iDreamPost

టీమిండియాకు కొత్త ఫీల్డింగ్ కోచ్.. అతడి గొప్పతనం ఏంటో తెలిస్తే మైండ్​బ్లాంక్!

  • Published Jun 18, 2024 | 10:40 AMUpdated Jun 18, 2024 | 10:40 AM

భారత జట్టుకు కొత్త హెడ్ కోచ్ రానున్నాడనేది తెలిసిందే. అయితే మెయిన్ కోచే కాదు.. ఫీల్డింగ్​ కోచ్​నూ మార్చనున్నారట. ఫీల్డింగ్ కోచ్​గా ఓ లెజెండ్​ను రంగంలోకి దింపేందుకు బీసీసీఐ సిద్ధమైందని తెలుస్తోంది.

భారత జట్టుకు కొత్త హెడ్ కోచ్ రానున్నాడనేది తెలిసిందే. అయితే మెయిన్ కోచే కాదు.. ఫీల్డింగ్​ కోచ్​నూ మార్చనున్నారట. ఫీల్డింగ్ కోచ్​గా ఓ లెజెండ్​ను రంగంలోకి దింపేందుకు బీసీసీఐ సిద్ధమైందని తెలుస్తోంది.

  • Published Jun 18, 2024 | 10:40 AMUpdated Jun 18, 2024 | 10:40 AM
టీమిండియాకు కొత్త ఫీల్డింగ్ కోచ్.. అతడి గొప్పతనం ఏంటో తెలిస్తే మైండ్​బ్లాంక్!

టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో కొత్త కోచ్ కోసం భారత క్రికెట్ బోర్డు అన్వేషిస్తోంది. కోచ్ పోస్ట్​కు దరఖాస్తు చేసుకోవాలంటూ ఓ అనౌన్స్​మెంట్ కూడా చేసింది. అయితే ఎవరెవరు ఈ పోస్ట్​కు అప్లై చేసుకున్నారనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. కానీ భారత దిగ్గజం గౌతం గంభీర్​తో పాటు ఆస్ట్రేలియా లెజెండ్స్ జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్ పేర్లు కోచ్ రేసులో బాగా వినిపించాయి. గౌతీ మెంటార్​గా ఉన్న కోల్​కతా నైట్ రైడర్స్ టీమ్ ఐపీఎల్-2024 కప్పును ఎగరేసుకుపోవడం, ఆ టోర్నీ ఫైనల్స్ ముగిశాక అతడితో బోర్డు సెక్రెటరీ జైషా సుదీర్ఘంగా సంభాషించడంతో కోచ్​గా గంభీర్ పేరు ఫైనలైజ్ అయిందని వినిపించింది. ఒక సందర్భంలో అతడు మాట్లాడుతూ కోచ్​గా రావడం తనకు ఇష్టమేనని అన్నాడు.

గంభీర్​ మాటలు, బోర్డు వ్యవహారం చూసిన అభిమానులు అతడే నయా కోచ్​ అని ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పటిదాకా హెడ్ కోచ్​గా ఎవర్ని ఫిక్స్ చేశారనేది మాత్రం బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. కానీ గౌతీని ఆ పోస్ట్​కు ఫిక్స్ చేసినట్లు క్రికెట్ వర్గాల సమాచారం. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అతడు కోచింగ్ బాధ్యతలు చేపడతాడని టాక్ నడుస్తోంది. హెడ్​ కోచ్​గా రానున్న గంభీర్​కు ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ కోచ్​లతో పాటు సపోర్ట్ స్టాఫ్​ను ఎంచుకునే స్వేచ్ఛను బోర్డు కల్పించిందని రూమర్స్ వస్తున్నాయి. ఈ తరుణంలో టీమిండియాకు కొత్త ఫీల్డింగ్ కోచ్ రానున్నాడనే వార్త నెట్టింట హల్​చల్ చేస్తోంది. సౌతాఫ్రికా దిగ్గజం, ఫీల్డింగ్ గ్రేట్ జాంటీ రోడ్స్ భారత జట్టుకు సేవలు అందించనున్నాడని పుకార్లు వస్తున్నాయి. రోడ్స్, గంభీర్ కలసి ఐపీఎల్​లో లక్నో సూపర్ జియాంట్స్ ఫ్రాంచైజీకి పనిచేశారు.

ఈ సీజన్​లో గౌతీ కేకేఆర్​కు మారినా.. రోడ్స్ మాత్రం లక్నోతోనే ఉండిపోయాడు. ఎల్​ఎస్​జీకి పనిచేసిన టైమ్​లో వీళ్ల మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని, ఒకరి వర్కింగ్ స్టైల్ మరొకరికి నచ్చిందట. అందుకే రోడ్స్​ను టీమిండియా ఫీల్డింగ్ కోచ్​గా తీసుకురావాలని గంభీర్ ప్రయత్నిస్తున్నాడట. అతడ్నే ఫీల్డింగ్ కోచ్​గా తీసుకోమంటూ బీసీసీఐకి రిఫర్ చేశాడని తెలుస్తోంది. ఒకవేళ రోడ్స్ టీమిండియాతో కలిస్తే మాత్రం మన ఆటగాళ్ల ఫీల్డింగ్ స్టాండర్స్స్ నెక్స్ట్ లెవల్​కు చేరడం పక్కా అని చెప్పాలి. ఎందుకంటే క్రికెట్​లో చాలా మంది బ్యాటింగ్, బౌలింగ్​తో పేరు తెచ్చుకుంటే రోడ్స్ మాత్రం అద్భుతమైన ఫీల్డింగ్​తో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ పాపులారిటీతో సౌతాఫ్రికా టీమ్​లో రెగ్యులర్ ప్లేయర్​గా మారిపోయాడు. ఫీల్డింగ్​తోనే చాలా మ్యాచుల్లో జట్టుకు విజయాలు అందించాడు. గాల్లో ఎగురుతూ క్యాచ్​లు పట్టడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. కోచ్​గా ఎన్నో టీమ్స్​కు పనిచేసిన అనుభవం ఉన్న అతడు వస్తే భారత్​కు తిరుగుండదు. మరి.. జాంటీ రోడ్స్ ఫీల్డింగ్​ కోచ్​గా వస్తే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి