iDreamPost

Rohit Sharma: ఆ ఒక్క ఆలోచనే నన్ను నడిపిస్తోంది.. రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Jun 05, 2024 | 3:20 PMUpdated Jun 05, 2024 | 4:39 PM

వరల్డ్ కప్-2024 వేటను మొదలుపెట్టేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. గురువారం జరిగే తొలి మ్యాచ్​లో ఐర్లాండ్​ను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్​కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వరల్డ్ కప్-2024 వేటను మొదలుపెట్టేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. గురువారం జరిగే తొలి మ్యాచ్​లో ఐర్లాండ్​ను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్​కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • Published Jun 05, 2024 | 3:20 PMUpdated Jun 05, 2024 | 4:39 PM
Rohit Sharma: ఆ ఒక్క ఆలోచనే నన్ను నడిపిస్తోంది.. రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టీ20 ప్రపంచ కప్-2024 వేటను మొదలుపెట్టేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. గురువారం జరిగే తొలి మ్యాచ్​లో ఐర్లాండ్​ను ఎదుర్కోనుంది రోహిత్ సేన. ఈ మ్యాచ్​కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. న్యూయార్క్​లోని నసావు కౌంటీ క్లబ్ స్టేడియం దీనికి వేదిక కానుంది. ఇప్పటిదాకా చిన్న జట్ల మధ్య పోరాటాన్ని చూసి ఎంజాయ్ చేసిన ఆడియెన్స్.. ఇప్పుడు ఫేవరెట్ భారత జట్టు ప్రదర్శనను చూసేందుకు సిద్దంగా ఉన్నారు. ప్రాక్టీస్ మ్యాచ్​లో బంగ్లాదేశ్​ను టీమిండియా చిత్తు చేసింది. ఇదే పెర్ఫార్మెన్స్​ను ఐర్లాండ్​ మీద కూడా రిపీట్ చేయాలని చూస్తోంది. తద్వారా దాయాది పాకిస్థాన్​తో పోరుకు మరింత కాన్ఫిడెన్స్​తో వెళ్లొచ్చనేది రోహిత్ ప్లాన్. అటు ఐర్లాండ్ కూడా ఈ మ్యాచ్​ కోసం అంతే ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

ఫేవరెట్ టీమిండియాకు షాక్ ఇవ్వాలని ఐర్లాండ్ భావిస్తోంది. ఆ టీమ్ బ్యాటింగ్ విభాగం బాగుండటంతో ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్​గా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ ఒక్క ఆలోచనే తనను నడిపిస్తోందని అన్నాడు. ఎప్పటికైనా దాన్ని సాధించి తీరతానని చెప్పాడు. హిట్​మ్యాన్ మాట్లాడింది వరల్డ్ కప్ గురించే. ప్రపంచ కప్​ నెగ్గాలనేది తన డ్రీమ్ అని రివీల్ చేశాడు. మెగా టోర్నీలో విజేతగా నిలవడాన్ని మించిన అతిపెద్ద విషయం ఇంకా ఏదీ లేదన్నాడు. పొట్టి ఫార్మాట్​లో ఇప్పటివరకు జరిగిన అన్ని వరల్డ్ కప్స్​లోనూ ఆడుతూ వచ్చానని గుర్తుచేశాడు రోహిత్. ఇన్ని టోర్నీలు జరిగినా ఏదీ మారలేదన్నాడు. కప్​ను ఒడిసిపట్టాలనే కసి, పట్టుదల అలాగే ఉన్నాయని స్పష్టం చేశాడు. ఛాంపియన్​గా నిలవాలనే ఆలోచన తనను ముందుకు నడిపిస్తోందన్నాడు.

టీమిండియాకు కొత్త కోచ్ రానుండటంపై కూడా హిట్​మ్యాన్ రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుత కోచ్ రాహుల్​ ద్రవిడ్​తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నాడు. తన కెరీర్​లో ఫస్ట్ కెప్టెన్ అతడేనని చెప్పాడు. రాహుల్ భాయ్ దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని.. ఎప్పటికీ అతడే తన రోల్ మోడల్ అని వ్యాఖ్యానించాడు. తన ఒక్కడికే కాదు.. జట్టు సభ్యులందరికీ ద్రవిడే ఆదర్శమని తెలిపాడు. కోచ్​గా మరికొన్నాళ్లు కంటిన్యూ అవ్వాల్సిందిగా బతిమిలాడానని.. కానీ దాన్ని అతడు తిరస్కరించాడని పేర్కొన్నాడు. అయితే ఇన్నాళ్లూ ద్రవిడ్ కోచింగ్​లో ఆడటం అద్భుతమైన ఫీలింగ్​ను ఇస్తోందన్నాడు. అతడి నేతృత్వంలో ఐసీసీ కప్పులు మిస్సైనా.. మిగిలిన అన్ని మేజర్ టోర్నమెంట్స్​, సిరీస్​ల్లోనూ టీమిండియా విజేతగా నిలిచిందని రోహిత్ గుర్తుచేశాడు. మరి.. వరల్డ్ కప్ గెలవాలనే కోరికను భారత సారథి ఈసారి నెరవేర్చుకుంటాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి