iDreamPost
android-app
ios-app

ఆ పాక్ స్టార్ బౌలర్ నా కొడుక్కి గిఫ్ట్ ఇచ్చాడు! వాటిని..: బుమ్రా భార్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • Published Jun 08, 2024 | 9:26 PM Updated Updated Jun 10, 2024 | 1:48 AM

తన కొడుక్కి పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదీ ఓ బహుమతి ఇచ్చాడని చెప్పుకొచ్చింది బుమ్రా భార్య సంజనా గణేశన్. మరి ఆ గిఫ్ట్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

తన కొడుక్కి పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదీ ఓ బహుమతి ఇచ్చాడని చెప్పుకొచ్చింది బుమ్రా భార్య సంజనా గణేశన్. మరి ఆ గిఫ్ట్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ పాక్ స్టార్ బౌలర్ నా కొడుక్కి గిఫ్ట్ ఇచ్చాడు! వాటిని..: బుమ్రా భార్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం ఇండియా-పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న కోట్లాది క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దాయాది దేశాల మధ్య పోరు అంటే.. దాన్ని ఓ యుద్ధంగా చూస్తారు ప్రేక్షకులు. అయితే గ్రౌండ్ లో ఇండియా-పాక్ ఆటగాళ్లు ఎంత అగ్రెసివ్ గా ఉన్నా.. మ్యాచ్ అనంతరం మాత్రం చాలా సరదాగా అన్నీ మర్చిపోయి మాట్లాడుకుంటారు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొందరు ఆటగాళ్లు అయితే.. ఇతర ప్లేయర్లపై తమకు ఉన్న అభిమానాన్ని గిఫ్ట్ ల ద్వారా ఇచ్చి తెలియజేస్తూ ఉంటారు. అలానే తన కొడుక్కి పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదీ ఓ బహుమతి ఇచ్చాడని చెప్పుకొచ్చింది బుమ్రా భార్య సంజనా గణేశన్.

సాధారణంగా  క్రికెట్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, జెర్సీలు మార్చుకోవడం లాంటి చిరు కానుకలు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇక మరికొందరు ఆటగాళ్ల ఫ్యామిలీలకు బహుమతులు ఇస్తుంటారు. అలాగే తన కొడుకుకి ఓ అద్భుతమైన గిఫ్ట్ షాహీన్ అఫ్రిదీ ఇచ్చాడు అంటూ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేశన్.

“గతేడాది ఆసియా కప్ జరుగుతున్న క్రమంలో పాకిస్తాన్ బౌలర్ షాహీన్ అఫ్రిదీ మాకు ఓ బాస్కెట్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. అయితే అది కేవలం గిఫ్ట్ మాత్రమే కాదు.. అందులో ఎన్నో ఉన్నాయి. వాటిని ఇప్పటికీ మా కొడుకు అంగద్ కోసం ఉపయోగిస్తూనే ఉన్నాం” అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది సంజనా గణేశన్. దాంతో గ్రౌండ్ లో ఎంత కోపంగా ఉన్నా.. అది అక్కడి వరకే పరిమితం చేసి.. తర్వాత ఆటగాళ్లు అందరు కలుపుగోలుగా ఉంటారన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ఇక ఎప్పుడో ఆసియా కప్ లో ఇచ్చిన గిప్ట్ ను గుర్తుపెట్టుకుని మరీ చెప్పిన బుమ్రా భార్య సంజనాపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetholiganbet