iDreamPost
android-app
ios-app

బుమ్రా, సిరాజ్ కాదు.. బౌలింగ్​లో రోహిత్ నమ్మాల్సింది అతడ్నే: బాలాజీ

  • Published Jun 03, 2024 | 5:44 PM Updated Updated Jun 03, 2024 | 5:44 PM

బ్యాటర్లు మ్యాచ్​లు గెలిపిస్తే, బౌలర్లు ట్రోఫీలు గెలిపిస్తారని క్రికెట్​లో ఓ సామెత ఉంది. అందునా వరల్డ్ కప్ లాంటి మేజర్ టోర్నీల్లో విజేతగా నిలవాలంటే బౌలింగ్ దళం కలసికట్టుగా రాణించాల్సి ఉంటుంది.

బ్యాటర్లు మ్యాచ్​లు గెలిపిస్తే, బౌలర్లు ట్రోఫీలు గెలిపిస్తారని క్రికెట్​లో ఓ సామెత ఉంది. అందునా వరల్డ్ కప్ లాంటి మేజర్ టోర్నీల్లో విజేతగా నిలవాలంటే బౌలింగ్ దళం కలసికట్టుగా రాణించాల్సి ఉంటుంది.

  • Published Jun 03, 2024 | 5:44 PMUpdated Jun 03, 2024 | 5:44 PM
బుమ్రా, సిరాజ్ కాదు.. బౌలింగ్​లో రోహిత్ నమ్మాల్సింది అతడ్నే: బాలాజీ

బ్యాటర్లు మ్యాచ్​లు గెలిపిస్తే, బౌలర్లు ట్రోఫీలు గెలిపిస్తారని క్రికెట్​లో ఓ సామెత ఉంది. అందునా వరల్డ్ కప్ లాంటి మేజర్ టోర్నీల్లో విజేతగా నిలవాలంటే బౌలింగ్ దళం కలసికట్టుగా రాణించాల్సి ఉంటుంది. వన్డే వరల్డ్ కప్-2023ని తృటిలో చేజార్చుకున్న టీమిండియా.. పొట్టి కప్పును అస్సలు వదలొద్దని చూస్తోంది. అందుకోసం బలమైన బ్యాటింగ్ విభాగంతో పాటు అంతే దృఢమైన బౌలింగ్ యూనిట్​తో అమెరికాకు చేరుకుంది. పేస్​లో జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా లాంటి టాప్ స్పిన్నర్లు కూడా జట్టులో ఉన్నారు. వీళ్లకు తోడు అర్ష్​దీప్ సింగ్, అక్షర్ పటేల్ అవకాశం వస్తే సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు.

నంబర్ వన్ బౌలర్ బుమ్రా ఈ వరల్డ్ కప్​లో భారత జట్టుకు కీలకం కానున్నాడని ఎక్స్​పర్ట్స్ అంటున్నాడు. వన్డే ప్రపంచ కప్ నుంచి ఐపీఎల్-2024 వరకు అతడికి తిరుగేలేదు. రన్స్ ఇవ్వకపోవడమే గాక వికెట్ల మీద వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. దీంతో మెగా టోర్నీలోనూ అతడే టీమిండియాకు కీలకంగా మారతాడని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే భారత మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ మాత్రం మరో విధంగా స్పందించాడు. బుమ్రా కంటే కూడా పేస్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా ముఖ్య భూమిక పోషించే అవకాశాలు ఉన్నాయని అన్నాడు. పాండ్యాను రోహిత్ నమ్మాలని.. అతడ్ని పవర్​ప్లేలోనే బౌలింగ్​కు దింపాలని సూచించాడు.

బ్యాటింగ్​లో పించ్ హిట్టింగ్​తో రఫ్ఫాడించే పాండ్యా.. బౌలింగ్​లోనూ టీమ్​కు కీలకంగా మారతాడని బాలాజీ చెప్పాడు. అతడ్ని నమ్మితే టీమ్​కు విజయాలు అందిస్తాడని తెలిపాడు. ‘హార్దిక్ పాండ్యాను పవర్​ప్లేలో బౌలింగ్​కు దించాలి. తొలి ఓవర్లతో పాటు డెత్ ఓవర్లలో కూడా అతడు ఎఫెక్టివ్​గా బౌలింగ్ చేయగలడు. హార్దిక్ ఫామ్​లోకి రావడం భారత జట్టుకు ఎంతో ముఖ్యం. బంగ్లాదేశ్​తో ప్రాక్టీస్ మ్యాచ్​లో అతడు రిథమ్​ను అందుకున్నాడు. అలవోకగా సిక్సులు కొట్టే సామర్థ్యం తన సొంతమని మరోమారు నిరూపించాడు. అతడు మళ్లీ ఈ రేంజ్​లో చెలరేగి ఆడటం చూస్తుంటే సంతోషంగా ఉంది’ అని బాలాజీ చెప్పుకొచ్చాడు. పాండ్యాలో సిక్స్ హిట్టింగ్ ఎబిలిటీస్​తో పాటు వికెట్లు తీసే నైపుణ్యం కూడా ఉందన్నాడు. అతడ్ని టీమ్ అవసరాలు, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు సరిగ్గా వాడుకోవాలని బాలాజీ సూచించాడు. మరి.. బాలాజీ చెప్పినట్లు పాండ్యా భారత్​ను గెలిపిస్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.