iDreamPost

బ్రేకింగ్: సమ్మెను విరమించుకున్న ట్యాంకర్ల డ్రైవర్లు

Tanker Dirvers Withdraw Protest: రెండ్రోజులుగా దేశవ్యాప్తంగా ట్రక్, ట్యాంకర్ డ్రైవర్స్ సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమ్మె వల్లే దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడుతోంది.

Tanker Dirvers Withdraw Protest: రెండ్రోజులుగా దేశవ్యాప్తంగా ట్రక్, ట్యాంకర్ డ్రైవర్స్ సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమ్మె వల్లే దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడుతోంది.

బ్రేకింగ్: సమ్మెను విరమించుకున్న ట్యాంకర్ల డ్రైవర్లు

ట్రక్కు, ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మె ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఎందుకంటే రెండ్రోజులుగా జరుగుతున్న ఈ సమ్మె కొనసాగితే పెట్రోలు, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడటం జరుగుతుంది. అలాగే కూరగాయలు, పాలు, నిత్యావసరాలు అన్నీటి ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ నేపథ్యంలోనే వినియోగదారులు, దేశ పౌరులు అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆయిల్ ట్యాంకర్ల యజమానులు కూడా కేంద్రం తెచ్చిన కొత్త చట్టానికి వ్యతిరేకంగా సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఆయిల్ కోసం వాహనదారులు బంకులకు పరుగులు తీశారు. కానీ, తెలంగాణ ట్యాంకర్స్ యజమానులు మాత్రం సమ్మెను విరమించుకున్నారు.

ప్రస్తుతం ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెట్రోలు బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. రేపటి నుంచి పెట్రోలు, డీజిల్ దొరకదని.. బంకులు మొత్తం మూసేస్తారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వాహనదారులు బంకుల ఎదుట క్యూ కట్టారు. అలాగే రైతులు కూడా ఖాళీ క్యానులతో బంకుల వద్ద క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని వానహదారులు, వినియోగదారులకు ఒక శుభవార్త అందింది. ట్యాంకర్ల యజమానులు సమ్మె విరమించుకున్నారు. పెట్రోలు, డీజిల్ తో ట్యాంకర్లు బయలుదేరాయని చెబుతున్నారు. కొన్ని గంటల్లో ట్యాంకర్లు బంకులకు కూడా చేరుకుంటాయి. ఇప్పటికే హైదరాబాద్ మొత్తం బంకుల వద్ద వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. నగర ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. రోడ్ల మీదకు వాహనాలు వచ్చేశాయి. అయితే డ్రైవర్లు సమ్మె విరమించడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయనే చెప్పాలి. అయితే ప్రస్తుతానికి మాత్రం కొన్ని గంటల వరకు బంకుల వద్ద రద్దీ మాత్రం తప్పదనే చెప్పాలి. ఎదుకంటే ట్యాంకర్స్ బయలుదేరినా కూడా బంకులకు చేరుకునేందుకు మాత్రం చాలా కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు మాత్రం వాహనదారులకు ఈ ఇబ్బందుల తప్పవు. అలాగే ట్రాఫిక్ సమస్య కూడా కొనసాగుతుంది.

అసలు ట్రక్, ట్యాంకర్స్ డ్రైవర్లు, యజమానులు ఎందుకు సమ్మె ప్రారంభించారంటే.. హింట్ అండ్ రన్ కేసుకు సంబంధించి కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. గతంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబధించి బ్రిటీష్ కాలానికి చెందిన చట్టం ప్రకారం శిక్షలు విధించేవారు. కానీ, ఆ చట్టం స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అలాగే కఠిన శిక్షలను కూడా ప్రవేశ పెట్టింది. హిట్ అండ్ రన్ కేసులో దోషిగా తేలితే రూ.7 లక్షల జరిమానా, 10 ఏళ్ల జైలుశిక్ష కూడా విధిస్తారు. ఈ నేపథ్యంలోనే ట్రక్, ట్యాంకర్ల డ్రైవర్లు పెద్దఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్లు చేశారు. అలా చేయని పక్షంలో సమ్మె విరమించం అంటూ రోడ్లపై వాహనాలను నిలిపివేశారు. హిట్ అండ్ రన్ లో కేంద్రం తీసుకొచ్చిన కొత్త శిక్షలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి