iDreamPost

Seshu: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి!

తరచూ ప్రముఖుల మరణలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ఇలా వివిధ కారణాలతో సెలబ్రిటీలు మరణించడంతో వారి కుటుంబం సభ్యులతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా ఓ ప్రముఖ కమెడియన్ మృతి చెందారు.

తరచూ ప్రముఖుల మరణలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ఇలా వివిధ కారణాలతో సెలబ్రిటీలు మరణించడంతో వారి కుటుంబం సభ్యులతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా ఓ ప్రముఖ కమెడియన్ మృతి చెందారు.

Seshu: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి!

ఇటీవల కాలంలో సినీ, రాజకీయ రంగాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనారోగ్యం, గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు వంటి వివిధ కారణాలతో ప్రముఖులు మరణిస్తున్నారు. ఇలా పలువురు సెలబ్రిటీల మరణాలతో వారి కుటుంబంలోనే కాకుండా.. అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కమెడియన్ కన్నుమూశారు. దీంతో కోలివుడ్ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది.

ప్రముఖ తమిళ నటుడు, కమెడియన్ శేషు(60) మృతి చెందారు. 10 రోజు క్రితం గుండెపోటుకు గురైన ఆయన  చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. లొల్లు సభ పేరడీ సిరీస్ తో ఆయన ఎందరో అభిమానులను సంపాదించారు. కోలివుడ్ లో ధనుశ్ తుళ్లువదో, ఇలామై, వేలాయుధం, ఏ1, పారిస్ జయరాజ్, గుల్ గుల్, బిల్డప్ సినిమాల్లో నటించారు. చివరిగా సంతానం హీరోగా వచ్చిన ‘వడకుపట్టి రామస్వామి’ సినిమాలో ఆయన నటించారు. ఇందులో తనదైన నటనతో ప్రేక్షుకలను ఆయన మెప్పించారు.

ఇప్పటి వరకు శేషు మొత్తంగా 30 చిత్రాలకు పైగా నటించారు. శేషు బుల్లితెరపై ‘లొల్లు సభ’ అనే పాపులర్ కామెడీ షో మంచి ఫేమస్ అయ్యారు. ఆయన ధనుష్ హీరోగా నటించిన తొలి చిత్రం తుళ్లువదో ఉలహా సినిమాతో శేషు వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత అనేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ  అందరిని అలరించారు. తనదైన కామెడీతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. కరోనా మహామ్మారి సమయంలో చాలామందికి పేదలకు, అనాథలకు శేషులు సాయం చేశారు. మార్చి 15వ తేదీన గుండె పోటుతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. దాదాపు పది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన చికిత్స కోసం చాలా ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఇతర నటీనటులు విరాళాలు సేకరించి.. ఆయనకు చికిత్స కోసం ఖర్చు చేశారు.

అలానే ఆయన తిరిగి మాములు స్థితికి రావాలని వారందరూ ప్రార్థనలు చేశారు. అదే విధంగా ఆయనను ప్రాణాలతో బతికించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. వారి ప్రార్థనలు, వైద్యలు ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి.. ఆయన మంగళవారం కన్నుమూశారు.ఇక శేఖు భౌతిక కాయానికి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈయనకు ముగ్గురు కుమారులు ఉన్నట్లు సమాచారం. శేషు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి