iDreamPost

IND vs USA: వీడియో: కోహ్లీ గోల్డెన్ డకౌట్.. రోహిత్ శర్మ షాకింగ్ రియాక్షన్!

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ డకౌట్ గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ డకౌట్ గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

IND vs USA: వీడియో: కోహ్లీ గోల్డెన్ డకౌట్.. రోహిత్ శర్మ షాకింగ్ రియాక్షన్!

టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తాజాగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. దర్జాగా సూపర్ 8కు అర్హత సాధించింది. ఎప్పటిలాగే ఈ మ్యాచ్ లో కూడా లో స్కోరింగ్ నమోదు అయ్యింది. అయితే పసికూనపై అయినా రాణిస్తాడని అనుకున్న విరాట్ కోహ్లీ మరోసారి ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ లో గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. ఇక కోహ్లీ అవుట్ అయినప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

పసికూన అమెరికాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కాస్త కష్టంగానే గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన యూఎస్ఏకు తొలి బంతికే షాకిచ్చాడు అర్షదీప్ సింగ్. ఓపెనర్ జహంగీర్(0) నును ఎల్బీ రూపంలో బలిగొన్నాడు. ఇదే ఓవర్ చివరి బంతికి వికెట్ కీపర్ గౌస్(2)ను పెవిలియన్ కు పంపించాడు. ఆ తర్వాత ఏ బ్యాటర్లు కూడా భారత బౌలర్లను అడ్డుకోలేకపోయారు. స్టీవ్ టేలర్(24) పరుగులతో ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ.. అతడిని అక్షర్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత అర్షదీప్, హార్దిక్ పాండ్యాలు అమెరికా ఇన్నింగ్స్ ను కాకవికలం చేశారు. ఎన్ఆర్ కుమార్(27) టాప్ స్కోరర్ గా నిలవగా మిగతావారందరూ తక్కువ స్కోర్లకే పరిమితం అయ్యారు.

దాంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది అమెరికా. అర్షదీప్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో తన 4 ఓవర్ల కోటాలో కేవలం 9 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. పాండ్యా 2 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 111 రన్స్ ఈజీ టార్గెట్ ను టీమిండియా కాస్త కష్టంగానే ఛేదించింది. 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ(3), విరాట్ కోహ్లీ(0) మరోసారి విఫలం కాగా.. రిషబ్ పంత్(18), సూర్యకుమార్(50 నాటౌట్), శివమ్ దూబే(31 నాటౌట్) పరుగులతో రాణించారు.

ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తొలి ఓవర్ రెండో బంతికే నేత్రావల్కర్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి.. డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ ఇచ్చిన షాకింగ్ రియాక్షన్ నెట్టింట వైరల్ గా మారింది. యూఎస్ఏ బౌలర్ అద్భుతంగా బంతిని వేశాడు అనే విధంగా హిట్ మ్యాన్ రియాక్షన్ ఇచ్చాడు. కాగా.. ఈ మెగాటోర్నీలో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలం అవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లో కేవలం 5 రన్స్ మాత్రమే చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by ICC Hindi (@icchindiofficial)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి