iDreamPost

ఒకే ఓవర్​లో 36 పరుగులు.. ఊచకోతకు పూరన్ నయా డెఫినిషన్!

  • Published Jun 18, 2024 | 12:17 PMUpdated Jun 18, 2024 | 12:17 PM

వెస్టిండీస్ పించ్ హిట్టర్ నికోలస్ పూరన్ చెలరేగిపోయాడు. ఊచకోతకు కొత్త డెఫినిషన్ చెబుతూ విధ్వంసక ఇన్నింగ్స్​తో అలరించాడు. ఆఫ్ఘానిస్థాన్ బౌలర్లను అతడు చెడుగుడు ఆడుకున్నాడు.

వెస్టిండీస్ పించ్ హిట్టర్ నికోలస్ పూరన్ చెలరేగిపోయాడు. ఊచకోతకు కొత్త డెఫినిషన్ చెబుతూ విధ్వంసక ఇన్నింగ్స్​తో అలరించాడు. ఆఫ్ఘానిస్థాన్ బౌలర్లను అతడు చెడుగుడు ఆడుకున్నాడు.

  • Published Jun 18, 2024 | 12:17 PMUpdated Jun 18, 2024 | 12:17 PM
ఒకే ఓవర్​లో 36 పరుగులు.. ఊచకోతకు పూరన్ నయా డెఫినిషన్!

టీ20 వరల్డ్ కప్-2024 చప్పగా సాగుతోంది. అమెరికా, వెస్టిండీస్ పిచ్​లు ట్రిక్కీగా, స్లోగా ఉండటంతో భారీ స్కోర్లు అరుదైపోయాయి. బిగ్ స్కోర్స్ మాట దేవుడెరుగు.. గౌరవప్రదమైన స్కోర్లు సాధిస్తే అదే గొప్ప అనే సిచ్యువేషన్​లో టీమ్స్ ఉన్నాయి. టాప్ టీమ్స్ కూడా 100 పరుగులు చేయాలంటే సతమతమవుతున్నాయి. వంద లోపు ఆలౌట్ అవడం ఇప్పుడు కామన్​గా మారింది. బౌలింగ్ ఫ్రెండ్లీ పిచ్​ల వల్ల పొట్టి కప్పుపై చాలా మంది అభిమానుల్లో ఆసక్తి తగ్గింది. ఈ తరుణంలో మెగా టోర్నీకి సరికొత్త జోష్ తీసుకొచ్చాడు విండీస్ చిచ్చరపిడుగు నికోలస్ పూరన్. విధ్వంసక ఇన్నింగ్స్​తో అందర్నీ అలరించాడు. ఆఫ్ఘానిస్థాన్​పై జరిగిన ఆఖరి మ్యాచ్​లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

ఆఫ్ఘానిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో పూరన్ ఊచకోతకు నయా డెఫిఇనిషన్ చెప్పాడు. 53 బంతుల్లోనే 98 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్​తో మెరిశాడు. అతడి ఇన్నింగ్స్​లో బౌండరీల కంటే సిక్సులే ఎక్కువ. 6 ఫోర్లు బాదిన ఈ విండీస్ విధ్వంసకారుడు.. ఏకంగా 8 భారీ సిక్సులు బాదాడు. ఈ క్రమంలో ఆఫ్ఘాన్ పేసర్ ఒమర్జాయి వేసిన ఓవర్​లో ఏకంగా 36 పరుగులు పిండుకున్నాడు. మొదటి బంతిని అతడు సిక్స్​గా తరలించాడు. ఆ తర్వాతి బాల్​ ఓవర్​స్టెప్ వేయడంతో అంపైర్ నోబ్​గా ప్రకటించాడు. అయితే ఆ డెలివరీని పూరన్ బౌండరీకి పంపాడు. దీంతో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో టెన్షన్​కు గురైన ఒమర్జాయి తర్వాతి బాల్​కు లెంగ్త్ తప్పాడు. ఆ బాల్​ వైడ్​గా పడి కీపర్​కు అందకుండా బౌండరీకి వెళ్లడంతో మరో ఐదు పరుగులు వచ్చాయి. అనంతరం ఒక బాల్ డాట్ అవగా.. తర్వాత వరుసగా భారీ షాట్లు బాదాడు పూరన్.

Nicholas Pooran

ఒమర్జాయి ఓవర్​లో చివరి నాలుగు బంతుల్లో ఏకంగా 20 పరుగులు వచ్చాయి. ఇందులో ఒక బంతి లెగ్​బై ఫోర్​గా వెళ్లగా.. ఆఖరి మూడు డెలివరీస్​కు ఒక ఫోర్, రెండు సిక్సులు బాదాడు పూరన్. మొత్తంగా ఆరు బంతుల్లో 36 పరుగులు రాబట్టాడు. దీంతో టీ20 వరల్డ్ కప్​లో ఒకే ఓవర్​లో 36 పరుగులు చేసిన టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ సరసన చోటు దక్కించుకున్నాడు పూరన్. ఓవరాల్​గా పొట్టి ఫార్మాట్​ హిస్టరీలో సింగిల్ ఓవర్​లో 36 పరుగులు చేయడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. అంత బాగా ఆడిన పూరన్.. 2 పరుగుల తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. అయితే అతడి సూపర్ బ్యాటింగ్ కారణంగా విండీస్ 20 ఓవర్లలో ఏకంగా 218 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన ఆఫ్ఘాన్ 114 పరుగులకే కుప్పకూలింది. పూరన్​కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మరి.. పూరన్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి