iDreamPost

బొత్సపై పోటీకి భయపడుతోన్న TDP కీలక నేతలు! కారణం అదేనా..?

Botsa Satyanarayana: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేసేందుకు టీడీపీ కీలక నేతలు భయపడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం ఇప్పటికే పలువురు కీలక నేతలు చీపురుపల్లి నుంచి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేయగా.. తాజాగా మరో కీలక నేత కూడా వారి దారిలోనే వెళ్లారు.

Botsa Satyanarayana: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేసేందుకు టీడీపీ కీలక నేతలు భయపడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం ఇప్పటికే పలువురు కీలక నేతలు చీపురుపల్లి నుంచి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేయగా.. తాజాగా మరో కీలక నేత కూడా వారి దారిలోనే వెళ్లారు.

బొత్సపై పోటీకి భయపడుతోన్న TDP కీలక నేతలు! కారణం అదేనా..?

ఏపీ రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడి పాలిటిక్స్ ముందు సస్పెన్స్  థ్రిలర్ మూవీ కూడా సరిపోతుంది. అంతలా ఇక్కడి రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఏ నియోజవర్గంల నుంచి ఎలాంటి న్యూస్ వినిపిస్తుందో అని అందరిలో ఉత్కంఠ రేగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అయ్యే వరకు ఎన్నో విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఈ విషయాలు పక్కన పెడితే.. ప్రధాన పార్టీలు.. కొన్ని నియోజవర్గాలపై ఫోకస్ చేశాయి. ఆ స్థానాల్లో తమ ప్రత్యర్థిని ఓడించాలనే టార్గెట్ పెట్టుకున్నాయి. టీడీపీ కూడా అదే లక్ష్యంతో వైసీపీలోని కొందరి నేతలను టార్గెట్ చేసింది. వారిలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒకరు. అయితే ఆయనపై పోటీ చేసేందుకు టీడీపీ కీలక నేతలు సైతం భయపడుతోన్నారు.

బొత్స సత్యనారాయణ.. రాష్ట్ర రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉమ్మడి విజయనగరంలోనే కాకుండా ఉత్తరాంధ్రలోని కీలక నేత.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. విభాజనంతరం వైసీపీలో చేరి..2019 మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన రాజకీయ ప్రస్థానం అలా ఉంచితే.. ఆయన పేరు చెప్పగానే.. చీపురపల్లి గుర్తుకు వస్తుంది. కారణం.. ఆ నియోజవర్గంతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. అక్కడి నుంచే కొన్నే ఏళ్లుగా పోటీ చేస్తు వస్తున్నారు. అభ్యర్థి ఎవరైన  విజయం బొత్సనే వరిస్తుంది. ఆయనపై పోటీ చేసేందుకు ప్రత్యర్థులు సైతం భయపడుతుంటారు.

ఇక 2024 ఎన్నికల్లో సీఎం జగన్  గెలుపును ఎలాగైన అడ్డుకోవాలని టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ముందు వైసీపీలోని కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అలాంటి నియోజకవర్గాల్లో బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్య వహిస్తున్న చీపురపల్లి ఒకటి. ఇక్కడ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైన బొత్సాను ఓడించాలని  టీడీపీ కంకణం కట్టుకుంది. కంకణం అయితే కట్టుకుంది కానీ.. బొత్సను ఓడించడం అంత సులువు కాదనే విషయం ఆ పార్టీకి కూడా అర్థమైంది. అందుకే టీడీపీలోని గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు వంటి  కీలక నేతలను బొత్సాపై పోటీ చేయించాలని చూసింది.

తొలుత గంటాను విశాఖ జిల్లాను కాకుండా చీపురుపల్లి నుంచి పోటీ చేయమని టీడీపీ ఆదేశించింది. అక్కడి నుంచి పోటీ చేస్తే.. ఓటమి గ్యారెంటీనే భావించిన గంటా.. వెనుకడుగు వేశారు. తాజాగా మాజీ మంత్రి కళా వెంకట్రావును పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం  ప్రతిపాదించింది. అయితే తన వల్ల కాదని కళా వెంకట్రావు తప్పుకున్నారు. మరికొందరు టీడీపీ కీలక నేతలను కూడా ఇదే దారిలో ఉన్నారు. మొత్తంగా బొత్సాపై పోటీ చేసేందుకు టీడీపీ కీలక నేతలు భయపడుతోన్నారు. అందుకు గల కారణాలు అనేక వినిపిస్తోన్నాయి. మంత్రి బొత్సా సత్యనారాయణ స్థానికంగా బలమైన నేత. చీపురపల్లితో పాటు మరికొన్ని నియోజకవర్గాలపై ఆయనకు గట్టి పట్టుంది. ఇంకా చెప్పాలంటే.. చంద్రబాబుకు కుప్పం ఎలాగో.. బొత్సాకు చీపురుపల్లి అలాంటిదే.

బొత్స సొంత బలంతో పాటు..సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఆ ప్రాంతంలో చేసిన అభివృద్ధి కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది. ఇక్కడ వేల కోట్ల రూపాయలతో సీఎం జగన్ అభివృద్ధి పనులు చేపట్టారు. అలానే సంక్షేమ పథకాలను అర్హులైన అందరికి అందించారని వైసీపీపై ఇక్కడి ప్రజల్లో ఉంది. ఇలా అన్ని విధాలుగా వైసీపీకి  చీపురుపల్లి అనుకూలంగా ఉండటంతో.. కోరికోరి ఓటమి కొని తెచ్చుకోవడం ఎందుకూ అనే భావనలో టీడీపీ కీలక నేతలు ఉన్నారు. మొత్తంగా చీపురుపల్లిలో టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతూనే ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి