iDreamPost
android-app
ios-app

TDP సీనియర్ నేత.. మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్లకు గుండెపోటు!

ఎంతో మంది యువత ఈ గుండె పోటు కారణంగా మృత్యువాత పడ్డారు. అలానే పలువురు క్షణాల్లో ఆ ప్రమాదం నుంచి బయటపడుతున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కొందరు గుండెపోటు

ఎంతో మంది యువత ఈ గుండె పోటు కారణంగా మృత్యువాత పడ్డారు. అలానే పలువురు క్షణాల్లో ఆ ప్రమాదం నుంచి బయటపడుతున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కొందరు గుండెపోటు

TDP  సీనియర్ నేత.. మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్లకు గుండెపోటు!

ఈ మధ్యకాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువ అవుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు  అందరు హార్ట్ అటాక్ కి గురవుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది యువత ఈ గుండె పోటు కారణంగా మృత్యువాత పడ్డారు. అలానే పలువురు క్షణాల్లో ఆ ప్రమాదం నుంచి బయటపడుతున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కొందరు గుండెపోటు కారణంగా కన్నుమూస్తున్నారు. అలానే తరచూ కొందరు ప్రముఖులు హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయరావు గుండెపోచుకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

టీడీపీ బందరు మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు గురువారం తెల్లవారు జామున గుండెపోటుకు గురయ్యారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. చికిత్స నిమిత్తం ఆయనను విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ధ్రువీకరించారు. గతంలో తెలంగాణ, ఆంధ్ర విభజన సమయంలో ఆయనకు ఢిల్లీలోని పార్లమెంట్లో తొలిసారి గుండెపోటు వచ్చింది.  ఆతరువాత ఇప్పుడు రావడం రెండోసారి.

కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతల్లో కొనకళ్ల నారాయణ రావు ఒకరు. గతంలో మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అలానే టీడీపీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఇది ఇలా ఉంటే గుండె పోటు ఎప్పుడు ఎవరిలో వస్తుందో చెప్పలేకపోతున్నారు. ఆడ మగ తేడాలేకుండా అందరిలో గుండెపోటు వస్తోంది. గతంలో హీరో నందమూరి తారకత్న కూడా గుండెపోటు కారణంగానే కన్నుమూశారు. అలానే పలువురు యువ రాజకీయ నేతలు కూడ గుండె పోటు గురై..మరణించారు. మరి..కొందరు ప్రముఖులు మాత్రం.. గుండెపోటు వచ్చిన సమయంలో చికిత్స తీసుకున్ని జాగ్రత్తగా ఉంటున్నారు.