iDreamPost

ఆకలి, అణచివేతను దాటిన ఆఫ్ఘాన్ వీరుల కథ! ఇది క్రికెట్ మార్చిన చరిత్ర!

  • Published Jun 24, 2024 | 4:36 PMUpdated Jun 24, 2024 | 4:36 PM

ఒకవైపు ఆకలి, మరోవైపు పేదరికం, దారుణమైన అణచివేత. ఆ దేశంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ అవరోధాల్ని విజయానికి మెట్లుగా మార్చుకొని పట్టుదలతో ఎదిగింది ఆఫ్ఘానిస్థాన్ జట్టు. ఇప్పుడు క్రికెట్​లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్​గా మారింది.

ఒకవైపు ఆకలి, మరోవైపు పేదరికం, దారుణమైన అణచివేత. ఆ దేశంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ అవరోధాల్ని విజయానికి మెట్లుగా మార్చుకొని పట్టుదలతో ఎదిగింది ఆఫ్ఘానిస్థాన్ జట్టు. ఇప్పుడు క్రికెట్​లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్​గా మారింది.

  • Published Jun 24, 2024 | 4:36 PMUpdated Jun 24, 2024 | 4:36 PM
ఆకలి, అణచివేతను దాటిన ఆఫ్ఘాన్ వీరుల కథ! ఇది క్రికెట్ మార్చిన చరిత్ర!

ఒకవైపు ఆకలి, మరోవైపు పేదరికం, ఇంకోవైపు దారుణమైన అణచివేత. ఆ దేశంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ అవరోధాల్ని విజయానికి మెట్లుగా మార్చుకొని పట్టుదలతో ఎదిగింది ఆఫ్ఘానిస్థాన్ జట్టు. ఇప్పుడు క్రికెట్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్​గా మారింది. టీ20 వరల్డ్ కప్-2024లో భాగంగా సూపర్ పోరులో ఫేవరెట్ ఆస్ట్రేలియాను 21 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో అందరూ ఆ టీమ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే కొన్నేళ్ల కింద వరకు రషీద్ సేనను అందరూ పసికూనగా చూసేవారు. అసోసియేట్ కంట్రీస్​పై విజయాలు తప్పితే పెద్ద విజయాలు సాధించిన దాఖలాలు లేవు. దీంతో ఆఫ్ఘాన్ అంటే క్రికెట్​లో అందరికీ చిన్నచూపు ఉండేది. అయితే కాలం గిర్రున తిరిగింది. కొద్ది గ్యాప్​లోనే ఆ జట్టు పటిష్టంగా తయారైంది. టాప్ టీమ్స్​కు షాక్ ఇవ్వడం అలవాటు చేసుకుంది.

వన్డే ప్రపంచ కప్-2023లో ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంకను మట్టికరిపించింది ఆఫ్ఘానిస్థాన్. లాస్ట్ మ్యాచ్​లో ఆస్ట్రేలియాను ఓడించినంత పని చేసింది. గ్లెన్ మాక్స్​వెల్ వీరోచిత బ్యాటింగ్​తో కంగారూలను గట్టున పడేశాడు. అతడే గనుక డబుల్ సెంచరీ కొట్టకపోతే ఆసీస్ కథ అక్కడే ముగిసేది. అయితే ఆ మ్యాచ్​లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న ఆఫ్ఘాన్.. మరింత స్ట్రాంగ్​గా కమ్​బ్యాక్ ఇచ్చింది. ప్రస్తుత పొట్టి కప్పులో మరింత పట్టుదలతో ఆడుతూ బిగ్ టీమ్స్​కు మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. లీగ్ స్టేజ్​లో న్యూజిలాండ్​ను మట్టికరిపించిన రషీద్ సేన.. సూపర్-8లో ఆసీస్ పని పట్టింది. బంగ్లాదేశ్ మీద నెగ్గి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఆకలి, పేదరికంతో బాధపడుతున్న ఆఫ్ఘాన్.. క్రికెట్​లో సంచలనాలు సృష్టించే స్థాయికి ఎలా ఎదిగిందనేది చాలా మంది మదిలో తొలుస్తున్న ప్రశ్న.

నాలుగు దశాబ్దాలుగా ఆఫ్ఘానిస్థాన్ ఆకలి, అణచివేత, పేదరికం, నిస్సహాయతతో పోరాడుతోంది. అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా ఈ దేశం బలైంది. ఎన్నో విషాదాలతో పోరాడుతున్న ఆ కంట్రీలో క్రికెట్ ఒకటే ఇప్పుడు ఆశాకిరణంగా కనిపిస్తోంది. క్రికెట్​ విజయాల మధ్య అక్కడి ప్రజలు తమ కష్టాలు, బాధల్ని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు.  రషీద్ సేన సాధించే ప్రతి గెలుపు వారికో మెడిసిన్ వంటిది. ఆఫ్ఘాన్​లో క్రికెట్ కల్చర్ లేదు. 1979లో ఆ దేశంపై రష్యా దాడి చేసినప్పుడు లక్షలాది మంది ప్రజలు పాకిస్థాన్​కు పారిపోయారు. శరణార్థి శిబిరాల్లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడుతూ దానిపై ఇష్టాన్ని పెంచుకున్నారు. వీళ్లు మళ్లీ ఆఫ్ఘాన్​కు తిరిగొచ్చి క్రికెట్ సంస్కృతిని పెంచారు. అప్పట్లో తాలిబన్లు ఈ గేమ్​ను నిషేధించినా.. ప్రజల్లో క్రికెట్​కు ఉన్న పాపులారిటీ చూసి 2000లో ఆడేందుకు పర్మిషన్ ఇచ్చారు.

గత పదేళ్లలో ఆఫ్ఘాన్ జట్టు క్రికెట్​లో ఎంతో వేగంగా ఎదిగింది. ప్రాణాలు పోతున్నా లెక్కచేయకుండా ఆడుతూ వచ్చిందా జట్టు. చిన్న లీగ్స్​లో ఆడటం నుంచి టెస్ట్ హోదా దక్కించుకోవడం వరకు ఆ టీమ్ జర్నీ అందరికీ స్ఫూర్తిదాయకమే. బీసీసీఐ, ఐసీసీ అండతో ఇంటర్నేషనల్ క్రికెట్​లో తమ ప్రయాణాన్ని విజయవంతంగా సాగిస్తోంది ఆఫ్ఘాన్. అక్కడ సౌకర్యాల కొరత ఉన్నందున మన దేశంలోని లక్నో, గ్రేటర్ నొయిడా, డెహ్రాడూన్​ను తమ సొంత మైదానంగా మార్చుకుంది. ఆ టీమ్​కు భారత ప్రభుత్వం, బీసీసీఐ సపోర్ట్ అందించడం విశేషం. ఆఫ్ఘాన్ ప్రజల అంకితభావం, సంకల్పానికి క్రికెట్ ఓ చిహ్నంగా మారింది. తాము మ్యాచ్ గెలిస్తే దేశ ప్రజలు అన్ని బాధలు మర్చిపోయి సంబురాలు చేసుకుంటారు అనే కారణం వల్లే ఆఫ్ఘాన్ క్రికెటర్లు గ్రౌండ్​లోకి దిగి సింహాల్లా పోరాడుతున్నారు. తమ వాళ్ల కోసం మ్యాచ్ గెలిచి పండుగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మరి.. పొట్టి కప్పులో ఆఫ్ఘాన్ల ఆటతీరు మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి