iDreamPost

Swiggy: రంజాన్ నెలలో హైదరాబాదీల బిర్యానీ ఆర్డర్లు.. ఏకంగా అన్ని లక్షల బిర్యానీలు తినేశారా?

  • Published Apr 11, 2024 | 6:04 PMUpdated Apr 11, 2024 | 6:04 PM

బిర్యానీ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. అందులోను హైదరాబాదీ బిర్యానీ అంటే అందరికి చెప్పలేనంత మక్కువ.. పైగా ఇప్పుడు రంజాన్ మాసం కూడా.. మరి రంజాన్ నెలలో హైదరాబాదీలు ఆర్డర్ చేసిన బిర్యానీల కౌంట్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

బిర్యానీ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. అందులోను హైదరాబాదీ బిర్యానీ అంటే అందరికి చెప్పలేనంత మక్కువ.. పైగా ఇప్పుడు రంజాన్ మాసం కూడా.. మరి రంజాన్ నెలలో హైదరాబాదీలు ఆర్డర్ చేసిన బిర్యానీల కౌంట్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

  • Published Apr 11, 2024 | 6:04 PMUpdated Apr 11, 2024 | 6:04 PM
Swiggy: రంజాన్ నెలలో హైదరాబాదీల బిర్యానీ ఆర్డర్లు.. ఏకంగా అన్ని లక్షల బిర్యానీలు తినేశారా?

బిర్యానీ తినడం కాదు పేరు వింటేనే అందరికి నోటిలో నీళ్లు ఊరిపోతుంటాయి. సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ రీల్స్ బిర్యానీని ఎప్పుడు చూసిన తినేయాలనిపిస్తుంది. బిర్యానీ ఈజ్ యాన్ ఎమోషన్ అంటూ పోస్ట్స్ కూడా చేస్తుంటారు బిర్యానీ ప్రియులు. పైగా బిర్యానీలో ఎన్నో రకాలు ఉంటాయి. ఇక దేశంలో అన్ని చోట్ల బిర్యానీలు దొరుకుతున్నా కూడా.. హైదరాబాద్ బిర్యానీకి మాత్రం స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఈ హైదరాబాద్ బిర్యానీకి తెలుగు వారు మాత్రమే కాదు దెస విదేశాల వారంతా కూడా ఫిదా అయిపోతారు. ఇక హైదరాబాద్ వారికైతే బిర్యానీ లేనిదే రోజు గడవదు అని చెప్పి తీరాలి. పొద్దున్న నుంచి రాత్రి వరకు బిర్యానీ పెట్టినా .. ఇష్టంగా తినేసే వారున్నారు. పైగా ఇప్పుడు రంజాన్ మాసం కూడా.. మరి ఈ నెలలో హైదరాబాదీలు ఆర్డర్ చేసిన బిర్యానీల కౌంట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

మాములుగా అన్ని రోజులలో దొరుకుతుంది. కానీ, రంజాన్ మాసంలో దొరికే బిర్యానీ అంటే మాత్రం అందరికి ఇంకాస్తా ప్రత్యేకత. ఒకప్పుడు రెస్టారెంట్స్ కు వెళ్లి తినేవారు. ఇప్పుడు ఆన్ లైన్ ఆర్డర్ సర్వీస్ లు వచ్చేసాయి కాబట్టి.. బిర్యానీ క్రేవింగ్స్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తున్నాయి. దీనితో ఏ టైం అయినా కానీ ఆర్డర్ చేసేస్తున్నారు.. బిర్యానీ లాగించేస్తున్నారు. ఇక ఇప్పుడు రంజాన్ మాసం కాబట్టి గత నెల రోజుల నుంచి .. స్విగ్గి లో ఆర్డర్ల మీద ఆర్డర్లు వచేశాయట. బిర్యానీతో పాటు అటు హలీం ఆర్డర్స్ లోను హైదరాబాద్ వాసులు రికార్డు సృష్టించారట. కేవలం నెల రోజుల వ్యవధిలో 5.3 లక్షల ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గి సంస్థ తెలిపింది. ఈరోజుతో రంజాన్ నెల ముగిసింది. దీనితో ఫుడ్ డెలివరీ ఆర్డర్స్ వివరాలను స్విగ్గి ప్రకటించింది.

ఇక ఈ నెల రోజుల వ్యవధిలో 60 లక్షల ప్లేట్ల బిర్యాని ఆర్డర్స్ డెలివరీ చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. మిగతా నెలలతో పోలిస్తే ఈ నెలలోనే 15 శాతం ఆర్డర్లు పెరిగినట్లు సమాచారం. ప్రతి రోజు సాయంత్రం 5.30 నుంచి 7 గంటల మధ్య ఇఫ్తార్ 34% పెరిగినట్లు స్విగ్గి పేర్కొంది. వీటిలో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ , హలీం , ఫలూదా , ఖీర్ ఇవన్నీ టాప్ ప్లేస్ లో ఉన్నాయట. దీనితో బిర్యానీ విషయంలో హైదరాబాద్ వాసులకు ఎవరు పోటీ రాలేరని మరోసారి నిర్దారణ అయింది. ఇక సోషల్ మీడియాలో ఈ వార్త చూసిన నెటిజన్లు.. హైదరాబాద్ వాళ్ళకి ఇదంతా మామూలు విషయం.. అంటూ బిర్యానీ అంటే హైదరాబాద్ .. హైదరాబాద్ అంటే బిర్యానీ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి, హైదరాబాద్ బిర్యానిపై మీ కామెంట్స్ ను కూడా చెప్పేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి