iDreamPost
android-app
ios-app

హార్దిక్​ను ఎంత తొక్కితే అంత పైకి లేస్తాడు.. వాళ్లకు మాజీ క్రికెటర్ వార్నింగ్!

  • Published Jun 04, 2024 | 9:50 PMUpdated Jun 04, 2024 | 9:50 PM

టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బిగ్ ఛాలెంజ్​కు రెడీ అవుతున్నాడు. మెగా టోర్నీలో సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో పాండ్యాను గెలకొద్దని ఓ మాజీ క్రికెటర్ అన్నాడు. అతడ్ని ఎంత తొక్కితే అంత పైకి లేస్తాడని చెప్పాడు.

టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బిగ్ ఛాలెంజ్​కు రెడీ అవుతున్నాడు. మెగా టోర్నీలో సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో పాండ్యాను గెలకొద్దని ఓ మాజీ క్రికెటర్ అన్నాడు. అతడ్ని ఎంత తొక్కితే అంత పైకి లేస్తాడని చెప్పాడు.

  • Published Jun 04, 2024 | 9:50 PMUpdated Jun 04, 2024 | 9:50 PM
హార్దిక్​ను ఎంత తొక్కితే అంత పైకి లేస్తాడు.. వాళ్లకు మాజీ క్రికెటర్ వార్నింగ్!

గత కొన్నాళ్లుగా నడుస్తున్న బ్యాడ్ ఫేజ్​ను దాటాలని టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫిక్స్ అయ్యాడు. గాయం కారణంగా టీమ్​కు దూరమవడం, ఐపీఎల్​లో సరిగ్గా ఆడకపోవడంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ నుంచి తీవ్రంగా విమర్శలు రావడం, ప్రపంచ కప్ జట్టులోకి హార్దిక్​ను తీసుకోవద్దనే డిమాండ్లు రావడం కూడా తెలిసిందే. అదే తరుణంలో భార్య నటాషాతో అతడు విడాకులు తీసుకుంటున్నాడనే ఊహాగానాలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో సతమతమైన పాండ్యా వరల్డ్ కప్​ కోసం యూఎస్ చేరుకున్నాడు. బంగ్లాదేశ్​తో వార్మప్ మ్యాచ్​లో 23 బంతుల్లోనే 2 బౌండరీలు, 4 సిక్సుల సాయంతో 40 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. అలాగే బౌలింగ్​ వేసి ఒక వికెట్ కూడా తీశాడు. తన కమ్​బ్యాక్​ను ఘనంగా చాటాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ నవ్​జ్యోత్ సింగ్ సిద్ధు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

హార్దిక్​ను ఎంత కిందకు తొక్కితే అంత పైకి లేస్తాడని నవ్​జ్యోత్ సిద్ధు అన్నాడు. అతడు వజ్రం లాంటోడని.. ఎంత సానబెడితే అంత మెరుస్తాడని మెచ్చుకున్నాడు. తన మీద వస్తున్న ఎన్నో రకాల విమర్శలు, ప్రశ్నలకు బంగ్లాదేశ్​తో మ్యాచ్​తో అతడు ఆన్సర్ ఇచ్చాడని సిద్ధు తెలిపాడు. పాండ్యాను ఎంత ప్రెజర్​లో పెడితే అతడు అంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తాడని ప్రశంసల జల్లులు కురిపించాడు. అతడితో పెట్టుకోవద్దంటూ విమర్శకులకు వార్నింగ్ ఇచ్చాడు. ఐర్లాండ్​తో ఫస్ట్ మ్యాచ్​ గురించి కూడా సిద్ధు కామెంట్స్ చేశాడు. ఒకవేళ ఈ మ్యాచ్​లో యశస్వి జైస్వాల్​ను గనుక ఆడించాలని అనుకుంటే వార్మప్ మ్యాచ్​లో అతడ్ని బరిలోకి దించాల్సిందని పేర్కొన్నాడు. జైస్వాల్​ను ఆడించలేదు కాబట్టి ఐర్లాండ్​తో మ్యాచ్​లో రోహిత్-కోహ్లీ ఓపెన్ చేయడం పక్కాగా కనిపిస్తోందన్నాడు.

రోహిత్-విరాట్ కలసి ఓపెన్ చేస్తే టీమ్​కు మంచిదన్నాడు నవ్​జ్యోత్ సిద్ధు. వీళ్లు ఇన్నింగ్స్​ను మొదలెడితే.. ఓపెనింగ్ చేసేందుకు ఎక్స్​ట్రా ప్లేయర్ అక్కర్లేదని.. అప్పుడు టీమ్​లో 5 మంది బౌలర్లను తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నాడు. ఐదుగురు ప్రధాన బౌలర్లకు తోడుగా హార్దిక్ ఆరో బౌలర్​గా ఉంటాడని.. అప్పుడు బౌలింగ్ దళం మరింత బలోపేతం అవుతుందన్నాడు. ఇక, హార్దిక్ కీలకమైన ఛాలెంజ్​కు రెడీ అవుతున్నాడు. టీ20 వరల్డ్ కప్-2024లో తన రియల్ టాలెంట్​ ఏంటో మరోమారు అందరికీ చూపించాలని భావిస్తున్నాడు. సూపర్బ్ పెర్ఫార్మెన్స్​తో తన విలువ ఏంటో చాటాలని చూస్తున్నాడు. మెగా టోర్నీలో భారత్​ను విజేతగా నిలబెట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కొన్నాళ్లుగా తన మీద వస్తున్న విమర్శలు, ట్రోలింగ్​కు ప్రపంచ కప్​ పెర్ఫార్మెన్స్​తో గట్టిగా సమాధానం ఇవ్వాలని చూస్తున్నాడు. మరి.. మెగా టోర్నీలో హార్దిక్ ఎంత వరకు సక్సెస్ అవుతాడని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి