iDreamPost

కస్టమర్లపై స్విగ్గీ బాదుడు.. ఆ చార్జీలు 50 శాతం పెంపు

కస్టమర్లపై స్విగ్గీ బాదుడు.. ఆ చార్జీలు 50 శాతం పెంపు

ఆకలేస్తోంది.. ఇంట్లో నచ్చిన కూర చేయలేదు.. లేదా వంట చేయలేదో.. బిర్యానీ, ఇతర ఫుడ్ పదార్ధాలు ఆర్డర్ పెడదామని ఫోన్ తీసుకుని స్విగ్గీ యాప్ మీద చేయి వేస్తున్నారా..? అయితే ఒక్కసారి ఆగండి.. ఈ విషయం తెలిస్తే.. మీ ఆకలి ఒక్కసారి ఎగిరిపోతుంది మరీ. ఇప్పటి వరకు ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే.. డెలివరీ చార్జీలతో పాటు జీఎస్టీ, ఇతర పన్నులు అంటూ వసూలు చేస్తున్నాయి ఫుడ్ ఫ్లాట్ ఫామ్స్. తాజాగా ఫ్లాట్ ఫామ్ ఫీ అంటూ మరేటి జత చేశాయి. స్విగ్గీ కూడా ఈ ఫీను ముక్కు పిండి మరీ వసూలు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుండి దీన్ని అమలు చేస్తోంది. ఒక్కో ఆర్డర్ పై ప్రస్తుతం రూ. 2 చొప్పున తీసుకుంటుండగా.. ఇప్పుడు కస్టమర్లు షాక్‌నిచ్చింది స్విగ్గీ.

ఆర్డర్ విలువను బట్టి ఇప్పటి వరకు ఫ్లాట్ ఫామ్ ఫీ రూ. 2 వసూలు చేస్తుండగా.. ఇప్పుడు రూ. 3కి పెంచింది. మరో రూపాయి పెరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నా స్విగ్గీ ఫ్యాన్స్. స్విగ్గీ బాటలోనే నడుస్తోంది జోమాటో కూడా. ప్రాంతాలను బట్టి ప్లాట్ ఫామ్ ఫీ రూ. 3 కు పెంచింది. ఈ లెక్క ప్రకారం ఈ రెండు.. ఫ్లాట్ ఫామ్ చార్జీలు 50 శాతం పెంచేశాయి. ఇప్పటికే ఈ ఫ్లాట్ ఫాం ఫీ ఛార్జీలను బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో కస్టమర్ల నుండి వసూలు చేస్తోంది స్విగ్గీ. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. ఈ కంపెనీ ఫ్లాట్ ఫామ్ చార్జీలు ప్రతి ఆర్డర్ పై రూ. 5 వసూలు చేస్తూ.. అందులో రూ. 2 రాయితీ ఇస్తూ.. రూ. 3 కస్టమర్ల నుండి వసూలు చేస్తోంది. ఇది క్రమ క్రమంగా కస్టమర్లకు అలవాటు చేసి.. ఎప్పుడో రాయితీని ఎత్తేసి.. రూ. 5 చేసేందుకు కంపెనీ ప్రణాళికలు రచిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే లాయల్లీ సబ్ స్రైబర్లకు ఇన్నాళ్లు ఈ చార్జీలు మాఫీ చేయగా.. వారికి సైతం చార్జీలు అమలు చేస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి