iDreamPost

ఎంతకు తెగించారు భయ్యా!.. ఇంట్లోనే డబ్బులు ప్రింట్ చేస్తున్న కేటుగాళ్లు!

డబ్బు కావాలి.. అది ఎలాగైనా సంపాదించాలనుకున్నారు ఓ ఇద్దరు స్నేహితులు. ఆలోచన వచ్చిందే మొదలు నకిలీ నోట్లు తయారికి తెరలేపారు. ఏకంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఫేక్ కరెన్సీ తయారీ కేంద్రంగా మార్చేసి నోట్లను ముద్రిస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

డబ్బు కావాలి.. అది ఎలాగైనా సంపాదించాలనుకున్నారు ఓ ఇద్దరు స్నేహితులు. ఆలోచన వచ్చిందే మొదలు నకిలీ నోట్లు తయారికి తెరలేపారు. ఏకంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఫేక్ కరెన్సీ తయారీ కేంద్రంగా మార్చేసి నోట్లను ముద్రిస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఎంతకు తెగించారు భయ్యా!.. ఇంట్లోనే డబ్బులు ప్రింట్ చేస్తున్న కేటుగాళ్లు!

డబ్బుకు లోకం దాసోహం. ధనానికి ఎవరైనా దాసోహం కావాల్సిందే. మనీ ఉంటే ఏదైనా మన సొంతం చేసుకోవచ్చు అన్నట్లుగా మారిపోయింది లోకం. ఈ మధ్యకాలంలో లగ్జరీ లైఫ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్న వారి సంఖ్య ఎక్కువైపోతోంది. దీనికోసం కొంతమంది సక్రమ మార్గాల్లో డబ్బు సంపాధిస్తుంటే, మరికొందరు మాత్రం అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇద్దరు స్నేహితులు తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బును సంపాదించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఏకంగా నకిలీ నోట్ల తయారీకి తెరలేపారు. ఎంచక్కా ఇంట్లోనే ఫేక్ కరెన్సీని ముద్రించడం ప్రారంభించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ప్రపంచమంతా ఇప్పుడు డబ్బు వెనకాల పరుగెడుతోంది. కొందరు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదించుకుంటుంటే.. మరికొందరేమో అడ్డదార్లు తొక్కుతున్నారు. మోసాలకు పాల్పడుతూ డబ్బు పోగేసుకుంటున్నారు కేటుగాళ్లు. ఇదే రీతిలో ఓ ఇద్దరు కేటుగాళ్లు నకిలీ నోట్ల తయారీకి పూనుకున్నారు. ఏపీ నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉంటున్న వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ లు ఈ ఘరానా మోసానికి తెరలేపారు. వృత్తి రీత్య సివిల్ కాంట్రాక్టర్ అయిన వెంకటేశ్వర్లు ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో ఎలాగైన డబ్బు సంపాదించాలని తన స్నేహితుడైన శ్రీనివాస్ తో కిలిసి నకిలీ నోట్లను ముద్రించడం ప్రారంభించాడు.

నకిలీ నోట్లను ముద్రించేందుకు కావాల్సిన ప్రింటర్లు, జిరాక్స్ మెషీన్.. ల్యాప్ ట్యాప్, కలర్స్ వంటి సామాగ్రిని ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నకిలీ నోట్లను తయారు చేయటం మొదలుపెట్టారు. నోట్ల ప్రింటింగ్ కు సంబంధించిన వీడియోలను ఇంటర్నెట్ లో చూడడం, కొన్ని రకాల వెబ్ సిరీస్ లు చూడడం ద్వారా నకిలీ నోట్లను ఎలా ప్రింట్ చేయాలనే దానిపై అవగాహన పెంచుకున్నారు. అనంతరం 500, 100 ఫేక్ కరెన్సీని తయారు చేయడం ప్రారంభించారు.

ఇలా తయారు చేసిన నకిలీ నోట్లను గుట్టుచప్పుడు కాకుండా మార్కెట్ లల్లో ఇతర చిన్న చిన్న షాపుల్లో మార్చడం ప్రారంభించారు. ఈ క్రమంలో వీరి నకిలీ నోట్ల బండారం బయటపడింది. ఈ వ్యవహారం పోలీసుల వద్దకు చేరింది. దీంతో వెంటనే అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘాపెట్టి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు లక్షల విలువైన ఫేక్ కరెన్సీని సీజ్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి