iDreamPost

గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టిన పాకిస్థాన్.. దాయాది దుస్థితికి 3 కారణాలు!

  • Published Jun 15, 2024 | 12:44 PMUpdated Jun 15, 2024 | 12:44 PM

టీ20 ప్రపంచ కప్-2024 నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆ టీమ్ ఇంటిదారి పట్టింది. అసలు దాయాది దుస్థితికి ప్రధాన కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 ప్రపంచ కప్-2024 నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆ టీమ్ ఇంటిదారి పట్టింది. అసలు దాయాది దుస్థితికి ప్రధాన కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 15, 2024 | 12:44 PMUpdated Jun 15, 2024 | 12:44 PM
గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టిన పాకిస్థాన్.. దాయాది దుస్థితికి 3 కారణాలు!

పాకిస్థాన్.. క్రికెట్​లో ఘనమైన చరిత్ర కలిగిన జట్టు. ముఖ్యంగా లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్​లో మోస్ట్ డేంజరస్ టీమ్​గా దాయాదికి మంచి పేరుంది. తమదైన రోజున ఎంతటి ఛాంపియన్​ టీమ్​ను అయినా మట్టికరిపించే సత్తా పాక్​కు ఉంది. స్వింగ్, పేస్ బౌలర్ల అండతో ప్రత్యర్థులను భయపెట్టడం, చూస్తుండగానే మ్యాచ్​ను ముగించే బ్యాటర్లతో ఆ టీమ్ పకడ్బందీగా ఉండేది. అయితే మునుపటి ప్రభను కోల్పోయిన దాయాది.. ఇప్పుడు పసికూన జట్ల కంటే దారుణ ఆటతీరుతో నిరాశపరుస్తోంది. వన్డే వరల్డ్ కప్​-2023లో నాకౌట్​కు చేరకుండానే వెనుదిరిగిన పాకిస్థాన్.. ప్రస్తుతం జరుగుతున్న పొట్టి కప్పులోనూ గ్రూప్ స్టేజ్ నుంచే ఇంటిదారి పట్టింది. పసలేని బౌలింగ్, గెలవాలనే కసి లేని బ్యాటింగ్​తో ఆ జట్టు యూఎస్​ఏ లాంటి పసికూన జట్టు ముందు కూడా తలొంచింది.

వరల్డ్ కప్​ ఫస్ట్ మ్యాచ్​లో అమెరికా చేతుల్లో 5 పరుగుల తేడాతో ఓడింది పాకిస్థాన్. ఈ మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత సూపర్ ఓవర్ నిర్వహించగా.. అందులో బాబర్ సేనను చిత్తు చేసింది యూఎస్​ఏ. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి భారత్ మీద 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది పాకిస్థాన్. మూడో మ్యాచ్​లో కెనడాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆఖరి మ్యాచ్​లో ఐర్లాండ్​తో ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్​లో గెలిచినా పాక్​ సూపర్​-8కి వెళ్లదు. దీంతో ఆ పోరు నామమాత్రం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నో ఆశలతో మెగాటోర్నీలోకి అడుగు పెట్టిన బాబర్ సేన.. గ్రూప్ స్టేజ్​లోనే వెనుదిరగడానికి గల 3 కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.. పాక్​ ఫెయిల్యూర్​కు ప్రధాన కారణాల్లో ఒకటిగా కెప్టెన్ బాబర్ ఆజం ఫెయిల్యూర్ అనే చెప్పాలి. మెగా టోర్నీలో అటు బ్యాటర్​గా, ఇటు సారథిగా అతడు విఫలమయ్యాడు.

pakisthan

యూఎస్​ఏతో మ్యాచ్​లో 44 పరుగులు చేశాడు బాబర్. కానీ అందుకు అతడు తీసుకున్న బంతులు 43. ఈ మెగా టోర్నీలో ఓపెనర్​గా వచ్చిన ఆజం.. పవర్​ప్లేలో ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. అతడి స్లో బ్యాటింగ్ వల్ల ఇతర బ్యాటర్లపై ప్రెజర్ పడింది. భారత్​తో మ్యాచ్​లో 13 పరుగులు చేసిన పాక్ సారథి కీలక సమయంలో పెవిలియన్​కు చేరాడు. అతడు క్రీజులో ఉంటే ఛేజింగ్ ఈజీ అయ్యేది. బౌలింగ్ ఛేంజెస్, ఫీల్డింగ్ పొజిషన్స్​ విషయంలోనూ బాబర్ చెత్త నిర్ణయాలు టీమ్​కు శాపంగా మారాయి. బాబర్ అనే కాదు.. స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, పేసర్ షాహీన్ అఫ్రిదీ, ఫఖర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, హ్యారిస్ రౌఫ్ వంటి ఇతర సీనియర్ ఆటగాళ్ల ఫెయిల్యూర్ కూడా పాక్​ దుస్థితికి కారణాలుగా చెప్పొచ్చు.

మెగా టోర్నీ మొదలవడానికి కొన్ని రోజుల ముందు కిర్​స్టెన్​ను కొత్త కోచ్​గా నియమించింది పీసీబీ. ఐపీఎల్​ హడావుడిలో ఉన్న అతడికి.. పాక్​ టీమ్​ను అర్థం చేసుకోవడానికి, వరల్డ్ కప్​కు తగ్గట్లుగా ప్లేయర్లను ప్రిపేర్ చేయడానికి తగినంత టైమ్ ఇవ్వలేదు. ఇది కూడా టీమ్​కు నెగెటివ్​గా మారింది. జట్టులోని ఆటగాళ్లు కలసికట్టుగా ఆడకపోవడం, యూఎస్​ఏలోని ట్రిక్కీ పిచ్​లను అర్థం చేసుకోకపోవడం, వాటికి తగ్గట్లు గేమ్​ను అడ్జస్ట్ చేసుకోకపోవడం కూడా పాకిస్థాన్ గ్రూప్ స్టేజ్​లోనే ఇంటిదారి పట్టడానికి పలు కారణాలుగా చెప్పొచ్చు. మరి.. వరల్డ్ కప్​లో పాక్ ఫ్లాప్ షోకు ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి