iDreamPost

Guntur Kaaram: గుంటూరుకారంలో సూపర్ స్టార్ కృష్ణ.. ఇది కదా ఫ్యాన్స్ కి ఫీస్ట్!

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు, దర్శక, నిర్మాతలు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ కొద్దిమందికే స్టార్ డమ్ దక్కింది.. అలాంటి వారిలో మహేష్ బాబు ఒకరు.

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు, దర్శక, నిర్మాతలు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ కొద్దిమందికే స్టార్ డమ్ దక్కింది.. అలాంటి వారిలో మహేష్ బాబు ఒకరు.

Guntur Kaaram: గుంటూరుకారంలో సూపర్ స్టార్ కృష్ణ.. ఇది కదా ఫ్యాన్స్ కి ఫీస్ట్!

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కొద్దిమందే సక్సెస్ ఫుల్ హీరోలుగా నిలబడ్డారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు. ఒకరు.  బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. కొంత కాలం గ్యాప్ తీసుకొని రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రిలీజ్ అయిన మూవీస్ పెద్దగా హిట్ సాధించకున్నా.. మురారితో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు. ఆ తర్వాత మహేష్ బాబు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఎప్పుడూ ముఖంపై చిరునవ్వులు చిందిస్తూ అందరి మనసు దోచేస్తాడు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా.. ‘నీడ’ చిత్రంతో బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా తన తండ్రి కృష్ణతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. చదువు పూర్తి చేసుకొని ‘రాజకుమారుడు’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు ఇలా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ఎన్నో హిట్ చిత్రాలు అందించారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ఖలేజా మూవీ వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో ‘గుంటూరు కారం’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.  ఈ చిత్రంలో దివంగత సూపర్ స్టార్ కృష్ణ భాగం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మూవీ సెకండాఫ్ లో తెరపై సూపర్ స్టార్ కృష్ణ కనిపించి సందడి చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. కాకపోతే ఈ విషయం గురించి చిత్ర యూనిట్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయలేదు. గతంలో కలిసుందాం రా, యమదొంగ లాంటి మూవీలో ఎన్టీఆర్ ని స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా చూపించారు. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇప్పుడు గుంటూరు కారం మూవీలో కూడా సూపర్ స్టార్ కృష్ణను స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా చూపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మూవీ జనవరి 12న థియేటర్లోకి రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంతేకాదు ఈ మధ్యనే ‘కుర్చీ మడత పెట్టి’ అనే  సాంగ్ లో మహేష్ బాబు, శ్రీలీల డ్యాన్స్ తో దుమ్మురేపారు. మొదటి నుంచి  ఈ మూవీలో మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రంలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించారు.  సోషల్ మీడియాలో నడుస్తున్న టాక్ ప్రకారం.. మహేష్ బాబు సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కనిపిస్తారు అనే వార్త నిజమైతే ఫ్యాన్స్ కి పండగే పండగ. ఎందుకంటే వెండితెరపై చాలా కాలం తర్వాత ఈ సూపర్ స్టార్స్ ని చూసే అవకాశం ఉంటుంది.. ఇది మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఫీస్ట్ అని చెప్పవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి