iDreamPost

కస్టమర్లకు Swiggy బంపరాఫర్.. ఫ్రీ డెలివరీతో పాటు ఆర్డర్లపై 60 శాతం డిస్కౌంట్!

ఆహార ప్రియులకు ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ బంపరాఫర్ ప్రకటించింది. ఆర్డర్లను ఫ్రీగా డెలివరీ చేయడంతో పాటు 60 శాతం డిస్కౌంట్ సౌకర్యాన్ని కల్పించేలా ఓ ప్లాన్ ను ప్రవేశపెట్టింది.

ఆహార ప్రియులకు ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ బంపరాఫర్ ప్రకటించింది. ఆర్డర్లను ఫ్రీగా డెలివరీ చేయడంతో పాటు 60 శాతం డిస్కౌంట్ సౌకర్యాన్ని కల్పించేలా ఓ ప్లాన్ ను ప్రవేశపెట్టింది.

కస్టమర్లకు Swiggy బంపరాఫర్.. ఫ్రీ డెలివరీతో పాటు ఆర్డర్లపై 60 శాతం డిస్కౌంట్!

ఇటివల కాలంలో ప్రతిఒక్కరికి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ల వినియోగం అనేది కామన్ అయిపోయింది. ప్రస్తుతం అందరు బిజీ లైఫ్ ని గడపడంతో.. మనకి నచ్చిన ఆహారాన్ని వండుకొని తినాలనే చింత లేదు. మనకు నచ్చిన ఫుడ్ ని మంచి రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెడితే నిమిషాల్లో మన ఎదురుగా ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో చాలమంది భోజన ప్రియులు ఉండటంతో ఈ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ గిరాకి ఎక్కువగా పెరిగింది. ఈ క్రమంలోనే ఫుడ్ డెలివరీ చేసే యాప్ ల సంస్థలు కస్టమర్లకు ఆకర్షించే విధంగా రకరకాల ఆఫర్లు పెడుతున్నారు. కాగా, ఇప్పటికే బిర్యానీ ఆర్డర్లలో హైదరాబాద్ టాప్‌ ప్లేస్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు స్విగ్గీ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్ వంటి నగరాల్లోనే ఉన్న పాకెట్ హీరో ప్లాన్ ను ఇక నుంచి హైదరాబాద్ కస్టమర్లకు వర్తింపజేసేలా.. ప్రముఖ డెలివరి యాప్ స్విగ్గీ నిర్ణయం తీసుకుంది. ఈ ఆఫర్ ద్వారా స్విగ్గీలో ఆర్డర్ చేసుకునే కస్టమర్లకు డెలివరీ ఛార్జీలు ఉండవు. అంతేకాదండోయ్ అర్డర్ పెట్టిన ప్రతి ఫుడ్ ఐటం పై 60 శాతం వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. దీంతో ఆహార ప్రియులు తమకు నచ్చిన ఫుడ్ ని ఆర్డర్ చేసి తృప్తిగా ఆరగిస్తారు. కానీ, మధ్య తరగతి కుటుంబాలకు ఇంట్లో నుంచి రెస్టారెంట్ రుచులు ఆస్వాదించడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే రెస్టారెంట్ చార్జెస్, డెలివరి యాప్ ఫీజుల వలన ఫుడ్ డెలివరీ చేసుకునేందుకు భయపడుతున్నారు. అయితే మధ్యతరగతి ప్రజలను, స్టూడెంట్స్ ని పరిగణలోకి తీసుకొనే ఈ ప్లాన్ అమలు చేసినట్లు స్విగ్గీ పెర్కొంది.

good news for swiggy coustomers

చాలమంది బ్యాచ్‌లర్స్, ఆఫీసు ఉద్యోగులు ఆకలేసినప్పుడు చక్కగా ఇంటి నుంచి ఆఫీస్ వరకు ఎక్కడైనా, ఎప్పుడైనా నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొవచ్చు. నిమిషాల వ్యవధిలో మనం కొరుకున్న ఫుడ్ మన కళ్లముందు ఉంటుంది. అంతేకాకుండా ఎవరికైనా ట్రీట్ ఇవ్వాలనుకున్నా.. ఇదివరకులా హోటళ్లకు రెస్టారెంట్స్ కి వెళ్లిసిన అవసరం లేదు. ఏం కావాలన్నా అతి తక్కువ బడ్జెట్ తో మొబైల్ యూప్ లో ఆర్డర్ పెడితే చాలు. చక్కగా వేడి వేడి ఫుడ్ ని లాగించవచ్చు. కాగా, అతి త్వరలోనే ఈ ప్లాన్ ను హైదరాబాద్‌తో పాటు బెంగ‌ళూర్‌, ముంబయి, పూణే, చెన్నై, కోల్‌క‌తా వంటి న‌గ‌రాల‌కు విస్తరించాలని స్విగ్గీ నిర్ణయించింది. ఈ ఆఫర్ కనుక అమల్లోకి వస్తే మాత్రం.. ఇక స్టూడెంట్‌, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కూడా నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ చేసుకుంటారు. ఇక డెలివరీ ఛార్జీలు, అధిక ధరలకు భయపడే అవసరం లేదు. మరి, స్విగ్గీ ప్రకటించిన బంఫర్ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి