iDreamPost

సూర్య నట విశ్వరూపమే! గుస్బమ్స్ తెప్పిస్తున్న ‘కంగువా’ గ్లింప్స్‌

  • Published Jul 23, 2023 | 12:09 PMUpdated Jul 23, 2023 | 1:00 PM
  • Published Jul 23, 2023 | 12:09 PMUpdated Jul 23, 2023 | 1:00 PM
సూర్య నట విశ్వరూపమే! గుస్బమ్స్ తెప్పిస్తున్న ‘కంగువా’ గ్లింప్స్‌

తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన తమిళ స్టార్‌ హీరో సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘కంగువా’ సినిమా గ్లింసప్‌ను మూవీ యూనిట​్‌ విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌ ఆకట్టుకునేలా ఉంది. దేవీశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో పాటే సూర్య నట విశ్వరూపం ఈ సినిమాకు ప్రధాన బలంగా ఉండనుందని తాజాగా విడుదల చేసిన గ్లింప్స్‌ చూస్తే తెలుస్తోంది.

చాలా రోజులుగా ఈ సినిమా కోసం కష్టపడుతున్న​ డీఎస్‌పీ ప్రాణం పెట్టి సంగీతం, బీజీఎం అందిస్తున్నట్లు ఉంది. గ్లింప్స్‌లో ఆయన పనితనం కనిపిస్తోంది. ఈ సినిమాను స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆదివారం సూర్య బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. సూర్య తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని పాత్ర చేయబోతున్నాడు. మరి ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.

ఇక ఈ సినిమా టైటిల్‌ సైతం ఎంతో ఆసక్తికరంగా ఉంది. కంగువా అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు అనే అర్థాలు ఉన్నాయి. ఈ సినిమాను త్రీడీలో రూపొందిస్తున్నారు. అలాగే మొత్తం పది భాషల్లో విడుదల చేయనున్నారు. పొరాట ఘట్టాలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రధాన ఆకర్షణగగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో కంగువా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి కంగువా గ్లింప్స్‌ మీకెలా అనిపించిందో అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బిగ్​బాస్​తో అందర్నీ పిచ్చోళ్లను చేస్తున్నారు.. షోలో డబ్బులిచ్చి హౌస్​లోకి..: సరయు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి