iDreamPost

బిగ్ బ్రేకింగ్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్..!

బిగ్ బ్రేకింగ్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన నంద్యాల జిల్లా పర్యటనలో ఉన్నారు. నంద్యాలలోని ఆర్ కె ఫంక్షన్ హాల్ వద్ద బస చేయగా.. బస్సు వద్దకు చేరుకున్న పోలీసులు.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏ 1 ముద్దాయిగా ఉన్న చంద్రబాబును అరెస్టు చేసినట్లు ఏపీ సీఐడీ తెలిపారు.  శనివారం తెల్లవారు జామున నంద్యాలకు చేరుకున్న పోలీసులు చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద నోటీసులిచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ కింద అరెస్టు చేసింది. పోలీసులు ఆయన్ను అరెస్టు చేస్తున్నారని తెలియజడంతో పెద్ద యెత్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు నంద్యాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. పోలీసులను అడ్డుకున్నారు. దీంతో నంద్యాలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా, కొంత మంది నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిలో కాలువ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానంద రెడ్డి, అఖిల ప్రియులు ఉన్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడ తరలిస్తున్నారు.

కాగా, కోనసీమ జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ తండ్రి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తన తండ్రిని చూసేందుకు వెళ్లొద్దా అంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇంతకు స్కిల్ డెవలప్ మెంట్ కేసు ఏంటంటే.. 2014లో ఏపీ ముఖ్యమంత్రి చందబ్రాబు అధికారం చేపట్టిన తర్వాత ఈ స్కాంకు తెరలేపారన్న అభియోగాలు వచ్చాయి. 2016-19 మధ్య కాలంలో బోగస్ కాంట్రాక్టుల ద్వారా రూ. 118 కోట్ల ప్రజాధనం ముడుపుల రూపంలో చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ ద్వారా షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ సబ్‌ కాంట్రాక్టర్‌గా అవతారం ఎత్తి ఈ డబ్బులను తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో స్పందించిన ఐటీ అధికారులు.. చంద్రబాబుతో పాటు శ్రీనివాస్‌, మనోజ్‌ వాసుదేవ్‌, యోగేశ్‌ గుప్తాకు నోటీసులు అందజేశారు. గత వారం వారి నివాసాల్లో తనిఖీలు కూడా చేపట్టారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి