iDreamPost

Hyderabad: పోలీసుల అదుపులో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ మాజీ DSP ప్రణీత్‌ రావు?

  • Published Mar 13, 2024 | 10:45 AMUpdated Mar 13, 2024 | 10:56 AM

తెలంగాణాలో ప్రతిపక్ష నేతల డేటా బేస్ ధ్వంసం కేసు.. కీలక మలుపు తీసుకుంది. ఈ నేపథ్యంలో స్పెషల్ ఇంటిలెజెన్స్ బ్రాంచ్ మాజీ డిఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావును.. హైదరాబాద్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణాలో ప్రతిపక్ష నేతల డేటా బేస్ ధ్వంసం కేసు.. కీలక మలుపు తీసుకుంది. ఈ నేపథ్యంలో స్పెషల్ ఇంటిలెజెన్స్ బ్రాంచ్ మాజీ డిఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావును.. హైదరాబాద్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 13, 2024 | 10:45 AMUpdated Mar 13, 2024 | 10:56 AM
Hyderabad: పోలీసుల అదుపులో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ మాజీ DSP ప్రణీత్‌ రావు?

ఎస్ ఐబిలో కీలక సమాచారాన్ని ధ్వసం చేసిన ఘటనలో.. ప్రధాన నిందితుడైన మాజీ డిఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావును.. మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఎస్ఐబీ లాగర్ రూమ్ లో హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేసిన తర్వాత నుంచి.. ప్రణీత్ రావు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత.. గత నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లా.. డిసిఆర్ బీలో ఆయన రిపోర్ట్ చేశారు. కాగా, అక్కడ జాయిన్ అయిన రెండు రోజులకే సిక్ లీవ్ పెట్టారు. ఆ తర్వాత సస్పెన్షన్ కు వారం ముందు నుంచి కూడా ఆయన డిసిఆర్ బీకి వెళ్లలేదని సమాచారం. దీనితో ఆయన తప్పించుకున్నట్లు పోలీసులు నిర్దారించారు. ఈ క్రమంలోనే ప్రణీత్ రావు ఇంటి వద్ద నిఘా పెట్టారు పోలీసులు.

ఇక మంగళవారం రాత్రి ప్రణీత్ రావు తన ఇంటికి రావడం గుర్తించిన పోలీసులు.. ఆయనను అరెస్ట్ చేశారు. ఇక పోలీసులు సమాచారం ప్రకారం రాత్రికి రాత్రే ప్రణీత్ రావును.. హైదరాబాద్ కు తరలించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ ను కూడా సీజ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత.. అతనిని బుధవారం ఉదయం నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసుపై మరిన్ని విషయాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. ప్రణీత్ రావుతో పాటు.. అతనికి సహకరించిన మరికొంతమంది అధికారులపై కూడా విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఇటీవల ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని ధ్వసం చేశారనే.. ఆరోపణలపై .. ఎస్ ఐబి అడిషనల్ కమిషనర్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పంజాగుట్ట పోలీసులు.. ప్రణీత్ రావుపై కేసు నమోదు చేశారు. అయితే, దానికి ముందు నుంచి కూడా ఆయనను పోలీసుల అదుపులోనే సీక్రెట్ ప్లేస్ లో ఉంచి.. విచారణ కొనసాగిస్తున్నారనే వార్తలు కూడా వినిపించాయి. మరో వైపు ప్రణీత్ రావు తప్పించుకున్నారని కూడా డిస్కషన్స్ నడిచాయి. ఇక ఎట్టకేలకు రెండు రోజులుగా.. పంజాగుట్ట పోలీసులు సిరిసిల్లలో.. అతని ఇంటి వద్ద నిఘా చేపట్టారు.. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి ప్రణీత్ రావును అరెస్ట్ చేసి.. హైదరాబాద్ కు తరలించారు. ఈ కేసు విషయంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి