iDreamPost

T20 వరల్డ్ కప్​లో అతడ్నే కీపర్​గా తీసుకోవాలి.. గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Apr 24, 2024 | 4:58 PMUpdated Apr 24, 2024 | 4:58 PM

టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ గురించి భారత లెజెండ్ సౌరవ్ గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతడ్నే వికెట్ కీపర్​గా తీసుకోవాలని సూచించాడు.

టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ గురించి భారత లెజెండ్ సౌరవ్ గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతడ్నే వికెట్ కీపర్​గా తీసుకోవాలని సూచించాడు.

  • Published Apr 24, 2024 | 4:58 PMUpdated Apr 24, 2024 | 4:58 PM
T20 వరల్డ్ కప్​లో అతడ్నే కీపర్​గా తీసుకోవాలి.. గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

క్రికెట్ అభిమానులు అంతా ఐపీఎల్-2024 మాయలో ఉన్నారు. క్యాష్ రిచ్ లీగ్​లో హైస్కోరింగ్ మ్యాచ్​లు జరుతుండటంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఒకదాన్ని మించి మరో మ్యాచ్ థ్రిల్లింగ్​గా సాగడం, చివరి ఓవర్ వరకూ వెళ్తుండటంతో ఫుల్​గా ఎంటర్​టైన్ అవుతున్నారు. అయితే వాళ్ల కోసం త్వరలో టీ20 వరల్డ్ కప్ కూడా రాబోతోంది. జూన్​లో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే టీమ్స్ అన్నీ దీనికి సంబంధించిన ప్రిపరేషన్స్​లో ఉన్నాయి. టీమిండియా ఆటగాళ్లు కూడా ఐపీఎల్​లో ఆడుతూ తమ ఫామ్, ఫిట్​నెస్​ను మరింత పెంచుకుంటున్నారు. త్వరలో ప్రపంచ కప్ జట్టును ప్రకటించనున్నారు. దీంతో జట్టులో ఎవరెవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వికెట్ కీపింగ్ పొజిషన్​ విషయంలో ఇది మరింత ఎక్కువగా ఉంది. ఈ విషయంపై లెజెండ్ సౌరవ్ గంగూలీ రియాక్ట్ అయ్యాడు.

ఎన్నడూ లేనిది ఈసారి భారత జట్టులో వికెట్ కీపింగ్ స్థానానికి చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉండటంతో కన్​ఫ్యూజన్ ఏర్పడింది. యాక్సిడెంట్ వల్ల రెండేళ్లు ఆటకు దూరమైన రిషబ్ పంత్ ఐపీఎల్​తో రీఎంట్రీ ఇచ్చాడు. లీగ్​లో బ్యాట్​తో దుమ్మురేపుతున్న పంత్.. కీపింగ్​లోనూ తన స్కిల్స్ ప్రూవ్ చేసుకున్నాడు. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తుతూ ఫిట్​నెస్ పరంగానూ ఢోకా లేదని హామీ ఇస్తున్నాడు. పంత్​తో పాటు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్​లు కూడా మంచి ఫామ్​లో ఉన్నారు. వీళ్లే అనుకుంటే సీనియర్ ప్లేయర్ దినేష్ కార్తీక్ కూడా భీకర ఫామ్​లో ఉండటం, విధ్వంసక ఇన్నింగ్స్​లతో విరుచుకుపడుతుండటంతో వరల్డ్ కప్ టీమ్​లో కీపర్​గా ఎవర్ని తీసుకుంటారో అర్థం కావడం లేదు. ఈ విషయంపై గంగూలీ రియాక్ట్ అయ్యాడు. పంత్​నే యూఎస్​కు పంపాలని సూచించాడు.

టీ20 వరల్డ్ కప్ టీమ్​లో పంత్ ఉండాల్సిందేనని గంగూలీ అన్నాడు. బ్యాటర్​గా, కీపర్​గా అతడి సేవలు జట్టుకు అవసరమని చెప్పాడు. వికెట్ కీపింగ్ పొజిషన్​కు అతడ్ని మించినోడు లేడని తెలిపాడు. కీపింగ్ అంశంతో పాటు ఇతర విషయాల మీదా దాదా రియాక్ట్ అయ్యాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి 40 బంతుల్లో సెంచరీ బాదే సత్తా ఉందని, అతడ్ని తక్కువ అంచనా వేయొద్దని పేర్కొన్నాడు. పొట్టి ప్రపంచ కప్​లో విరాట్-రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగాలని సూచించాడు. వాళ్లిద్దరూ గ్రేట్ ప్లేయర్స్ అని.. ఓపెనర్లుగా దిగితే బాగుంటుందన్నాడు. అయితే ఇది తన పర్సనల్ ఆప్షన్ అని చెప్పాడు. వరల్డ్ కప్ నెగ్గాలంటే భారత జట్టు ఫియర్​లెస్ అప్రోచ్​తో ముందుకెళ్లాలని వ్యాఖ్యానించాడు దాదా. టీమిండియాకు లాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉందని, వికెట్లు పడినా మ్యాచ్​ను కంట్రోల్ చేయొచ్చన్నాడు. ఆస్ట్రేలియా లాంటి టాప్ టీమ్​ను దాటి కప్పు కొట్టాలంటే హిట్టింగ్​ను నమ్ముకొని దూకుడు మంత్రాన్ని జపించడం ఒక్కటే మార్గమని గంగూలీ వివరించాడు. మరి.. ప్రపంచ కప్​లో పంత్​ను కీపర్​గా ఆడించాలని దాదా చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి