iDreamPost

MS Dhoni: నిన్న మ్యాచ్ ఓడిపోయిన బాధలో.. ధోని చేసిన ఈ అద్భుతాన్ని ఫ్యాన్స్ గమనించలేదు!

నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఓ అద్భుతం చేశాడు ధోని. కానీ ఓడిపోయిన బాధలో దాన్ని ఎవ్వరూ గుర్తించలేదు. ఇంతకీ ధోని చేసిన ఆ మెరాకిల్ ఏంటంటే?

నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఓ అద్భుతం చేశాడు ధోని. కానీ ఓడిపోయిన బాధలో దాన్ని ఎవ్వరూ గుర్తించలేదు. ఇంతకీ ధోని చేసిన ఆ మెరాకిల్ ఏంటంటే?

MS Dhoni: నిన్న మ్యాచ్ ఓడిపోయిన బాధలో.. ధోని చేసిన ఈ అద్భుతాన్ని ఫ్యాన్స్ గమనించలేదు!

మహేంద్రసింగ్ ధోని.. వికెట్ల వెనక ఉన్నా, క్రీజ్ లో బ్యాటింగ్ చేస్తున్నా ప్రత్యర్థి ఆటగాళ్లకు వణుకు పుట్టాల్సిందే. ఈ ఐపీఎల్ సీజన్ కు ముందు కెప్టెన్ గా తన మాస్టర్ మైండ్ తో పదునైన వ్యూహాలను పన్ని అపోజిషన్ టీమ్ ను బుట్టలో పడేస్తుంటాడు. ఇక ఓడిపోతాం అనుకున్న మ్యాచ్ ను సైతం ప్రత్యర్థి నుంచి లాగేసుకోవడంలో ధోనిని మించిన సిద్ధహస్తుడు లేడంటే అతిశయోక్తికాదు. అలాంటి మహేంద్రుడు నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఓ అద్భుతం చేశాడు. కానీ ఓడిపోయిన బాధలో దాన్ని ఎవ్వరూ గుర్తించలేదు. ఇంతకీ ధోని చేసిన ఆ మెరాకిల్ ఏంటంటే?

ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న చెపాక్ వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్ లో చెన్నై 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 211 పరుగుల టార్గెట్ ను కాపాడుకోలేక ప్రత్యర్థికి విజయాన్ని సమర్పించేసింది. ఇక సెంచరీ చేసినా తమ టీమ్ ను గెలిపించుకోలేకపోయాడు సీఎస్కే సారథి రుతురాజ్ గైక్వాడ్. కానీ మరోవైపు అద్భుత శతకంతో లక్నోకు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాడు స్టార్ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ మ్యాచ్ లో ధోని ఓ అద్భుతం చేశాడు. అసలేం జరిగిందంటే?

లక్నో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేయడానికి వచ్చాడు తుషార్ దేశ్ పాండే. అప్పటికి క్రీజ్ లో నికోలస్ పూరన్-మార్కస్ స్టోయినిస్ ఉన్నాడు. ఈ క్రమంలో ఈ ఓవర్ చివరి బంతిని నోబాల్ వేశాడు దేశ్ పాండే. ఆ బాల్ ను స్టోయినిస్ ఫోర్ కొట్టాడు. ఇక నెక్ట్స్ బాల్ ఫ్రీ హిట్ రావడంతో అందరూ ఆ బాల్ సిక్స్ పడుతుందని అనుకున్నారు. కానీ దేశ్ పాండే ఆఫ్ సైడ్ దూరంగా విసిరాడు. అయితే అంపైర్ ఆ బాల్ ను వైడ్ గా ప్రకటించాడు. కానీ వికెట్ల వెనక ఉన్న ధోని అది వైడ్ బాల్ కాదని పసిగట్టి.. రివ్యూ తీసుకున్నాడు. దీంతో థర్డ్ అంపైర్ ఆ బాల్ ను పరిశీలించాడు. బాల్ ను కొట్టే క్రమంలో స్టోయినిస్ కాస్త ముందుకు జరిగాడు దీంతో అది వైడ్ కాదని థర్డ్ అంపైర్ తెలిపాడు. దీంతో చెన్నైకి రన్స్ సేవ్ అయ్యాయి.

అయితే మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. ఒక వేళ గెలిచే అవకాశం వస్తే.. ఈ బాలే కీలకం అవుతుందేమో? ఏమో ఎవరికి తెలుసు? ఏ క్షణాన మ్యాచ్ ఎటు మారుతుందో? కానీ ధోని చేసిన ఈ మెరాకిల్ ను ఎవ్వరూ గమనించలేదు. ఈ విషయం బౌలర్ కు గానీ దగ్గరలో ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ కి గానీ తెలియలేదు. ఎక్కడ చిన్న తప్పు జరిగినా గానీ క్షణాల్లో పసిగట్టడం ధోని నైజం. గతంలో ఎన్నో మ్యాచ్ ల్లో రివ్యూలు తీసుకుని అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు తగిన గుణపాఠాలు నేర్పేవాడు. అంపైర్లు సైతం ధోని రివ్యూ తీసుకున్నాడంటే తమ పనైపోయిట్లే అని బయపడుతూ ఉంటారు. మరి నిన్న జరిగిన మ్యాచ్ లో ఈ అద్భుతాన్ని ఎంత మంది గుర్తించారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి