iDreamPost
android-app
ios-app

రోహిత్, కోహ్లీ కాదు.. వరల్డ్ కప్​లో అతడే గెలిపించాలి! లేకపోతే తీసుకొని వేస్ట్: గంభీర్

  • Published May 17, 2024 | 5:04 PM Updated Updated May 28, 2024 | 1:31 PM

భారత టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్​పై లెజెండ్ గౌతం గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రపంచ కప్​లో టీమిండియాను గెలిపించే రెస్పాన్సిబిలిటీని అతడే తీసుకోవాలన్నాడు.

భారత టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్​పై లెజెండ్ గౌతం గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రపంచ కప్​లో టీమిండియాను గెలిపించే రెస్పాన్సిబిలిటీని అతడే తీసుకోవాలన్నాడు.

  • Published May 17, 2024 | 5:04 PMUpdated May 28, 2024 | 1:31 PM
రోహిత్, కోహ్లీ కాదు.. వరల్డ్ కప్​లో అతడే గెలిపించాలి! లేకపోతే తీసుకొని వేస్ట్: గంభీర్

టీ20 వరల్డ్ కప్-2024కు టీమిండియా రెడీ అవుతోంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు మరికొన్ని రోజుల్లో భారత జట్టు నుంచి ఒక బృందం వెళ్తనుంది. ఐపీఎల్-2024 ఫైనల్ ముగిసిన ఇంకొందరు ఆటగాళ్లతో కలసి మరో బృందం యూఎస్​కు బయల్దేరనుంది. ఈసారి రోహిత్ సేన మీద భారీగా అంచనాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో టీమ్ అదరగొడుతుండటం, వన్డే వరల్డ్ కప్​-2023 ఫైనల్​కు వెళ్లడం, మిగిలిన సిరీస్​ల్లోనూ డామినేషన్ చూపించడంతో పొట్టి కప్పును టీమిండియా ఎగరేసుకుపోవడం ఖాయమని అంటున్నారు. టీమ్ నిండా స్టార్లు ఉన్నా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో లెజెండ్ గౌతం గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

రోహిత్, కోహ్లీ కాదు.. వరల్డ్ కప్​లో అతడే భారత జట్టును గెలిపించాలన్నాడు గంభీర్. ఒకవేళ ఆడకపోతే మాత్రం అతడ్ని టీమ్​లోకి తీసుకొని దండగ అన్నాడు. గౌతీ అన్నది మరెవర్నో కాదు.. యంగ్ బ్యాటర్ సంజూ శాంసన్​నే. టీమిండియాలో ఉంటాడా? అనే సందిగ్ధంలో ఉన్న అతడు ఇప్పుడు ఏకంగా టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్​లో చోటు దక్కించుకున్నాడు. రిషబ్ పంత్​తో పాటు సెకండ్ వికెట్ కీపర్​గా సంజూను ఎంపిక చేశారు సెలెక్టర్లు. ఐపీఎల్-2024లో ఇప్పటిదాకా ఆడిన 13 మ్యాచుల్లో 504 పరుగులతో సత్తా చాటాడు. రాజస్థాన్​ ప్లేఆఫ్స్​కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్​గా, బ్యాటర్​గా తన పాత్రను సమర్థవంతంగా పోషించాడు. అలాంటి సంజూను ఉద్దేశించి గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు పొట్టి కప్పులో సత్తా చాటాల్సిన అవసరం ఉందన్నాడు.

సంజూ వరల్డ్ కప్ టీమ్​లో చోటు దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నాడు గంభీర్. అయితే తుది జట్టులో అవకాశం వస్తే మాత్రం అతడు టీమిండియాను గెలిపించేందుకు కీలక ఇన్నింగ్స్​లు ఆడాల్సిన ఆవశ్యకత ఉందన్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్​లో కావాల్సినంత ఎక్స్​పీరియెన్స్ శాంసన్​ సాధించాడని.. అతడేమీ కొత్త ఆటగాడు కాదన్నాడు గౌతీ. ఐపీఎల్​లోనూ బెస్ట్ పెర్ఫార్మెన్స్​ ఇచ్చాడని.. అందుకే సంజూకు ప్రపంచ కప్ జట్టులో ఆడే ఛాన్స్ వచ్చిందన్నాడు. ప్లేయింగ్ ఎలెవన్​లో చోటు దక్కితే మాత్రం టీమ్​ను గెలుపు తీరాలకు చేర్చే బాధ్యత అతడే తీసుకోవాలన్నాడు గంభీర్. క్రికెట్ వరల్డ్​కు తన సత్తా ఏంటో చూపించమంటూ సంజూకు సవాల్ విసిరాడు. టాలెంట్, ఫిట్​నెస్, పవర్ హిట్టింగ్, కీపింగ్, కెప్టెన్సీ.. ఇలా అన్నింటా అతడు బలంగా ఉన్నాడని మెచ్చుకున్నాడు. మరి.. గంభీర్ అనుకుంటున్నట్లు సంజూ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడతాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.