iDreamPost

సైలెంట్‌గా కస్టమర్లకు షాక్ ఇచ్చిన Swiggy..! ప్రతి ఆర్డర్‌పై..

వంట చేసుకునే పరిస్థితులు లేకపోయినా.. లేదా ఏదైనా ఇష్టంగా తినాలనుకున్నప్పుడు గుర్తుకు వచ్చేది ఫోన్. అందులో ఉన్న యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసేస్తుంటారు. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ లో ఆర్డర్ చేసేస్తుంటారు. ఇదే అదునుగా ఈ సంస్థలు..

వంట చేసుకునే పరిస్థితులు లేకపోయినా.. లేదా ఏదైనా ఇష్టంగా తినాలనుకున్నప్పుడు గుర్తుకు వచ్చేది ఫోన్. అందులో ఉన్న యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసేస్తుంటారు. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ లో ఆర్డర్ చేసేస్తుంటారు. ఇదే అదునుగా ఈ సంస్థలు..

సైలెంట్‌గా కస్టమర్లకు షాక్ ఇచ్చిన Swiggy..! ప్రతి ఆర్డర్‌పై..

ఆఫీసుకు క్యారేజ్ తెచ్చుకోలేదు.. లేదా ఇంట్లో వంట చేసుకోలేదు. కానీ ఆకలేస్తోంది. బయటకు వెళ్లే ఓపిక కానీ ఇంటస్ట్ర్ లేదు. వెంటనే గుర్తు వచ్చేది ఫుడ్ డెలివరీ యాప్స్. టకా టకా ఫోన్ తీసుకుని చకా చకా ఆర్డర్స్ పెట్టేస్తుంటారు. బిర్యానీ లేదా పిజ్జా, ఐస్ క్రీమ్ ఏదైనా సరే తినాలపిస్తే చాలు ఆర్డర్ పెట్టేస్తుంటారు. ఆర్డర్ చేసిన కొన్ని నిమిషాలకే చేతుల్లోకి ప్రత్యక్షమౌతుంటాయి మన ఫుడ్స్. అయితే ప్రతి ఒక్కరికి తెలిసిన ఫుడ్ యాప్స్ అనగానే స్విగ్గీ లేదా జోమాటో. ఈ రెండింటినే ఎక్కువగా వినియోగిస్తుంటారు కస్టమర్స్. కానీ కొన్ని సార్లు స్విగ్గీ, జొమాటో ఉద్యోగులు చేసే పనులకు వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా ఓ కంపెనీ కస్టమర్లకు సైలెంట్ షాక్ ఇచ్చింది.

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకుంటున్న వినియోగదారుల నుండి ఇప్పటికే ఫ్లాట్ ఫామ్ ఛార్జీల రూపంలో కొంత వసూలు చేస్తుండగా.. వాటిని త్వరలో పెంచనుంది. ఈ మేరకు కొన్ని వార్తలు వస్తున్నాయి. స్విగ్గీ గత ఏడాది ఏప్రిల్ నుండి ఆర్డర్‌ను బట్టి ఇప్పటి వరకు ప్లాట్ ఫామ్ ఫీజులు కింద రూ. 3 వసూలు చేస్తోంది. ఇప్పుడు వాటిని పది రూపాయలకు పెంచేందుకు సిద్దమైందట స్విగ్గీ. అందుకు అనుగుణంగానే ఆర్డర్ చేసిన తర్వాత బిల్లులో వీటిని చూపించనుంది. పెరిగిపోతున్న డెలివరీల దృష్ట్యా, మరింత ఆదాయాన్ని పెంచుకునేందుకు స్విగ్గీ ఈ చర్యలు చేపట్టనుందని తెలుస్తోంది. ఒకేసారి ఇంత పెంచితే వ్యతిరేకత వచ్చే అవకాశంతో పాటు ఆర్డర్స్ తగ్గే ఛాన్స్ కూడా ఉండటంతో ఓ మాస్టర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అయితే తొలుత డిస్కౌంట్ ఇస్తున్నామంటూ ఫ్లాట్ ఫాం ఛార్జీలను రూ. 5 మాత్రమే వసూలు చేయనుందట. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆర్డర్‌ కు 9 రూపాయలు వసూలు చేస్తుందని టాక్. జనవరి 1 నుండి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. వీటిని అక్కడక్కడ అప్లై చేసి.. దాన్ని బట్టి.. దేశ వ్యాప్తంగా వినియోగదారులపై ప్రయోగించనుంది. ఫ్లాట్ ఫామ్ ధరల పెంపుపై స్విగ్గీ సంస్థ ప్రతినిథి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఫ్లాట్ ఫామ్ ఫీజుల్నిపెంచే ఉద్దేశం లేదన్నారు. కస్టమర్లను అర్థం చేసుకునేందుకు కొన్ని ప్రయోగాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ లెక్కన ప్రయోగాలు సక్సెస్ అయితే ఛార్జీలను పెంచనుందేమో..ఏమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి