Somesekhar
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి సహనాన్ని కోల్పోయాడు. ఈసారి ఏకంగా బండ బూ*తులే తిట్టాడు. పాపం రోహిత్ కోపానికి బలైయ్యాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఆ వివరాల్లోకి వెళితే..
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి సహనాన్ని కోల్పోయాడు. ఈసారి ఏకంగా బండ బూ*తులే తిట్టాడు. పాపం రోహిత్ కోపానికి బలైయ్యాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 24 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో గ్రూప్ 1 నుంచి సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. ఇక మిగిలిన ప్లేస్ కోసం ఏకంగా ఆఫ్గాన్, ఆసీస్, బంగ్లాదేశ్ లు పోరాడుతున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి సహనాన్ని కోల్పోయాడు. ఈసారి ఏకంగా బండ బూ*తులే తిట్టాడు. పాపం రోహిత్ కోపానికి బలైయ్యాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు. తన సహచర ఆటగాడు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. రాయలేని పదాలతో బండ బూ*తులు తిట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే? బుమ్రా వేసిన రెండో ఓవర్లో.. నాలుగో బంతిని బౌన్సర్ గా సంధించాడు. ఆ బాల్ సరాసరి మార్ష్ శరీరంపైకి దూసుకెళ్లింది. దాంతో ఆ బంతిని డిఫెన్స్ చేసే క్రమంలో గ్లౌవ్స్ కు తాకి.. వికెట్ కీపర్ వైపు గాల్లోకి లేచింది. క్యాచ్ కోసం పరిగెత్తిన పంత్.. బాల్ ను మాత్రం అందుకోలేకపోయాడు. కనీసం డైవ్ కూడా చేయలేదు.
ఇక ఇది చూసిన కెప్టెన్ రోహిత్ కు పట్టరాని కోపం వచ్చింది. నోటికి వచ్చిన, రాయలేని అసభ్య పదజాలంతో పంత్ ను దూషించాడు. మరోవైపు బుమ్రా సైతం తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఎంత క్యాచ్ పట్టకపోతే మాత్రం.. అంత పెద్ద మాట అంటావా రోహిత్? అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే రోహిత్ ఇలా సహచర ఆటగాళ్లపై నోరు జరాడం ఇదే తొలిసారి కాదు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సైతం కుల్దీప్ పై తన ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Pavam @RishabhPant17 😂 . aina a matal endhi Puli 🙉🔥#Rishabpant #Rohitsharma #IndvsAus #Crickettwitter pic.twitter.com/XiDKMOUM2n
— JAZZ ⚓️ (@Jaswanthreddy18) June 24, 2024