iDreamPost

పవన్‌ కళ్యాణ్‌ అలా అనడం కరెక్ట్‌ కాదు: తమన్నా సింహాద్రి

  • Published Mar 01, 2024 | 4:31 PMUpdated Mar 01, 2024 | 4:57 PM

ఆంధ్రప్రదేశ్ లోని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అందరిని మోసం చేస్తున్నారని ఆయన రాజకీయ తీరు పై ట్రాన్స్‌ జెండర్‌ తమన్నా పలు సంచలన వ్యాఖ్యలను చేసింది.

ఆంధ్రప్రదేశ్ లోని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అందరిని మోసం చేస్తున్నారని ఆయన రాజకీయ తీరు పై ట్రాన్స్‌ జెండర్‌ తమన్నా పలు సంచలన వ్యాఖ్యలను చేసింది.

  • Published Mar 01, 2024 | 4:31 PMUpdated Mar 01, 2024 | 4:57 PM
పవన్‌ కళ్యాణ్‌ అలా అనడం కరెక్ట్‌ కాదు: తమన్నా సింహాద్రి

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల వేడి మెుదలైంది. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల కదనరంగంలో దూసుకుపోతున్నారు. ఒక పక్క సీఎం జగన్ ఒక్కడే బరిలోకి దిగుతుండగా.. తనని ఓడించడం కోసం టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నాయి. తాజాగా తెలుగుదేశం, జనసేన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో ఎన్నికల జోరు మరింత ఊపందుకుంది. అయితే అభ్యర్థుల ప్రకటన తర్వాత జనసేన కేడర్‌ పవన్‌ పై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో ట్రాన్స్‌ జెండర్‌ తమన్నా.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్‌ వారందరినీ మోసం చేశాడని ఆరోపించింది. ఆ వివరాలు..

బిగ్ బాస్ ట్రాన్స్ జెండర్ తమన్నా గురించి అందరికీ తెలిసిందే. సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌ గా ఉంటుంది. రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. ఈ క్రమంలోనే ఆమె 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి.. ఓటమిపాలైంది. ఆ సమయంలోనే జనసేన నుంచి టికెట్ కోసం ఆశించినా ఆమెకు దక్కకపోవడంతో జనసేన పార్టీపై పలు విమర్శలు చేసింది. తాను ట్రాన్స్ జెండర్ కావడంతోనే.. జనసేన తనకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత.. తమన్నా మళ్లీ పవన్ కల్యాణ్ పై అభిమానంతో జనసేనకు మద్ధతుగా తన అభిమానాన్ని చాటుకుంది.

అయితే తాజాగా ఏపీలో పవన్ కల్యాణ్ రాజకీయ తీరుపై తమన్నా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఏపీకి పవన్ ను ముఖ్యమంత్రి చేయాలని కాపు వర్గానికి చెందిన ఎందరో అభిమానులు, ప్రజలు రోడ్డెక్కి పవన్ కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది తమ ఆస్తులను అమ్ముకుని అభిమానంతో పవన్ వెంట ఉన్నారు. కానీ, నేడు పవన్.. చంద్రబాబు కోసం పని చేస్తూ అందరి జీవితాలను నాశనం చేస్తున్నారు. నాదెండ్ల మనోహర్ మాటలు మాత్రమే వింటున్న పవన్.. ఇటు జనసేన కార్యకర్తల బాధలు, కాపు పెద్దల సలహాలను పట్టించుకోకుండా పెడచెవిన పెడుతున్నారని’’ విమర్శించింది.

అంతేకాకుండా.. ‘‘వంగవీటి రంగా తర్వాత మా కాపు వర్గానికి ఒక నాయకుడు వచ్చాడని మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. అలాగే మా కాపు వర్గానికి చెందిన పవన్ కు ఓటు వెయ్యాలని ప్రతి ఇంట గడప తొక్కాం. ఈ క్రమంలోనే ఎందరో తమ ఉద్యోగాలు వదులుకొని పవన్ వెంట నడిచారు. కానీ నేడు పవన్ మా లాంటి వారిని నట్టేట ముంచేశారు. జనసేన గెలవాలని మేము పోరాడుతుంటే.. పవన్ మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తపిస్తున్నారు. కాగా, 2019లో పార్టీ టికెట్ కోసం ఎంతో వేడుకున్నాను.. కానీ పవన్ నన్ను కలవను కూడా కలవలేదు. ఆయన మాటలనే స్ఫూర్తిగా తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. కానీ ఆయనను కలిసే అవకాశం కూడా రాలేదు. అందరిలా పవన్ కూడా కోట్ల రూపాయలు తీసుకునే టికెట్ ఇస్తే.. మా లాంటి సాధారణ వ్యక్తులు రాజకీయాల్లోకి ఎలా వస్తారు’’ అని ప్రశ్నించింది.

‘నాకు పార్టీ టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ, మిమ్మల్ని నమ్ముకున్న వారికి టికెట్ ఇవ్వండి. అలాగే చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ మాటలు విని కేవలం 24 సీట్లు తీసుకుని జనసేన కార్యకర్తల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ముద్రగడ వంటి కాపు పెద్దలను పట్టించుకోవడం లేదు. ఎవరైనా తాను ముఖ్యమంత్రి కావాలని ఎన్నికల్లో దిగుతారు. కానీ, పవన్ మాత్రం అందుకు భిన్నంగా చంద్రబాబు కోసం పోరాడుతున్నారు’ అంటూ ఎద్దేవా చేసింది. అంతేకాక 2024 ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రకటించింది తమన్నా. మరి, పవన్ రాజకీయ పొత్తుపై తమన్నా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి