iDreamPost
android-app
ios-app

IND vs IRE: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ!  ఇదే కాదు, ఇంకెన్నో..

  • Published Jun 06, 2024 | 2:46 PM Updated Updated Jun 06, 2024 | 2:46 PM

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. అందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. అందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

IND vs IRE: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ!  ఇదే కాదు, ఇంకెన్నో..

టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియాకు అద్భుతమైన ఆరంభం దక్కింది. బుధవారం నాసావ్ కౌంటీ క్రికెట్ స్టేడియం న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్ల దాటికి 96 రన్స్ కే కుప్పకూలింది ఐర్లాండ్. అనంతరం 12.2 ఓవర్లలో టార్గెట్ ను ఛేదించింది రోహిత్ సేన. ఇక ఈ మ్యాచ్ లో సూపర్ ఫిఫ్టీతో అదరగొట్టాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ రికార్డ్ ను బద్దలు కొట్టాడు హిట్ మ్యాన్. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. ఘనమైన బోణి కొట్టింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. భారత బౌలర్ల దాటికి 16 ఓవర్లలో 96 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. హార్దిక్ పాండ్యా 3, బుమ్రా, అర్షదీప్ సింగ్ తలా రెండు వికెట్లతో రాణించారు. అనంతరం 97 పరుగుల స్వల్ప టార్గెట్ ను 12.2 ఓవర్లలో ఛేదించింది టీమిండియా. కెప్టెన్ రోహిత్ శర్మ 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 52 రన్స్ చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. రిషబ్ పంత్ 36 రన్స్ తో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు.

ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యంత వేగంగా 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్ గా రోహిత్ నిలిచాడు. 2860 బంతుల్లో రోహిత్ ఈ ఘనత సాధించగా.. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 4 వేల రన్స్ ను పూర్తి చేయడానికి 2900 బంతులు తీసుకున్నాడు. ఇక ఈ జాబితాలో 3079 బంతుల్లో 4 వేల రన్స్ ను పూర్తి చేసుకుని మూడో ప్లేస్ లో ఉన్నాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్. ఈ రికార్డుతో పాటుగా పలు ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు రోహిత్ శర్మ.

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఛేజింగ్ లో ఫిఫ్టీ సాధించిన తొలి ఇండియన్ కెప్టెన్ గా రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అలాగే ఈ గెలుపుతో కెప్టెన్ గా 43వ విజయం సాధించాడు హిట్ మ్యాన్. దాంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని(43 విజయాలు)తో సమానంగా నిలిచాడు. ధోని-రోహిత్ తర్వాత విరాట్ కోహ్లీ 32 విజయాలతో మూడో ప్లేస్ లో ఉన్నాడు. ఈ రికార్డులతో పాటుగా అంతర్జాతీయ క్రికెట్ లో 600 సిక్సులు కొట్టిన తొలి ప్లేయర్ గా రోహిత్ శర్మ రికార్డుల్లోకి ఎక్కాడు. మరి ఇన్ని ఘనతలు సాధించిన రోహిత్ శర్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.