iDreamPost

సుక్కు నెక్ట్స్ లెవల్ ప్లానింగ్.. రష్మిక ఎక్స్‌ట్రా డేట్స్!

Rashmika- Sukumar: పుష్ప 2 సినిమాని సుకుమార్ ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా కోసం సుక్కు నెక్ట్స్ లెవల్ ప్లానింగ్ తో వస్తున్నాడు.

Rashmika- Sukumar: పుష్ప 2 సినిమాని సుకుమార్ ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా కోసం సుక్కు నెక్ట్స్ లెవల్ ప్లానింగ్ తో వస్తున్నాడు.

సుక్కు నెక్ట్స్ లెవల్ ప్లానింగ్.. రష్మిక ఎక్స్‌ట్రా డేట్స్!

ప్రస్తుతం ఇండస్ట్రీ మూడు హిట్లు, ఆరు రికార్డులతో కళకళాడిపోతోంది. ఇప్పుడే ఇన్ని సంబరాలు చేసుకుంటే ఇంకా రావాల్సిన అసలు సిసలు సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా వినపడే పేరు పుష్ప-2. ఈ సీక్వెల్ కోసం పాన్ ఇండియా లెవల్లో ఉన్న మూవీ లవర్స్ అంతా తెగ ఎదురుచూస్తున్నారు. పుష్పరాజ్ రూలింగ్ ఎప్పుడు ప్రారంభిస్తాడా అంటూ ఆసక్తి పెంచేసుకుంటున్నారు. అయితే పుష్పరాజ్ వెనక్కి తగ్గాడు అంటూ చాలానే వార్తలు వచ్చాయి. కానీ, టీమ్ మాత్రం వెనక్కి తగ్గదేలే అంటూ అధికారికంగా ప్రకటించింది. ఇంకేముంది బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పుడు ఇంకో నెక్ట్స్ లెవల్ గుడ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.

అంతమాత్రం అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్లో క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. పుష్ప సినిమా సక్సెస్ తర్వాత సుకుమార్ పై బాధ్యత మరింత పెరిగింది. నిజానికి పుష్ప సినిమాలో కేవలం ఫ్లాష్ బ్యాక్ మాత్రమే చూపించారు. ఇప్పటి నుంచే అసలైన కథ మొదలవుతుంది. పుష్పరాజ్ లైఫ్ లో కూడా అసలైన కష్టాలు కూడా పార్ట్ 2లోనే మొదలు కాబోతున్నాయి. అందుకే ఆ సినిమాపై సుకుమార్ మరింత శ్రద్ధ పెట్టాడు. అసలే అనుకున్న రీతిలో అవుట్ పుట్ రాకపోతే ఎన్నిసారైలైనా రీషూట్ చేయడానికి కూడా సుకుమార్ వెనుకాడడు అని అందరికీ తెలిసిందే. ఇంక స్పెషల్ ఫోకస్ పెట్టిన పుష్ప 2 సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అనే అంచనాలు ఇప్పటి నుంచే పెరిగిపోతున్నాయి. ఇప్పుడు సినిమాకి సంబంధించి మరో క్రేజీ వార్త ఒకటి వైరల్ అవుతోంది.

యానిమల్ కి మంచి:

ఆ వైరల్ వార్త ఏంటంటే.. పుష్ప 2 సినిమా కోసం రష్మికా మందన్నా ను ఎక్స్ ట్రా డేట్ అడిగారంట. ఇప్పటికే తీసుకున్న డేట్స్ కి అదనంగా 15 రోజులు కావాలని సుకుమార్ కోరారట. అందుకు పెద్ద కారణమే ఉంది. సినిమా కథలో యాక్షన్, ఎమోషన్ మాత్రమే కాకుండా.. రొమాన్స్ యాంగిల్ ని కూడా నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. యానిమల్ సినిమాలో రష్మిక- రణ్ బీర్ రొమాన్స్ పార్ట్ కి మించి ఇది ఉంటుందని చెబుతున్నారు. అందుకోసమే కథలో కాస్త మార్పులు, బన్నీ- రష్మీక సీక్వెన్స్ కోసమే ఎక్స్ ట్రా డేట్స్ అడిగారంట.

అలాగే మొదటి పార్ట్ లో హైలెట్ అయిన కేశవ పాత్ర ఇప్పుడు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుందని చెబుతున్నారు. అతని వల్ల ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడం, ఆ కేసులో జైలుకు వెళ్లడం అందరికీ తెలిసిందే. జగదీశ్ కు పుష్ప సినిమా టీమే బెయిల్ ఇచ్చి బయటకు తెచ్చింది అని కూడా చెబుతున్నారు. అయితే కేశవ పాత్రను ట్రిమ్ చేసి రష్మిక- బన్నీ సీక్వెన్స్ ని పెంచాలని భావిస్తున్నారట. అందుకే కథలో ఇప్పుడు యాక్షన్ మాత్రమే కాకుండా రొమాంటిక్ యాంగిల్ కూడా పెరుగుతుందని చెబుతున్నారు. మరి.. పుష్ప-2 కోసం సుక్కు వేస్తున్న మాస్టర్ ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి