iDreamPost
android-app
ios-app

Rohit Sharma: పాక్​తో మ్యాచ్​పై రోహిత్ గురి.. ఆ అరుదైన రికార్డుకు మూడింది!

  • Published May 31, 2024 | 6:12 PM Updated Updated May 31, 2024 | 6:12 PM

టీ20 వరల్డ్ కప్-2024లో టీమిండియాను విజేతగా నిలపాలని కసితో ఉన్నాడు రోహిత్ శర్మ. పొట్టి కప్పును కైవసం చేసుకొని కెరీర్​ను చిరస్మరణీయం చేసుకోవాలని భావిస్తున్నాడు.

టీ20 వరల్డ్ కప్-2024లో టీమిండియాను విజేతగా నిలపాలని కసితో ఉన్నాడు రోహిత్ శర్మ. పొట్టి కప్పును కైవసం చేసుకొని కెరీర్​ను చిరస్మరణీయం చేసుకోవాలని భావిస్తున్నాడు.

  • Published May 31, 2024 | 6:12 PMUpdated May 31, 2024 | 6:12 PM
Rohit Sharma: పాక్​తో మ్యాచ్​పై రోహిత్ గురి.. ఆ అరుదైన రికార్డుకు మూడింది!

టీ20 వరల్డ్ కప్-2024 మరో రెండ్రోజుల్లో మొదలుకానుంది. అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ లవర్స్ కళ్లలో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. స్టార్ ప్లేయర్ల విన్యాసాలు చూసేందుకు ఆతృతగా ఉన్నారు. మెగా టోర్నీ కోసం ఇప్పటికే దాదాపుగా అన్ని జట్లు యూఎస్ చేరుకున్నాయి. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు కూడా అమెరికా గడ్డ మీద అడుగుమోపింది. మెన్ ఇన్ బ్లూ ప్రాక్టీస్ సెషన్స్​లో చెమటోడుస్తున్నారు. అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నారు. వన్డే వరల్డ్ కప్-2023 తృటిలో మిస్సయినందున పొట్టి కప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని ఫిక్స్ అయ్యారు. కెప్టెన్ రోహిత్ కూడా ఈ విషయంలో పట్టుదలతో ఉన్నాడు.

టీ20 వరల్డ్ కప్​ను నెగ్గి కెరీర్​ను చిరస్మరణీయం చేసుకోవాలని హిట్​మ్యాన్ భావిస్తున్నాడు. బలమైన టీమ్ అందుబాటులో ఉండటంతో అన్ని టీమ్స్​కు షాకిచ్చి పొట్టి కప్పును సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు. అదే సమయంలో ఓ రికార్డు మీద కూడా రోహిత్ కన్నేశాడు. పాకిస్థాన్​తో జరిగే ఫస్ట్ మ్యాచ్​లోనే దాన్ని బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. దాయాదితో మ్యాచ్​పై భారత కెప్టెన్ గురి పెట్టాడు. ఆ మ్యాచ్​తో 600 సిక్సుల క్లబ్​లోకి అడుగు పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటిదాకా 597 సిక్సులు కొట్టిన హిట్​మ్యాన్.. పాక్​తో మ్యాచ్​లో ఇంకో 3 సిక్సులు బాదాలని చూస్తున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్​లో ఇప్పటిదాకా ఏ బ్యాటర్ కూడా ఆరొందల సిక్సులు కొట్టలేదు.

పాకిస్థాన్​తో మ్యాచ్​తో 600 సిక్సర్ల క్లబ్​లోకి ఎంట్రీ ఇవ్వాలని రోహిత్ ఉవ్విళ్లూరుతున్నాడు. మెగా టోర్నీలో దాయాదితోనే తొలి మ్యాచ్ ఆడనుంది టీమిండియా. జూన్ 9వ తేదీన న్యూయార్క్​లో ఈ మ్యాచ్ జరగనుంది. దీంతో పాక్​తో మ్యాచ్​లో 3 సిక్సర్లు బాది ఆల్​టైమ్ రికార్డు క్రియేట్ చేయాలని భావిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్​లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లలో రోహిత్ ఫస్ట్ ప్లేస్​లో ఉండగా.. అతడి తర్వాతి స్థానంలో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (553 సిక్సర్లు) ఉన్నాడు. 476 సిక్సర్లతో పాక్ లెజెండ్ షాహిద్ అఫ్రిదీ థర్డ్ ప్లేస్​లో ఉన్నాడు. బ్రెండన్ మెకల్లమ్ (398), మార్టిన్ గప్తిల్ (383), ఎంఎస్ ధోని (359), సనత్ జయసూర్య (352), ఇయాన్ మోర్గాన్ (346), ఏబీ డివిలియర్స్ (328), జాస్ బట్లర్ (326) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో బట్లర్ ఒక్కడే సిక్సర్ల రేసులో ఉన్నాడు. కానీ అతడికి రోహిత్​కు భారీ తేడా ఉంది. కాబట్టి హిట్​మ్యాన్ అత్యధిక సిక్సర్ల ఫీట్​ను బద్దలుకొట్టడం ఇప్పట్లో అయ్యే పని కాదనే చెప్పాలి.