iDreamPost
android-app
ios-app

T20 World Cup: టీమిండియాను భయపెడుతున్న సూపర్-8 గత రికార్డులు! టెన్షన్ లో ఫ్యాన్స్..

  • Published Jun 17, 2024 | 8:44 AM Updated Updated Jun 17, 2024 | 8:44 AM

టీ20 వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణిస్తూ.. సూపర్ 8 కు దూసుకెళ్లిన టీమిండియాను ఇప్పుడు ఓ టెన్షన్ పట్టుకుంది. సూపర్ 8 లో గత రికార్డులు భారత్ ను భయపెడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణిస్తూ.. సూపర్ 8 కు దూసుకెళ్లిన టీమిండియాను ఇప్పుడు ఓ టెన్షన్ పట్టుకుంది. సూపర్ 8 లో గత రికార్డులు భారత్ ను భయపెడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

T20 World Cup: టీమిండియాను భయపెడుతున్న సూపర్-8 గత రికార్డులు! టెన్షన్ లో ఫ్యాన్స్..

టీ20 వరల్డ్ కప్ లోకి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా.. అంచనాలకు తగ్గట్లుగానే రాణిస్తోంది. ఈ మెగాటోర్నీలో గ్రూప్ స్టేజ్ లో వరుసగా మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించి, సూపర్ 8 కు దిగ్విజయంగా దూసుకెళ్లింది. ఇక సూపర్ 8 రౌండ్ లో టీమిండియా ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ తో తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియాను సూపర్ 8 గత రికార్డులు టెన్షన్ కు గురిచేస్తున్నాయి. మరి గత సూపర్ 8 ఎలా ఉన్నాయి? టీమిండియా ఆందోళన పడటానికి కారణం ఏంటి? ఓసారి పరిశీలిద్దాం.

టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఐసీసీ సాధారణంగా సూపర్ 8, సూపర్ 10, సూపర్ 12 రౌండ్లలో మ్యాచ్ లను నిర్వహిస్తూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం సూపర్ 8 విధానంలోనే మ్యాచ్ లను నిర్వహిస్తోంది ఐసీసీ. కాగా.. 12 సంవత్సరాల తర్వాత ఐసీసీ తిరిగి ఈ ఫార్మాట్ తీసుకొచ్చింది. చివరిగా 2012లో ఈ ఫార్మాట్ లో టోర్నీని నిర్వహించారు. ఇప్పుడు మరోసారి ఈ విధానంలో మెగాటోర్నీని ఆడిస్తోంది ఐసీసీ. అయితే సూపర్ 8 ఫార్మాట్ లో టీమిండియా రికార్డు చాలా దారుణంగా ఉంది. టీమిండియాతో పాటుగా ఫ్యాన్స్ కూడా టెన్షన్ లో ఉన్నారు. ఆ రికార్డులను ఓసారి పరిశీలిస్తే..

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టీమిండియా ఇప్పటి వరకు 12 సూపర్ 8 మ్యాచ్ లు ఆడింది. కానీ అందులో కేవలం 4 మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించి.. ఏకంగా 8 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఈ ఫార్మాట్ లో టీమిండియా విజయాల శాతం కేవలం 33. 33 శాతం మాత్రమే ఉంది. ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ తో పాటుగా టీమిండియాను భయపెడుతోంది. 2007 టీ20 వరల్డ్ కప్ లో రెండు, 2012లో రెండు విజయాలు మాత్రమే సాధించింది. మిగతా మ్యాచ్ ల్లో ఓడిపోయింది. కాగా.. ఈ నాలుగు వరల్డ్ కప్ ల్లో టీమిండియా ఎంఎస్ ధోని సారథ్యంలోనే బరిలోకి దిగింది. 2007 వరల్డ్ కప్ ను టీమిండియా ధోని కెప్టెన్సీలోనే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత సూపర్ 8 ఫార్మాట్ లో ఆడనుంది భారత జట్టు. గత గణాంకాలే ఇప్పుడు టీమిండియాను భయపెడుతున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.