Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెడీ అయ్యాడు. ఫస్ట్ మ్యాచ్ నుంచే జట్టు పవర్ ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడు. వరుస విజయాలతో ప్రత్యర్థులను వణికించాలని డిసైడ్ అయ్యాడు.
టీ20 వరల్డ్ కప్-2024 కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెడీ అయ్యాడు. ఫస్ట్ మ్యాచ్ నుంచే జట్టు పవర్ ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడు. వరుస విజయాలతో ప్రత్యర్థులను వణికించాలని డిసైడ్ అయ్యాడు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ సిద్ధంగా ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్ నుంచే జట్టు పవర్ ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడు. వరుస విజయాలతో ప్రత్యర్థులను వణికించాలని డిసైడ్ అయ్యాడు. ఎవరు ఎదురొచ్చినా తొక్కుకుంటూ పోవాలని చూస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్-2023 తృటిలో చేజారడంతో బాధలో ఉన్న హిట్‌మ్యాన్.. ఆ కసిని అంతా పొట్టి కప్పులో చూపించాలని అనుకుంటున్నాడు. ఐర్లాండ్‌తో జరిగే ఫస్ట్ మ్యాచ్‌లో భారీ విజయం సాధించి.. కప్పు వేటలో తాము ఎంత పట్టుదలతో ఉన్నామో చూపించాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్లే ప్రాక్టీస్ సెషన్స్‌లో చెమటోడ్చుతున్నాడు. ఫిట్నెస్ను పెంచుకోవడంతో పాటు బ్యాటింగ్‌ను కూడా మెరుగుపర్చుకుంటున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడాలని డిసైడ్ అయ్యాడు.
భారత్-ఐర్లాండ్ పోరుకు అంతా సిద్ధమైపోయింది. న్యూయార్క్ వేదికగా బుధవారం ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడ్ని ఎంత బతిమిలాడినా మాట వినట్లేదని అన్నాడు. తాను ఇంక చెయ్యగలిగిందేమీ లేదని చెప్పాడు. హిట్‌మ్యాన్ అన్నది మరెవరి గురించో కాదు.. కోచ్ రాహుల్ ద్రవిడ్ గురించే. హెడ్ కోచ్‌గా పదవీకాలం పూర్తవడంతో మెగా టోర్నీ తర్వాత టీమిండియాను వీడనున్నాడు ద్రవిడ్. అతడి స్థానంలో కొత్త కోచ్ కోసం అన్వేషిస్తోంది బీసీసీఐ. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే కోచ్ అయ్యే ఛాన్స్ ఉన్నా.. తాను అప్లై చేసుకోనని, కోచ్‌గా వరల్డ్ కప్ తనకు ఆఖరిదని ద్రవిడ్ స్పష్టం చేశాడు. దీంతో రోహిత్ పైవిధంగా రియాక్ట్ అయ్యడు. ఇంకొన్నాళ్లు టీమ్‌తో ఉండాల్సిందిగా బతిమిలాడినా ద్రవిడ్ వినిపించుకోలేదన్నాడు హిట్‌మ్యాన్.
‘కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో నాకు మంచి రిలేషన్ ఉంది. అతడే నా ఫస్ట్ కెప్టెన్. అతడి సారథ్యంలో ఎన్నో మ్యాచుల్లో టీమిండియాకు ఆడా. నాకు మాత్రమే కాదు.. జట్టులోని ఆటగాళ్లందరికీ ద్రవిడే బిగ్ రోల్ మోడల్. జట్టుతో ఉండమని, కోచ్‌గా ఇంకొన్నాళ్లు మమ్మల్ని నడిపించమని అతడ్ని కోరా. టీమ్‌ను వీడొద్దు.. కోచ్‌గా కొనసాగమంటూ కన్విన్స్ చేశా. కానీ అతడు ఒప్పుకోలేదు. అతడు టీమిండియాను వదిలి వెళ్లిపోతుంటే చూడటం నా వల్ల కావడం లేదు’ అని రోహిత్ ఎమోషనల్ అయ్యాడు. దీన్ని బట్టే ద్రవిడ్‌తో హిట్‌మ్యాన్‌కు ఉన్న అనుబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రోహిత్ కామెంట్స్ చూసిన నెటిజన్స్.. కోచ్-కెప్టెన్ మధ్య ఇంతమంచి బాండింగ్ ఉండటం అరుదని అంటున్నారు. వీళ్ల జోడీ సూపర్బ్ అని.. ద్రవిడ్ ఇంకొన్నాళ్లు కోచ్‌గా కొనసాగితే బాగుండేదని చెబుతున్నారు. మరి.. ద్రవిడ్‌ను బతిమిలాడినా తన మాట వినలేదంటూ రోహిత్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Rohit Sharma said – “My equation with Rahul Dravid is very good. He is my first Captain. I played under him, He is such a big role model for all of us. I try to convince him to continue as coach. I will not be able to see him go”. (Got emotional). pic.twitter.com/d7ZfAI7fS0
— Tanuj Singh (@ImTanujSingh) June 4, 2024