Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 కోసం టాప్ ప్లేయర్లు అంతా వెయిట్ చేస్తున్నారు. మెగా టోర్నీలో సత్తా చాటి తమ జట్లను గెలిపించాలని చూస్తున్నారు. అదే టైమ్‌లో సూపర్ పెర్ఫార్మెన్స్తో ఫ్యాన్స్ మనసులు దోచుకోవాలని భావిస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్-2024 కోసం టాప్ ప్లేయర్లు అంతా వెయిట్ చేస్తున్నారు. మెగా టోర్నీలో సత్తా చాటి తమ జట్లను గెలిపించాలని చూస్తున్నారు. అదే టైమ్‌లో సూపర్ పెర్ఫార్మెన్స్తో ఫ్యాన్స్ మనసులు దోచుకోవాలని భావిస్తున్నారు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 కోసం టాప్ ప్లేయర్లు అంతా వెయిట్ చేస్తున్నారు. మెగా టోర్నీలో సత్తా చాటి తమ జట్లను గెలిపించాలని చూస్తున్నారు. అదే టైమ్‌లో సూపర్ పెర్ఫార్మెన్స్తో ఫ్యాన్స్ మనసులు దోచుకోవాలని భావిస్తున్నారు. దీంతో ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రపంచ కప్‌లో బెస్ట్ స్కోరర్ ఎవరు అవుతారు? మోస్ట్ వికెట్ టేకర్‌గా ఎవరు నిలుస్తారు? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. మాజీ క్రికెటర్స్, ఎక్స్పర్ట్స్ దీని గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మటుకు అందరూ టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు చెబుతున్నారు. కోహ్లీ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలవడం పక్కా అని చెబుతున్నారు. ఐపీఎల్-2024లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన కింగ్.. పొట్టి కప్పులోనూ అదే మ్యాజిక్‌ను కంటిన్యూ చేయడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.
కోహ్లీ తర్వాత లీడింగ్ రన్ స్కోరర్‌గా వినిపిస్తున్న పేరు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మదే. హిట్‌మ్యాన్ టచ్‌లోకి వస్తే అత్యధిక పరుగులు బాదడం ఖాయమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ మాత్రం ఇతరుల అభిప్రాయాలకు భిన్నంగా తన ప్రిడిక్షన్ చెప్పాడు. ఈసారి ప్రపంచ కప్‌లో కోహ్లీ, రోహిత్ కాదు.. కంగారూ ఓపెనర్ ట్రావిస్ హెడ్ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని అన్నాడు. అలాగే భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలుస్తాడని పాంటింగ్ జోస్యం పలికాడు. బ్యాటింగ్‌లో హెడ్, బౌలింగ్‌లో బుమ్రాను దాటడం ఎవరి వల్లా కాదని.. ఈ మెగా టోర్నీలో వాళ్ల హవా నడవడం పక్కా అని చెప్పాడు. పాంటింగ్ ప్రిడిక్షన్‌కు కొన్ని విషయాలు ఊతం ఇస్తున్నాయి.
ఐపీఎల్-2024లో ట్రావిస్ హెడ్ 15 మ్యాచుల్లో 191 స్ట్రైక్ రేట్‌తో 567 పరుగులు చేశాడు. 4 హాఫ్ సెంచరీలు బాదిన ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ లీగ్ మ్యాచెస్‌లో రెచ్చిపోయి ఆడాడు. ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్‌కు దిగుతూ ప్రత్యర్థులను బెదరగొట్టాడు. అతడు ఉన్న ఫామ్‌లో మ్యాజికల్ డెలివరీస్ పడితే తప్ప ఆపడం కష్టమే. అటు జస్ప్రీత్ బుమ్రా కూడా క్యాష్ రిచ్ లీగ్‌లో దుమ్మురేపాడు. 20 వికెట్లతో అలరించాడు. అతడి బౌలింగ్ ఎకానమీ 6. ఒకవైపు వికెట్లు తీస్తూనే మరోవైపు పరుగులు కూడా కట్టడి చేస్తూ బ్యాటర్లు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. ఇలా అద్భుత ప్రదర్శనలతో అదరగొట్టడంతో వీళ్లిద్దరిదే ఈ వరల్డ్ కప్ అని పాంటింగ్ చెప్పినట్లుగా కనిపిస్తోంది. మరి.. హెడ్ టాప్ స్కోరర్‌గా, బుమ్రా లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలుస్తారంటూ పాంటింగ్ పలికిన జోస్యంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Ricky Ponting predicts Travis Head as the leading run scorer and Jasprit Bumrah as the leading wicket taker at the 2024 T20 World Cup. 🏆 pic.twitter.com/9u8Cr8dB5B
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 30, 2024