Nidhan
వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో గ్రూప్ స్టేజ్, సూపర్-8లో టీమిండియా అదరగొడుతుంది. కానీ సెమీస్, ఫైనల్స్ దశలో మాత్రం ఒత్తిడికి చిత్తవుతోంది. ఈసారి కూడా జట్టును అదే భయం వెంటాడుతోంది. అయితే టెన్షన్ అవసరం లేదని ఓ మాజీ క్రికెటర్ అంటున్నాడు.
వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో గ్రూప్ స్టేజ్, సూపర్-8లో టీమిండియా అదరగొడుతుంది. కానీ సెమీస్, ఫైనల్స్ దశలో మాత్రం ఒత్తిడికి చిత్తవుతోంది. ఈసారి కూడా జట్టును అదే భయం వెంటాడుతోంది. అయితే టెన్షన్ అవసరం లేదని ఓ మాజీ క్రికెటర్ అంటున్నాడు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024లో భారత్ ఫేవరెట్ అని అభిమానుల దగ్గర నుంచి ఎక్స్పర్ట్స్, మాజీ క్రికెటర్స్ వరకు అందరూ అంటున్నారు. కొందరు లెజెండ్స్ కూడా ఈసారి కప్పు కొట్టేది రోహిత్ సేనేనని బల్లగుద్ది చెబుతున్నారు. టీమిండియా బ్యాటింగ్ సహా అన్ని విభాగాల్లోనూ బలంగా ఉండటం, కన్సిస్టెంట్గా పెర్ఫార్మ్ చేస్తుండటం, జట్టు నిండా స్టార్లు ఉండటంతో నిపుణులు కప్పు మన టీమ్దేనని జోస్యం చెబుతున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా భారత్‌ను ఓ విషయం టెన్షన్ పెడుతోంది. అదే బిగ్ మ్యాచెస్. సెమీఫైనల్, ఫైనల్ లాంటి పెద్ద మ్యాచుల్లో టీమిండియా విఫలమవుతుండటం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఈ ఫెయిల్యూర్ వల్ల పలు ఐసీసీ ట్రోఫీలు మిస్సైంది.
గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఫస్ట్ మ్యాచ్ నుంచి ఓటమి అనేదే లేకుండా ఫైనల్‌కు దూసుకొచ్చింది టీమిండియా. దీంతో అందరూ రోహిత్ సేనదే కప్ అని అనుకున్నారు. కానీ తుదిమెట్టు మీద బోల్తా పడి టైటిల్ చేజార్చుకుంది. ఈసారి కూడా జట్టును అదే భయం వెంటాడుతోంది. బిగ్ మ్యాచెస్‌లో స్టార్ ప్లేయర్లు విఫలమవడం, ఒత్తిడికి లోనై ప్లాన్స్‌ను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకపోవడం మైనస్‌గా మారింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెమీస్, ఫైనల్స్ గురించి అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నాడు. టాప్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాదు.. ఈసారి రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా కలసి భారత్‌కు వరల్డ్ కప్ అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.
‘టీమిండియా ఐసీసీ టోర్నీల్లో బిగ్ మ్యాచెస్‌లో తడబడుతోంది. గత కొన్నేళ్లుగా ఇదే సమస్య టీమ్‌ను వేధిస్తోంది. సెమీస్, ఫైనల్స్‌లో తడబాటు వల్ల కప్పులు చేజార్చుకుంది. అయితే ఈసారి టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే రిషబ్ పంత్ రూపంలో మనకు బిగ్ మ్యాచ్ ప్లేయర్ టీమ్‌లో ఉన్నాడు. కీలక మ్యాచుల్లో ఎలా ఆడాలనే కిటుకు అతడికి తెలుసు. ఎంత ఒత్తిడి ఉన్నా తట్టుకొని నిలబడటం, మ్యాచ్‌ను ముగించడం అతడికి అలవాటు. పంత్‌తో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్‌లో టీమిండియాకు కీలకం కానున్నాడు. బిగ్ మ్యాచెస్‌లో వీళ్లిద్దరూ టీమ్‌ను గట్టెక్కిస్తారు. వీళ్లిద్దరి మీద టీమ్ మేనేజ్మెంట్ మరింత ఫోకస్ చేయాలి. భారత జట్టు భవిష్యత్తుకు వీళ్లు కీలకం కానున్నారు’ అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. మరి.. మంజ్రేకర్ చెప్పినట్లు పంత్, హార్దిక్ టీమ్‌ను గెలిపిస్తారని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
Sanjay Manjrekar “India’s problem in ICC events has been winning the semis or finals.We know enough about the Rishabh Pant,he’s a big stage,big pressure,big player.Hardik Pandya & Pant are the players India have to invest heavily in.That’s how I would go”pic.twitter.com/MBiHuDF5yQ
— Sujeet Suman (@sujeetsuman1991) June 1, 2024