iDreamPost
android-app
ios-app

అమెరికా పిచ్ లని తిట్టిపోస్తున్న క్రికెట్ ఫ్యాన్స్! వరల్డ్ కప్ కి ఇంత దారుణంగానా?

  • Published Jun 06, 2024 | 7:40 PM Updated Updated Jun 06, 2024 | 7:40 PM

పొట్టి ప్రపంచ కప్ తమను ఎంతో అలరిస్తుంది అనుకున్న ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. వరల్డ్ కప్ లో మ్యాచ్ లు చప్పగా సాగుతూ.. క్రికెట్ లవర్స్ కు ఎక్కడా లేని బోరింగ్ ఫీలింగ్ ను కలిగిస్తున్నాయి. అసలు తాము చూస్తున్నది టీ20లా? లేక టెస్ట్, వన్డేలా? అన్న అనుమానం కలుగుతోందని వారు వాపోతున్నారు.

పొట్టి ప్రపంచ కప్ తమను ఎంతో అలరిస్తుంది అనుకున్న ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. వరల్డ్ కప్ లో మ్యాచ్ లు చప్పగా సాగుతూ.. క్రికెట్ లవర్స్ కు ఎక్కడా లేని బోరింగ్ ఫీలింగ్ ను కలిగిస్తున్నాయి. అసలు తాము చూస్తున్నది టీ20లా? లేక టెస్ట్, వన్డేలా? అన్న అనుమానం కలుగుతోందని వారు వాపోతున్నారు.

అమెరికా పిచ్ లని తిట్టిపోస్తున్న క్రికెట్ ఫ్యాన్స్! వరల్డ్ కప్ కి ఇంత దారుణంగానా?

టీ20 వరల్డ్ కప్ 2024.. ఈ మెగాటోర్నీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. క్రికెట్ లవర్స్ ఈ మహా సమరం తమను అలరిస్తుందని ఆశ పడ్డారు. కానీ వారి ఆశలను నిరాశ చేస్తూ.. చప్పగా సాగుతూ.. అట్టర్ ప్లాప్ గా నిలుస్తోంది ఈ వరల్డ్ కప్. భారీ స్కోర్లు లేవూ.. బ్యాటర్ల మెరుపు విన్యాసాలూ లేవు. దాంతో ఇటు స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు, అటు టీవీలకు అతుక్కున్న అభిమానులు తీవ్ర అసంతృప్తికి లోనౌతున్నారు. అయితే ఈ పొట్టి సమరం ఇంతలా అట్టర్ ప్లాప్ కావడానికి కారణం అమెరికా పిచ్ లే కారణం అంటున్నారు నెటిజన్లు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టీ20 ప్రపంచ కప్ లో బుధవారం(జూన్ 5) వరకు 10 మ్యాచ్ లు జరిగాయి. కానీ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గుర్తు పెట్టుకునే విధంగా జరగలేదంటే అతిశయోక్తికాదు. ఒమన్-నమీబియా మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసి కాస్తంత థ్రిల్లింగ్ కు గురిచేసింది తప్పితే.. మరే మ్యాచ్ లు కూడా ప్రేక్షకులకు మజాను అందించలేదు. ఇప్పటి వరకు జరిగిన 10 మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ లో కూడా 200 స్కోర్ నమోదు కాలేదు అంటే.. టోర్నీ ఎంత చప్పగా సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో వరల్డ్ కప్ అట్టర్ ప్లాప్ అయ్యిందంటూ క్రికెట్ ఫ్యాన్స్ వాపోతున్నారు. కాగా.. ఈ మెగాటోర్నీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయకపోవడానికి కారణం అమెరికా పిచ్ లే కారణం అంటున్నారు క్రికెట్ లవర్స్.

అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా టీ20 వరల్డ్ కప్ 2024 జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నో దేశాలను కాదని ఐసీసీ అమెరికాలో మ్యాచ్ లను నిర్వహించడానికి పూనుకుంది. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీ యూఎస్ లో జరగడం ఇదే మెుదటిసారి. దాంతో అమెరికా సైతం స్టేడియాల నిర్వహణలో తగు జాగ్రత్తలను తీసుకుంది. కానీ పిచ్ లను తయ్యారు చేయడంలోనే ఆ దేశానికి సరైన అవగాహన లేదని ఈ టోర్నీతో స్పష్టంగా తెలిసిపోయింది. ఇతర విషయాల్లో అగ్రస్థానంలో ఉన్న అమెరికా క్రికెట్ నిర్వహణలో పూర్ అని ప్రపంచం మెుత్తానికి తెలిసిపోయింది. ఫ్లాట్ పిచ్ లను రెడీ చేయడంతో టీ20 వరల్డ్ కప్ లో జట్లు భారీ స్కోర్లు నమోదు చేయలేకపోతున్నాయి.

ఇక ఇప్పటి వరకు ఏ బ్యాటర్ కూడా ఐపీఎల్ లో ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఇక్కడ నమోదు చేయలేదు. మరోవైపు వెస్టిండీస్ పిచ్ లు కూడా ఇలాగే ఉన్నాయి. సాధారణంగా స్లో పిచ్ లుగా ముద్రపడిన విండీస్ పిచ్ లు బౌలర్లకు అనుకూలిస్తూ.. అత్యల్ప స్కోర్లు నమోదు చేస్తున్నాయి. డల్లాస్, న్యూయార్క్ వేదికలుగా జరుగుతున్న మ్యాచ్ లు టెస్ట్, వన్డే మ్యాచ్ లను తలపిస్తున్నాయి. దాంతో క్రికెట్ లవర్స్ విసిగెత్తిపోతున్నారు. మరి ఈ టీ20 వరల్డ్ కప్ ఇంత దారుణంగా అట్టర్ ప్లాప్ అవ్వడానికి అమెరికా పిచ్ లే కారణం అంటున్న క్రికెట్ ఫ్యాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IND vs PAK: పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు భారీ గుడ్ న్యూస్!