iDreamPost

Rohit Sharma: భారత్​కు రోహిత్ శర్మే దిక్కు.. 2 సూపర్ ఓవర్లు నేర్పిన పాఠం ఇదే..!

IND vs AFG: అఫ్గాన్ తో జరిగిన మూడో టీ20లో రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కళ్లు చెదిరే బ్యాటింగ్ తో జట్టుకు విజయాన్ని అందించాడు. టీమిండియాకు ఇప్పటికీ.. ఎప్పటికీ రోహిత్ మాత్రమే దిక్కు అనేది స్పష్టం అయిపోయింది.

IND vs AFG: అఫ్గాన్ తో జరిగిన మూడో టీ20లో రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కళ్లు చెదిరే బ్యాటింగ్ తో జట్టుకు విజయాన్ని అందించాడు. టీమిండియాకు ఇప్పటికీ.. ఎప్పటికీ రోహిత్ మాత్రమే దిక్కు అనేది స్పష్టం అయిపోయింది.

Rohit Sharma: భారత్​కు రోహిత్ శర్మే దిక్కు.. 2 సూపర్ ఓవర్లు నేర్పిన పాఠం ఇదే..!

భారత్ -అఫ్గాన్ మధ్య జరిగిన మూడో టీ20లో రోహిత్ శర్మ మెరుపు బ్యాటింగ్ తో అదరగొట్టారు. అఫ్గాన్ బౌలర్లకు చుక్కులు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తన బ్యాటుతో విరుచుకుపడ్డాడు. ఏ బౌలర్ను వదిలిపెట్టలేదు.. గ్రౌండ్ లో ఏ ప్లేస్ ను వదల్లేదు. సిక్సులు, బౌండరీలతో మరోసారి రోహిత్ తన సత్తా ఏంటో చూపించాడు. హిట్ మ్యాన్ చెలరేగి ఆడుతున్న సమయంలో గ్రౌండ్ లోని అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. రోహిత్ శర్మ ధాటికి అఫ్ఘాన్ విలవిల్లాడింది. అయితే ఈ మ్యాచ్ ద్వారా టీమిండియాకు రోహిత్ శర్మ ఎంత అవసరమే తేలిపోయింది. కుర్ర ఆటగాళ్ల ఆటతీరు చూస్తుంటే రాబోయే వరల్డ్ కప్ లో హిట్ మ్యాన్ అత్యంత కీలకం అని చెప్పాల్సిందే.

అఫ్గాన్ తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో రోహిత్ శర్మ (69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 నాటౌట్) రికార్డ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసి అఫ్గాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కాగా టీమిండియాలో రోహిత్ శర్మకు ప్రత్యామ్నాయ బ్యాటర్ కనిపించడం లేదు. జట్టులో యంగ్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నారు. కీలకమైన సమయంలో చేతులెత్తేస్తున్నారు. అఫ్గాన్ తో జరిగిన మూడోటీ20 మ్యాచ్ టై అయిన విషయం తెలిసిందే. దీంతో సూప్ ఓవర్ కు దారితీసింది. ఒకటి కాదు ఏకంగా రెండు సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది. సూపర్ ఓవర్స్ కారణంగా జట్టుకు రోహిత్ ఎంత కీలకమో స్పష్టంగా తెలిసొచ్చింది.

మొదటి సూపర్ ఓవర్లో అఫ్గాన్ 16 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఒమర్జాయ్ వేసిన తొలి రెండు బంతులకు సింగిల్స్ మాత్రమే వచ్చాయి. తర్వాతి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన రోహిత్ శర్మ ఐదో బంతికి సింగిల్ తీసాడు. దీంతో రెండో సూపర్ ఓవర్‌కు అనివార్యమైంది. రెండో సూపర్ ఓవర్లో కూడా రోహిత్ శర్మ అదే జోరు కొనసాగించాడు. ఫరీద్ అహ్మద్ బౌలింగ్ లో తొలి రెండు బంతులును 6,4గా మలిచిన రోహిత్ మూడో బంతికి సింగిల్ తీసాడు. మొత్తంగా రెండు సూపర్ ఓవర్లలో కూడా రోహిత్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. జట్టుకు కీలకమైన సమయంలో యంగ్ ప్లేయర్స్ సూపర్ ఓవర్ టైమ్ లో రన్స్ రాబట్ట లేక పోయారు. రోహిత్ లేకుంటే మ్యాచ్ చేజారే పరిస్థితి కనిపించింది. సూపర్ ఓవర్స్ కారణంగా రోహిత్ శర్మ విలువేంటో తెలిసొచ్చింది. వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ అత్యంత కీలకం అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి