iDreamPost
android-app
ios-app

Suryakumar Yadav: కెప్టెన్‌గా తొలి సిరీస్‌ విక్టరీ.. ధోనిని ఫాలో అయిన సూర్యకుమార్‌!

  • Published Dec 04, 2023 | 11:18 AM Updated Updated Dec 04, 2023 | 11:18 AM

ఆస్ట్రేలియా చేతిలో వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఓటమి తర్వాత.. వెంటనే అదే ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్‌ ఆడిన టీమిండియా.. 4-1 తేడాతో గెలిచింది. అయితే.. ఈ సిరీస్‌ విజయంతో కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌.. మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని ఫాలో అయ్యాడు.

ఆస్ట్రేలియా చేతిలో వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఓటమి తర్వాత.. వెంటనే అదే ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్‌ ఆడిన టీమిండియా.. 4-1 తేడాతో గెలిచింది. అయితే.. ఈ సిరీస్‌ విజయంతో కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌.. మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని ఫాలో అయ్యాడు.

  • Published Dec 04, 2023 | 11:18 AMUpdated Dec 04, 2023 | 11:18 AM
Suryakumar Yadav: కెప్టెన్‌గా తొలి సిరీస్‌ విక్టరీ.. ధోనిని ఫాలో అయిన సూర్యకుమార్‌!

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్లో ఓటమి తర్వాత.. తీవ్ర నిరాశలో కూరుకుపోయిన భారత క్రికెట్‌ అభిమానులకు కాస్త ఊరటనిస్తూ.. యంగ్‌ టీమిండియా ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయాన్ని సాధించింది. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలోని యువ భారత జట్టు.. 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌.. చివరి బంతి వరకు ఎంత ఉత్కంఠగా సాగింది. టీమిండియా బౌలర్‌ అర్షదీప్‌ సింగ్‌ చివరి ఓవర్‌ ఎంతో అద్భుతంగా వేయడంతో.. భారత్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది.

ఇక విజయంతో కెప్టెన్‌గా తొలి సిరీస్‌ విజయాన్ని అందుకున్న తాతాల్కిక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని ఫాలో అయిపోయాడు. సిరీస్‌ విజయం తర్వాత.. ట్రోఫీని అందుకున్న సూర్య.. ఆ ట్రోఫీని తీసుకొచ్చి.. యువ క్రికెటర్లు అయిన రింకూ సింగ్‌, జితేష్‌ శర్మ చేతుల్లో పెట్టేసి.. వెళ్లి చివర్లో నిల్చున్నాడు. యువ క్రికెటర్లకు ఉత్సాహం ఇచ్చేలా.. ట్రోఫీని అందుకుని వారి చేతుల్లో పెట్టే ఆనవాయితీని ధోని మొదలుపెట్టాడు. అనేక సందర్భాల్లో ధోని అలానే చేశారు. టీమిండియా ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు(2007 టీ20 వరల్డ్‌ కప్‌, 2011 వన్డే వరల్డ్‌ కప్‌, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ) అందించిన కెప్టెన్‌గా నిలిచిన ధోని.. ఇండియన్‌ క్రికెట్‌పై తన దైన ముద్ర వేశాడు.

2007లో టీమిండియా మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచింది. ఆ సమయంలో కప్పు అందుకున్న ధోని.. తీసుకొచ్చి యువ క్రికెటర్ల చేతుల్లో పెట్టాడు. అప్పటి నుంచి అదే సాంప్రదాయాన్ని మిగతా కెప్టెన్లు కూడా కొనసాగిస్తున్నారు. ధోని తర్వాత.. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, హార్ధిక్‌ పాండ్యా సైతం అలానే చేశారు. ఇప్పుడు సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం అదే సాంప్రదాయాన్ని కొనసాగించడంతో సూర్యపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరి ధోని లాంటి దిగ్గజ కెప్టెన్‌ అడుగుజాడల్లోనే సూర్య లాంటి క్రికెటర్‌ నడవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.