iDreamPost
android-app
ios-app

Rohit Sharma: అది పెద్ద సవాలే.. కానీ దాన్ని సాకుగా చూపం! రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్..

  • Published Jun 19, 2024 | 7:33 AM Updated Updated Jun 19, 2024 | 7:33 AM

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా జరగబోయే సూపర్ 8 మ్యాచ్ లకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా జరగబోయే సూపర్ 8 మ్యాచ్ లకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Rohit Sharma: అది పెద్ద సవాలే.. కానీ దాన్ని సాకుగా చూపం! రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్..

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో సూపర్ 8కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. గ్రూప్ దశలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ.. ఆడిన మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఇక ఇప్పుడు అదే జోరును సూపర్ 8లో కూడా చూపించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు ఓ పెద్ద సవాల్ ఎదురైంది. అయితే అది పెద్ద టాస్కే కావొచ్చు.. కానీ దాన్ని మేము సాకుగా చూపించం అని షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.

సూపర్ 8 పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఈ స్టేజ్ లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్ జట్లను ఢీ కొట్టాల్సి ఉంది. అయితే గ్రూప్ దశలో బ్యాటింగ్ లో విఫలం అయిన టీమిండియా.. బౌలర్ల పుణ్యమాని నెట్టుకొచ్చారు. ఇక ఇప్పుడు కీలక మ్యాచ్ లు ఆడాల్సి ఉన్న తరుణంలో గ్రూప్ దశలో ఆడినట్లు ఆడితే.. ఇంటిదారి పట్టడం ఖాయం. ఆ మూడు జట్లను ఓడిస్తేనే సెమీస్ కు వెళ్తుంది. ఇలాంటి టైమ్ లో టీమిండియాను పెద్ద సవాల్ ఎదురైంది. అదేంటంటే?  సూపర్ 8 లో 5 రోజుల వ్యవధిలో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అది కూడా మూడు వేర్వేరు నగరాల్లో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.

ఆఫ్గాన్ తో బార్బడోస్, బంగ్లాదేశ్ తో ఆంటిగ్వా, ఆస్ట్రేలియాతో సెయింట్ లూసియా నగరాల్లో మ్యాచ్ లు ఆడనుంది. దాంతో వెంటవెంటనే ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇది ఆటగాళ్లను శారీరకంగా, మానసికంగా ప్రభావితం చేస్తుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బీబీసీ టీవీతో రోహిత్ మాట్లాడుతూ..”ఒకసారి మేం మ్యాచ్ ఆడితే.. నెక్ట్స్ మ్యాచ్ లను 3-4 రోజుల వ్యవధిలో ఆడాల్సి ఉంది. ఇది బిజీ షెడ్యూలే. కానీ భారత ఆటగాళ్లు జర్నీని అలవాటు చేసుకున్నారు. కాబట్టి దీనిని మేము సాకుగా చెప్పలేం. టీమ్ లో ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మా నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ ఈ టోర్నీలో దూసుకెళ్తాం” అంటూ బిజీ షెడ్యూల్ ను సాకుగా చూపించం అని స్ఫష్టం చేశాడు.