా మారుతుందని తృణమూల్ అధినేత్రి మమత భావిస్తున్నారని తెలుస్తోంది. ఇక, యూసుఫ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కూడా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ స్టేట్ చీఫ్​ అధిర్ రంజన్ చౌదరి స్థానిక ఎంపీగా ఉన్నారు. అంతటి బలమైన నేత మీద యూసుఫ్​ను మమత పోటీగా దించడం వైరల్​గా మారింది. మరి.. యూసుఫ్ పొలిటికల్ ఎంట్రీ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.