iDreamPost

సూపర్-8 కోసం టీమిండియా స్పెషల్ ప్లాన్.. రివీల్ చేసిన జడేజా!

  • Published Jun 18, 2024 | 4:59 PMUpdated Jun 18, 2024 | 4:59 PM

టీ20 ప్రపంచ కప్​ లీగ్ స్టేజ్​లో అదరగొట్టిన భారత జట్టు సూపర్-8 సవాల్​కు సిద్ధమవుతోంది. ఇన్నాళ్లూ ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లు మ్యాచ్​లు సాగనున్నాయి. దీంతో స్పెషల్ ప్లాన్స్​తో బరిలోకి దిగనుంది రోహిత్ సేన.

టీ20 ప్రపంచ కప్​ లీగ్ స్టేజ్​లో అదరగొట్టిన భారత జట్టు సూపర్-8 సవాల్​కు సిద్ధమవుతోంది. ఇన్నాళ్లూ ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లు మ్యాచ్​లు సాగనున్నాయి. దీంతో స్పెషల్ ప్లాన్స్​తో బరిలోకి దిగనుంది రోహిత్ సేన.

  • Published Jun 18, 2024 | 4:59 PMUpdated Jun 18, 2024 | 4:59 PM
సూపర్-8 కోసం టీమిండియా స్పెషల్ ప్లాన్.. రివీల్ చేసిన జడేజా!

టీ20 ప్రపంచ కప్​ లీగ్ స్టేజ్​లో అదరగొట్టిన భారత జట్టు.. సూపర్-8 సవాల్​కు సిద్ధమవుతోంది. ఇన్నాళ్లూ ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లు మ్యాచ్​లు సాగనున్నాయి. గ్రూప్ దశలో టీమిండియా ఆడిన మ్యాచ్​లన్నీ యూఎస్​ఏలోనే జరిగాయి. బ్యాటర్లు ఫెయిలైనా, బౌలింగ్ దళం అండతో అక్కడ నెగ్గుకొచ్చింది రోహిత్ సేన. కానీ ఇక మీద జరిగే మ్యాచ్​లకు కరీబియన్ గ్రౌండ్స్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. స్పిన్​కు అనుకూలించే ఈ స్లో వికెట్ల మీద ఒక్కో పరుగు కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. దూకుడును పక్కనబెట్టి ఓపికతో ఆడితే రన్స్ వస్తాయి. బౌలర్లు మాత్రం అదే జోరును కంటిన్యూ చేస్తే సరిపోతుంది. సూపర్-8 కోసం స్పెషల్ ప్లాన్స్​ వేస్తోంది టీమ్ మేనేజ్​మెంట్.

వెస్టిండీస్ పిచ్​లపై ఎలా ఆడాలనే దానిపై భారత జట్టు తగిన వ్యూహాలు రచిస్తోంది. అక్కడి కండీషన్స్​కు తగ్గట్లు బ్యాటింగ్​లో స్టో అండ్ స్టడీ అప్రోచ్​తో ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బౌలింగ్​లో మాత్రం స్పిన్నర్లను రంగంలోకి దింపి.. అటాకింగ్ మంత్రాన్ని జపించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టాప్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సూపర్-8లో భారత్ ఏ ప్లాన్​తో ముందుకు వెళ్లనుందో అతడు రివీల్ చేశాడు. అక్కడి పిచ్​లపై తమకు చాలా అనుభవం ఉందన్నాడు. వికెట్ స్పిన్​కు సహకరిస్తుంది కాబట్టి బ్యాటర్లను ఆ ఉచ్చులో పడేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. నలుగురు స్పిన్నర్ల స్ట్రాటజీని అనుసరించనున్నట్లు వెల్లడించాడు.

‘వెస్టిండీస్​లో పిచ్​లు చాలా స్లోగా ఉంటాయి. మందకొడిగా, పొడిబారినట్లు ఉండే ఈ వికెట్ల మీద స్పిన్​కు చక్కటి సహకారం అభిస్తుంది. ఇక్కడి పిచ్​లు భారత్​లోలాగే దాదాపుగా స్పిన్ ఫ్రెండ్లీ. ఇక మీదట జరిగే మ్యాచుల్లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించడం ఖాయం. డెత్ ఓవర్లలోనూ వాళ్లు బౌలింగ్ చేసే అవకాశం ఉంది’ అని జడ్డూ చెప్పుకొచ్చాడు. సూపర్ పోరుపై మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఇక్కడ తాము ఎంతో క్రికెట్ ఆడామన్నాడు. స్పిన్ ఫ్రెండ్లీ పిచ్​లు కాబట్టి ప్లేయింగ్ ఎలెవన్​లో నలుగురు స్పిన్నర్లు ఉండే ఛాన్స్ ఉందన్నాడు. అయితే వికెట్ సహకరిస్తుంది కదా అని ఎలా పడితే అలా బౌలింగ్ చేయడానికి వీల్లేదన్నాడు. టీ20ల్లో బౌలర్ కాస్త లెంగ్త్ తప్పినా బ్యాటర్లు పనిష్ చేస్తారని తెలిపాడు కుల్దీప్. గత సంవత్సరం తాము వెస్టిండీస్​తో పొట్టి ఫార్మాట్ సిరీస్ ఆడామని.. ఆ ఎక్స్​పీరియెన్స్ తమకు కలిసొస్తుందని వివరించాడు. ఇక, సూపర్-8లో భాగంగా జూన్ 20న ఆఫ్ఘానిస్థాన్, జూన్ 22న బంగ్లాదేశ్, జూన్ 24న ఆస్ట్రేలియాతో తలపడనుంది భారత్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి