iDreamPost

అమెరికాలో ఉద్యోగం.. పెళ్లై ఏడాదే.. భార్య కళ్ల ముందే దారుణం

  • Published May 17, 2024 | 12:30 PMUpdated May 17, 2024 | 12:30 PM

అతడికి వివాహం అయ్యి.. ఏడాదే అవుతుంది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం భార్యతో కలిసి సరదాగా బయటకు వెళ్లాడు. ఇంతలోనే దారుణం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

అతడికి వివాహం అయ్యి.. ఏడాదే అవుతుంది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం భార్యతో కలిసి సరదాగా బయటకు వెళ్లాడు. ఇంతలోనే దారుణం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

  • Published May 17, 2024 | 12:30 PMUpdated May 17, 2024 | 12:30 PM
అమెరికాలో ఉద్యోగం.. పెళ్లై ఏడాదే.. భార్య కళ్ల ముందే దారుణం

పైన ఫొటోలో ఉన్న వ్యక్తిని చూశారా.. గత ఎనిమిదేళ్లుగా అతడు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి.. కానీ రెండేళ్ల క్రితం చనిపోయాడు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆ వ్యక్తే ఆధారం. ఇక ఏడాది క్రితం సదరు వ్యక్తికి వివాహం అయ్యింది. భార్యతో కలిసి అమెరికాలోనే ఉంటున్నాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఆ యువకుడి జీవితంతో విధి వింత ఆట ఆడుకుంది. పెళ్లైన ఏడాదికే.. అది కూడా భార్య కళ్లముందే.. అమెరికాలో అత్యంత దారుణంగా చనిపోయాడు. ఇంతకు ఏం జరిగిందంటే..

ఈమధ్య కాలంలో విదేశాల్లో కన్ను మూస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన వారు.. ప్రమాదవశాత్తు, లేదా దాడుల్లో కన్ను మూస్తున్నారు. తాజాగా మరో తెలుగు వ్యక్తి అమెరికాలో కన్ను మూశాడు. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ వివరాలు..

తెలంగాణ, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన విద్యుత్‌శాఖ రిటైర్డ్ ఉద్యోగి అబ్బరాజు వెంకటరమణ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ పరిధిలో ఉన్న అలకాపురిలో సెటిల్ అయ్యారు. వెంకటరమణ కుమారుడు పృథ్వీరాజ్‌ యూఎస్‌లోని నార్త్‌ కరోలినాలో ఎనిమిదేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇక రెండేళ్ల క్రితం వెంకటరమణ మరణించాడు. ఇలా ఉండగా.. గతేడాది పృథ్వీరాజ్‌‌కు శ్రీప్రియతో వివాహమైంది. ప్రస్తుతం ఈ దంపతులు అమెరికాలోనే ఉంటున్నారు.

ఇలా ఉండగా.. బుధవారం రోజు పృథ్వీరాజ్‌‌ తన భార్య శ్రీప్రియతో కలిసి కారులో వెళ్తున్నాడు. అయితే మార్గమధ్యలో వర్షం కారణంగా ముందు వెళ్తున్న మరో కారును పృథ్వీ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ కారు పల్టీలు కొట్టింది.. అయితే బెలూన్లు తెరుచుకోవడంతో పృథ్వీ, శ్రీప్రియలు సురక్షితంగా బయటపడ్డారు. పృథ్వీ భార్యను కారులోనే కూర్చోబెట్టి.. తను మాత్రం కిందకు దిగి.. జరిగిన ప్రమాదంపై పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు ఫోన్ చేస్తున్నాడు.

పృథ్వీ ఫోన్ చేస్తున్న సమయంలోనే అటుగా వేగంగా వచ్చిన మరో కారు అతడ్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పృథ్వీ స్పాట్ లోనే అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఒక ప్రమాదం నుంచి తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకునేలోపే.. మరో యాక్సిడెంట్ లో కన్ను మూశాడు. పోస్ట్‌మార్ట్ అనంతరం పృథ్వీ మృతదేహాన్ని ఆదివారం హైదరాబాద్‌ తీసుకురానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రెండేళ్ల క్రితం వెంకటరమణ, ఇప్పుడు కుమారుడు పృథ్వీ మరణించడంతో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి