iDreamPost

T20 వరల్డ్ కప్ ముందు కోహ్లీకి అరుదైన గౌరవం.. మరే క్రికెటర్​కు దక్కనిది!

  • Published May 31, 2024 | 7:20 PMUpdated May 31, 2024 | 7:20 PM

టీ20 వరల్డ్ కప్​-2024 కోసం టీమిండియా ప్లేయర్లు ఎప్పుడో అమెరికాకు చేరుకున్నారు. అయితే టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం స్వదేశంలోనే ఆగిపోయాడు. కాస్త ఆలస్యంగా బయలుదేరాడు కింగ్.

టీ20 వరల్డ్ కప్​-2024 కోసం టీమిండియా ప్లేయర్లు ఎప్పుడో అమెరికాకు చేరుకున్నారు. అయితే టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం స్వదేశంలోనే ఆగిపోయాడు. కాస్త ఆలస్యంగా బయలుదేరాడు కింగ్.

  • Published May 31, 2024 | 7:20 PMUpdated May 31, 2024 | 7:20 PM
T20 వరల్డ్ కప్ ముందు కోహ్లీకి అరుదైన గౌరవం.. మరే క్రికెటర్​కు దక్కనిది!

ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్-2024లో ఆడేందుకు గానూ జట్లన్నీ యూఎస్​కు చేరుకున్నాయి. కొన్ని టీమ్స్ చాన్నాళ్ల ముందే అమెరికా గడ్డ మీద వాలిపోయాయి. టీమిండియా కూడా ఇప్పటికే అక్కడికి చేరుకొని ప్రాక్టీస్​లో మునిగిపోయింది. ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్ ముగిసిన వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ సహా మిగిలిన ప్లేయర్లు అమెరికాకు బయల్దేరారు. క్యాష్​ రిచ్ లీఫ్​ ఫైనల్​కు చేరుకున్న సన్​రైజర్స్ హైదరాబాద్, కోల్​కతా నైట్ రైడర్స్​ టీమ్స్​లో కలిపి ఒక్క రింకూ సింగ్ మాత్రమే వరల్డ్ కప్​కు సెలెక్ట్ అవడంతో అతడు ఆలస్యంగా బయల్దేరాడు. టీమ్​తో జాయిన అయిన రింకూ ప్రాక్టీస్​లో బిజీ అయిపోయాడు. అయితే అందరు నెట్స్​లో చెమటోడ్చుతుండగా కింగ్ కోహ్లీ మాత్రం ఇంకా స్వదేశంలోనే ఉన్నాడు.

రోహిత్ శర్మ సహా భారత జట్టు మొత్తం యూఎస్​ఏకు చేరుకొని సన్నాహాల్లో బిజీ అయిపోయింది. అయితే కోహ్లీ మాత్రం కాస్త ఆలస్యంగా అగ్రరాజ్యానికి బయల్దేరాడు. ఇవాళ రాత్రికల్లా అతడు అక్కడికి చేరుకోనున్నాడు. అయితే వరల్డ్ కప్ కోసం బయల్దేరే ముందు విరాట్​కు అరుదైన గౌరవం దక్కింది. మెగా టోర్నీ కోసం తమ దేశానికి బయల్దేరిన టీమిండియా స్టార్​ను అమెరికా కాన్సులేట్ గౌరవించింది. యూఎస్ కాన్సులేట్ జనరల్ మైక్ హాంకే కోహ్లీని మర్యాదపూర్వకంగా కలిశారు. కింగ్​తో చాలా సేపు ముచ్చటించారు. ఆ తర్వాత తమ కాన్సులేట్ తరఫున ఒక బ్యాట్, క్యాప్ ఇచ్చి కోహ్లికి బెస్ట్ విషెస్ చెప్పారు. ప్రపంచ కప్​లో అదరగొట్టాలని కోరుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కోహ్లీ కంటే ముందు కెప్టెన్ రోహిత్ సహా ఇతర టీమిండియా స్టార్లు అమెరికా విమానం ఎక్కారు. అయితే ఎవరికీ కూడా ఇలాంటి గౌరవం దక్కలేదు. దీంతో విరాట్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఇది అతడి స్థాయి అని అంటున్నారు. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం కోహ్లీని గౌరవిస్తే అది ఇండియన్ క్రికెట్​ను గౌరవించినట్లేనని.. పోలికలు అక్కర్లేదని, ఇది అందరికీ గర్వకారణమని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఐపీఎల్-2024లో బ్యాట్​తో విధ్వంసం సృష్టించాడు విరాట్. ఏకంగా 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్​ను దక్కించుకున్నాడు. అతడు ఇదే ఊపును వరల్డ్ కప్​లోనూ కంటిన్యూ చేస్తే భారత్​కు తిరుగుండదని అభిమానులు అంటున్నారు. కోహ్లీ కప్పును ముద్దాడితే చూడాలని ఉందని చెబుతున్నారు. మరి.. ప్రపంచ కప్​కు ముందు విరాట్​కు అరుదైన గౌరవం దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి