iDreamPost
android-app
ios-app

వీడియో: ఒక్క నిమిషంలో గుండె ఆగిపోయినంత పని.. వరల్డ్ క్రికెట్ లో స్టన్నింగ్ క్యాచ్!

  • Published Jun 17, 2024 | 7:43 AM Updated Updated Jun 17, 2024 | 7:43 AM

ప్రపంచ క్రికెట్ ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే, ఒళ్లు గగుర్పొడిచే క్యాచ్ ఒకటి తాజాగా నమోదు అయ్యింది. ఈ క్యాచ్ చూసిన వారందరూ షాక్ కు గురౌతున్నారు.

ప్రపంచ క్రికెట్ ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే, ఒళ్లు గగుర్పొడిచే క్యాచ్ ఒకటి తాజాగా నమోదు అయ్యింది. ఈ క్యాచ్ చూసిన వారందరూ షాక్ కు గురౌతున్నారు.

  • Published Jun 17, 2024 | 7:43 AMUpdated Jun 17, 2024 | 7:43 AM
వీడియో: ఒక్క నిమిషంలో గుండె ఆగిపోయినంత పని.. వరల్డ్ క్రికెట్ లో స్టన్నింగ్ క్యాచ్!

22 గజాల క్రికెట్ పిచ్ పై బ్యాటర్ ముందుకు వచ్చి బాల్ ను బలంగా కొడితే.. ఇక ఆ బంతి సరాసరి బౌలర్ తలవైపు దూసుకొస్తే.. ఎలా ఉంటుంది? ఊహిస్తేనే వణుకు పుడుతుంది కదా? బౌలర్ స్పీడ్ కు బ్యాటర్ భారీ షాట్ కు బాల్ ఎంత వేగంగా వస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటి బాల్ ను ఎవరైనా ఒంటి చేత్తో పడతారని మీరెప్పుడైనా ఊహించారా? బహుశా కలలో కూడా ఇది సాధ్యం కాకపొవచ్చు. కానీ ఓ క్రికెట్ మ్యాచ్ లో అచ్చం ఇలాంటి వణికించే క్యాచ్ నమోదు అయ్యింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్నే దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆ క్యాచ్ ను చూసేద్దాం పదండి.

తాజాగా లంకషైర్ క్రికెట్ క్లబ్ వర్సెస్ డర్హామ్ కౌంటీ క్రికెట్ క్లబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఒళ్లు గగుర్పొడిచే క్యాచ్ నమోదు అయ్యింది. డర్హామ్ పేస్ బౌలర్ పాల్ కోగ్లిన్ వేసిన ఓ బంతిని ప్రత్యర్థి బ్యాటర్ ఫ్రంట్ కు వచ్చి భారీ షాట్ కొట్టాడు. బంతి వేగంగా కోగ్లిన్ తలవైపు దూసుకొచ్చింది. అందరూ అతడు తప్పుకుంటాడని అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా.. స్పీడ్ గా వస్తున్న బంతిని ఒంటి చేత్తో అందుకున్నాడు. దాంతో బ్యాటర్ తో పాటుగా ప్లేయర్లు అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురైయ్యారు.

కాగా.. ఆ బాల్ కనక మిస్ అయ్యితే.. అతడి తలకాయ పగిలిపోయి ఉండేది. అలాంటి క్యాచ్ ను అందుకుని కోగ్లిన్ వావ్ అనిపించుకున్నాడు. ఇక ఈ క్యాచ్ చూసిన వారికి ఒక్క నిమిషం గుండె ఆగినంత పనైంది. సోషల్ మీడియాలో ఈ క్యాచ్ వీడియో వైరల్ కావడంతో.. ప్రపంచ క్రికెట్ లో బెస్ట్ కాంట్ అండ్ బౌల్డ్ ఇదే అంటూ క్రికెట్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ స్టన్నింగ్ క్యాచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet giriş