Nidhan
టీమిండియా యంగ్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ బకెట్ లిస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఇందులోని అన్నింటినీ గిల్ సాధించాడని.. కానీ అసలైందే మిస్సయిందని అంటున్నారు.
టీమిండియా యంగ్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ బకెట్ లిస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఇందులోని అన్నింటినీ గిల్ సాధించాడని.. కానీ అసలైందే మిస్సయిందని అంటున్నారు.
Nidhan
ఏ రంగంలోనైనా కొత్త నీరు రావాలి. అప్పుడే ఆశించిన దాని కంటే వేగంగా రిజల్ట్స్, ఛేంజెస్ వస్తాయి. అందుకు స్పోర్ట్స్ కూడా మినహాయింపేమీ కాదు. సీనియర్ ఆటగాళ్లకు తోడు, యంగ్‌స్టర్స్ కూడా తోడైతేనే టీమ్స్ మరింత బలోపేతం అవుతాయి. సీనియర్ల అనుభవానికి యువకుల జోష్ తోడైతే ఇక ఆ జట్టును ఆపడం చాలా కష్టమవుతుంది. అందుకే ప్రతిభ కలిగిన యువకులను వెతికి మరీ పట్టుకుంటారు సెలక్టర్స్. సీనియర్లు ఉండగానే వారిని తయారు చేసుకుంటారు. క్రికెట్లోనూ ఇదే ఫార్ములాను ఫాలో అవుతారు. అలా టీమ్‌లోకి వచ్చిన ప్లేయరే శుబ్‌మన్ గిల్. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ క్రికెటర్.. గత కొన్నాళ్లుగా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా 2023 మొత్తం అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. మిగిలిన యంగ్‌స్టర్స్‌తో పోల్చుకుంటే గిల్ తక్కువ టైమ్‌లోనే ఎంతో అచీవ్ చేశాడు. మూడు ఫార్మాట్లలోనూ టీమ్‌లో రెగ్యులర్ ప్లేయర్‌గా మారాడు. అయితే దీనికి ఏడాది మొదట్లోనే స్కెచ్ వేశాడు గిల్.
2023 స్టార్ట్ కాకముందే తన ప్లాన్స్ సిద్ధం చేసుకున్నాడు శుబ్‌మన్ గిల్. 2022 డిసెంబర్ 31న తర్వాతి ఏడాది ఏమేం సాధించాలో ఒక కాగితంపై రాసుకున్నాడు. అతడి బకెట్ లిస్ట్‌కు సంబంధించిన ఆ పేపర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ప్రధానంగా నాలుగు గోల్స్ పెట్టుకున్నాడు శుబ్‌మన్. టీమిండియా తరఫున అత్యధిక సెంచరీలు కొట్టాలి, తన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి, గేమ్‌లో తన బెస్ట్ ఎఫర్ట్ పెట్టాలి, అలాగే వరల్డ్ కప్ నెగ్గాలి. ఇది 2023 కోసం గిల్ రాసి పెట్టుకున్న బకెట్ లిస్ట్. అయితే ఈ జాబితాలో అతడు మూడు మాత్రమే సాధించాడు. అత్యధిక సెంచరీలు బాదాడు గిల్. కానీ దాన్ని తర్వాత విరాట్ కోహ్లీ అధిగమించాడు. కుటుంబ బాగోగులు చూసుకుంటూ హ్యాపీగా ఉన్నాడు. టీమ్ కోసం బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్నాడు.
బకెట్ లిస్ట్‌లో నాలుగో లక్ష్యాన్ని మాత్రం నిజం చేసుకోలేకపోయాడు గిల్. అదే వరల్డ్ కప్. ఈసారి మెగా టోర్నీలో భారత్‌ను విజేతగా చూడాలని మిగిలిన క్రికెటర్స్, అభిమానుల్లాగే శుబ్‌మన్ కూడా కలలు కన్నాడు. కానీ అది నిజం కాలేదు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి టీమిండియా కప్పు చేజార్చుకున్న సంగతి తెలిసిందే. మెగా టోర్నీకి ముందు డెంగ్యూ బారిన పడిన గిల్ సరిగ్గా ఆడలేకపోయాడు. అంతకుముందు వరకు భీకర ఫామ్‌లో ఉన్న ఈ యంగ్‌స్టర్.. వరల్డ్ కప్‌లో ఆశించినంత స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయాడు. దీంతో గిల్ కూడా తీవ్రంగా నిరాశపడ్డాడు. గతేడాది బకెట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడమే గాక దాంట్లోని చాలా గోల్స్‌ను రీచ్ అయ్యాడు. ఈసారి అతడి బకెట్ లిస్ట్ ఏంటనేది ఇంట్రెస్టింగ్గా మారింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు కాబట్టి ఐపీఎల్ ట్రోఫీ, అలాగే టీ20 వరల్డ్ కప్-2024 కప్ అతడి బకెట్ లిస్ట్‌లో తప్పకుండా ఉంటాయని చెప్పొచ్చు. మరి.. గిల్ బకెట్ లిస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్న కోహ్లీ.. మెస్సీ, రొనాల్డోలను ఓడించి..!
Shubman Gill exactly a year ago created a bucket list for 2023.
– He achieved almost everything, but the World Cup…!!! 💔 pic.twitter.com/OhS8s1UASU
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 31, 2023