iDreamPost

సూపర్-8కు ముందు భారత్​కు 3 సవాళ్లు.. ఇవి దాటితేనే కప్పు కొట్టేది!

  • Published Jun 17, 2024 | 5:50 PMUpdated Jun 17, 2024 | 5:50 PM

పొట్టి కప్పులో గ్రూప్ స్టేజ్​ను సక్సెస్​ఫుల్​గా దాటిన టీమిండియా.. సూపర్-8 పోరు కోసం సిద్ధమవుతోంది. అయితే భారత్ కప్పు కొట్టాలంటే 3 సవాళ్లను దాటాల్సి ఉంటుంది.

పొట్టి కప్పులో గ్రూప్ స్టేజ్​ను సక్సెస్​ఫుల్​గా దాటిన టీమిండియా.. సూపర్-8 పోరు కోసం సిద్ధమవుతోంది. అయితే భారత్ కప్పు కొట్టాలంటే 3 సవాళ్లను దాటాల్సి ఉంటుంది.

  • Published Jun 17, 2024 | 5:50 PMUpdated Jun 17, 2024 | 5:50 PM
సూపర్-8కు ముందు భారత్​కు 3 సవాళ్లు.. ఇవి దాటితేనే కప్పు కొట్టేది!

పొట్టి కప్పులో గ్రూప్ స్టేజ్​ను సక్సెస్​ఫుల్​గా దాటిన టీమిండియా.. సూపర్-8 పోరు కోసం సిద్ధమవుతోంది. లీగ్ స్టేజ్​లో ఐర్లాండ్, పాకిస్థాన్ సహా ఆతిథ్య అమెరికాను చిత్తు చేసిన రోహిత్ సేన.. ఆఖరి మ్యాచ్ ఆడలేకపోయింది. వర్షం కారణంగా కెనడాతో జరగాల్సిన ఈ మ్యాచ్ రద్దయింది. అయినా గ్రూప్ టాపర్​గా ఉన్న భారత్ సూపర్ పోరుకు అర్హత సాధించింది. బ్యాటర్లు ఫెయిలైనా.. బౌలర్ల అద్భుత ప్రతిభతో గ్రూప్ దశలో నెట్టుకొచ్చింది మెన్ ఇన్ బ్లూ. కానీ ఇక మీదట అలా కాదు. సూపర్-8లో ఆఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్​ను ఓడించాల్సి ఉంటుంది. ఈ జట్లన్నీ తమ లీగ్ మ్యాచ్​లు కరీబియన్​ పిచ్​ల మీదే ఆడాయి. అన్నీ ఫుల్ ఫామ్​లో ఉన్నాయి. కాబట్టి వాటిని మట్టికరిపించడం అంత ఈజీ కాదు.

వరల్డ్ కప్​లో బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్​తో భారత్ అదరగొడుతోంది. కానీ ఇక మీదటే రియల్ ఛాలెంజ్ స్టార్ట్ కానుంది. ఆఫ్ఘాన్, బంగ్లా, ఆసీస్ లాంటి టీమ్స్​ను ఓడించాలంటే టీమిండియా తమ బలహీనతల్ని అధిగమించాలి. బ్యాటింగ్ పరంగా ఉన్న ఇబ్బందుల్ని దాటాలి. ముఖ్యంగా రోహిత్ సేన 3 సవాళ్లను ఎదుర్కొంటోంది. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది బ్యాటింగ్ గురించి. జట్టు సారథి రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పూర్ ఫామ్​లో ఉన్నారు. వీళ్ల బ్యాట్లు అస్సలు గర్జించడం లేదు. ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి కింగ్ చేసింది కేవలం 5 పరుగులే. హిట్​మ్యాన్ 68 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే వీళ్ల రేంజ్​కు, ఎక్స్​పెక్టేషన్స్​కు ఆ రన్స్ ఏమాత్రం సరిపోవు.

బిగ్ మ్యాచెస్​లో నెగ్గాలంటే రోహిత్-కోహ్లీ జోడీ అదరగొట్టాల్సిందే. నాకౌట్ మ్యాచ్​ల్లో తీవ్ర ఒత్తిడిలో ఆడే సామర్థ్యం కోహ్లీ, రోహిత్​కు ఉంది. గతంలో ఇలాంటి ఎన్నో మ్యాచ్​ల్లో టీమ్​ను గట్టెక్కించిన అనుభవం వారి సొంతం. కాబట్టి సూపర్-8కి ముందు వీళ్లిద్దరూ ఫామ్​లోకి రావడం ముఖ్యం. భారత్ దాటాల్సిన మరో ఛాలెంజ్ ఓపెనింగ్. కెరీర్ మొదట్నుంచి థర్డ్ డౌన్​లో ఆడుతూ వస్తున్న కోహ్లీని ఈసారి ఓపెనర్​గా దించారు. ఐపీఎల్​లో సక్సెస్ అయ్యాడు కాబట్టి అదే ఊపును మెగా టోర్నీలోనూ కొనసాగిస్తాడని అనుకున్నారు. కానీ కింగ్ ఓపెనర్​గా ఫెయిల్ అవుతున్నాడు.

కోహ్లీకి బదులుగా కుర్రాడు యశస్వి జైస్వాల్​ను ఓపెనర్​గా తీసుకోవడమా? లేదా ఇంకేదైనా ప్లాన్​ను అయినా టీమ్ మేనేజ్​మెంట్ ఆలోచించాలి. ఓపెనర్లు రన్స్ చేయకపోతే మిగతా బ్యాటర్లపై ప్రెజర్ పడి లోస్కోర్స్ నమోదవుతాయి. టీమిండియా ముందు ఉన్న మరో సవాల్ టీమ్ కాంబినేషన్. గ్రూప్ స్టేజ్​లో అమెరికాలోని ట్రిక్కీ పిచ్​లపై ఆడిన భారత్.. ఇప్పుడు కరీబియన్ గడ్డపై ఆడనుంది. అక్కడి స్లో పిచ్​లకు తగ్గట్లు జట్టు కూర్పును సెట్ చేయాలి. ఎక్కువ మంది స్పిన్నర్లను తీసుకుంటే బెటర్. సూపర్-8కు ముందు ఈ మూడు ఛాలెంజ్​లను మెన్ ఇన్ బ్లూ అధిగమిస్తే టీమ్​కు ఎదురుండదు. అదే ఊపులో కప్పు కొట్టేయొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి