iDreamPost
android-app
ios-app

చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించి..స్వామీజీ విచిత్రమైన డిమాండ్!

చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించి..స్వామీజీ విచిత్రమైన డిమాండ్!

ప్రస్తుతం ఎక్కడ చూసిన చంద్రయాన్-3 గురించే చర్చ. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం విజయంతో భారత దేశ కీర్తి.. ప్రపంచ స్థాయిలో మరో మెట్టుకు పైకెక్కింది. చంద్రయాన్-3 విజయంతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3.. జాబిల్లి ఉపరితలంపై విజయవంతంగా దిగడంతో భారత్‌పై ప్రపంచం మొత్తం ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఓ స్వామీజీ  సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రమండలాన్ని హిందు దేశంగా గుర్తించి.. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. ఆ స్వామీజి చేసిన ఈ విచిత్ర డిమాండ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో పలు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన తాజాగా ప్రభుత్వాన్నికి ఓ విచిత్ర డిమాండ్ చేశారు. చంద్రుడిని హిందూ దేశంగా ప్రకటించాలని, అలానే చంద్రయాన్ దిగిన ప్రదేశం శివశక్తి పాయింట్ ను రాజధానికి ప్రకటించాలంటూ కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఇతర దేశాలు చంద్రుడిపై తమ హక్కును చాటుకునే లోపే దానిని హిందు దేశంగా ప్రకటిస్తూ పార్లమెంటులో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు స్వామీ చక్రపాణి ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.

జాబిల్లిని హిందూ దేశంగా ప్రకటించిన తరువాత ఆ ప్రదేశాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని కూడా పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా జిహాదీ మనస్తత్వం ఉన్న ఏ ఉగ్రవాది అక్కడికి చేరుకోలేడని ఆయన పేర్కొన్నారు. చక్రపాణి మహారాజ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. గతంలో 2020లో కరోనా మొదటి వేవ్ విజృభిస్తున్న సమయంలో ఢిల్లీలో ‘గోమూత్ర పార్టీ’ నిర్వహించి ఆయన సంచలనం సృష్టించారు. కరోనాను తరిమికొట్టడానికి గో మూత్రం తాగాలంటూ హిందూ మహాసభ సభ్యులు ప్రచారం చేశారు.

2018 నాటి కేరళ వరదలపై కూడా ఆయన వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. కేరళలో బీఫ్ తినే వారికి ఎలాంటి సహాయం అందకూడదని మత విద్వేషాలను కలిగే ప్రకటన చేశారు. 2023ఆరంభంలో హిందూ మతాన్ని అవమానించేలా ఉన్న బాలీవుడ్ సినిమాలు, వెబ్‌సిరీస్, మ్యూజిక్ వీడియోలు మొదలైనవాటిలో కంటెంట్‌ను పర్యవేక్షించడానికి ‘ధర్మ సెన్సార్ బోర్డు’ని ఏర్పాటు చేశారు. తాజాగా చంద్రుడి విషయంలో వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. మరి.. ఈయన చేసిన డిమాండ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్రా మర్చిపోలేని గిఫ్ట్!