Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 ఇంకో నాల్రోజుల్లో మొదలవనుంది. ఇప్పటికే మెగా టోర్నీ కోసం అన్ని జట్లు కూడా యూఎస్‌కు చేరుకున్నాయి. ఆటగాళ్లందరూ నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. కొన్ని టీమ్స్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడేశాయి. ఫేవరెట్స్‌లో ఒకటైన టీమిండియా కూడా అగ్రరాజ్యానికి చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా జట్టు ఆటగాళ్లందరూ క్రికెట్ ప్రాక్టీస్‌తో పాటు ఫుల్బాల్, వాలీబాల్ ఆడుతూ ఫిట్నెస్ను మరింత మెరుగుపర్చుకుంటున్నారు. వన్డే వరల్డ్ కప్ మిస్సయ్యాం.. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పొట్టి కప్పును చేజార్చుకోవద్దనే కసితో సన్నద్ధం అవుతున్నారు. హిట్‌మ్యాన్ సహచరులతో కలసి జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈసారి ఎలాంటి తప్పుకు అవకాశం ఇవ్వకుండా.. టైటిల్ కొట్టాలని అతడు పట్టుదలతో ఉన్నాడు.
ఫస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ప్రిపేర్ అవుతోంది. ఆటగాళ్లందరిలో మెగా టోర్నీలో ఆడుతున్నామనే జోష్ కనిపిస్తోంది. అయితే మిగతా వాళ్లందరి కంటే కెప్టెన్ రోహిత్‌కు ఇది చాలా స్పెషల్ టోర్నీగా మిగిలిపోనుంది. దీనికి కారణం అతడికి ఇది 9వ టీ20 ప్రపంచ కప్ కావడమే. రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హిట్‌మ్యాన్ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో నిర్వహించిన ప్రతి వరల్డ్ కప్‌లోనూ ఆడిన ప్లేయర్‌గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. అతడితో పాటు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ కూడా ఈ ఫీట్‌ను అందుకున్నాడు. 2007 నుంచి ఇప్పటిదాకా జరిగిన 8 టీ20 ప్రపంచ కప్‌ల్లో వీళ్లిద్దరూ ఆడుతూ వచ్చారు. యూఎస్ఏ ఆతిథ్యం ఇస్తున్న తాజా టోర్నీ వీళ్లకు తొమ్మిదోది కానుంది.
ఆరంభ టోర్నమెంట్ నుంచి ఇప్పటిదాకా జరిగిన ప్రతి టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన ప్లేయర్లుగా రోహిత్, షకీబ్ నిలిచారు. ఈ టోర్నీ వీళ్లకు స్పెషల్‌గా నిలిచిపోనుంది. వీళ్లిద్దరి రికార్డును బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. కనీసం దశాబ్దంన్నర కన్సిస్టెంట్గా ఆడుతూ రన్స్ చేస్తే తప్ప టీమ్‌లో కొనసాగలేరు. అందునా తీవ్ర పోటీ ఉండే వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కాలంటే ఆ ప్లేయర్ నిలకడకు మారుపేరుగా, టీమ్‌కు వెన్నెముకగా ఉండాలి. భవిష్యత్తులో వీళ్ల రికార్డును ఇంకెవరైనా బ్రేక్ చేస్తారేమో చూడాలి. రోహిత్ క్రేజీ రికార్డుపై ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. హిట్‌మ్యాన్ పరుగుల వరద పారించడంతో పాటు అద్భుతమైన కెప్టెన్సీతో టీమ్‌కు కప్పు అందించాలని కోరుతున్నారు. టైటిల్ అందించి టోర్నీని చిరస్మరణీయం చేసుకోవాలని చెబుతున్నారు.
Rohit Sharma and Shakib Al Hasan are the only two players who’ve participated in every T20 World Cup edition. pic.twitter.com/wrmCYlyyHP
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2024